రాత్రి భోజనం తర్వాత పండ్లు తింటున్నారా...? డాక్టర్ చెబుతున్న ఈ విషయాలు తెలుసుకోండి

Eating fruits after Dinner : భోజనం తర్వాత తీపికి బదులు పండ్లు తినడం ఆరోగ్యకరం అనుకుంటాం. కానీ, రాత్రిపూట పండ్లు తినడం వల్ల జీర్ణక్రియపై పడే ప్రభావం గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు రావొచ్చు.

Published on: May 13, 2026, 08:49:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Eating fruits after dinner : రాత్రి భోజనం ముగించగానే ఏదో ఒక తీపి పదార్థం తినాలనిపించడం చాలామందికి అలవాటు. అయితే ఐస్‌క్రీమ్‌లు లేదా స్వీట్లు ఆరోగ్యానికి అంత మంచిది కాదని భావించి…. చాలామంది పోషకాలతో నిండిన పండ్లను ఎంచుకుంటారు. పండ్లు ఆరోగ్యకరమే అయినప్పటికీ, వాటిని తినే సమయం కూడా అంతే ముఖ్యం. భోజనం తర్వాత పండ్లు తినడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయనే అంశంపై ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సాహిల్ నోహ్రియా పలు కీలక విషయాలను వివరించారు.

రాత్రి భోజనం తర్వాత పండ్లు తింటున్నారా...? (Picture credit: Freepik)
రాత్రి భోజనం తర్వాత పండ్లు తింటున్నారా...? (Picture credit: Freepik)

జీర్ణక్రియలో జాప్యం.. అసలు కారణం ఇదే!

సాధారణంగా పండ్లు చాలా తేలికగా జీర్ణమవుతాయి. ఇవి కడుపులోకి వెళ్ళిన 20 నుంచి 40 నిమిషాల్లోనే జీర్ణం కావాల్సి ఉంటుంది. కానీ, భారీ భోజనం చేసిన వెంటనే పండ్లను తింటే సమస్యలు మొదలవుతాయి. మన శరీరం అప్పటికే భోజనంలోని కొవ్వులు, కార్బోహైడ్రేట్లను అరిగించే పనిలో ఉండటం వల్ల, పండ్లు జీర్ణాశయంలో ఎక్కువ సేపు ఉండిపోవాల్సి వస్తుంది. ఈ జాప్యం వల్ల పండ్లలోని చక్కెరలు, ఫైబర్ కడుపులో పులిసిపోయే (Fermentation) అవకాశం ఉందని డాక్టర్ నోహ్రియా హెచ్చరించారు.

కనిపించే లక్షణాలు:

  • కడుపు ఉబ్బరం (Bloating) మరియు గ్యాస్ సమస్యలు.
  • అధికంగా తేన్పులు రావడం మరియు పొట్ట బిగుతుగా అనిపించడం.
  • కడుపులో తిమ్మిర్లు లేదా అసౌకర్యంగా అనిపించడం.
  • జీర్ణవ్యవస్థ రాత్రిపూట అధిక పనిభారానికి గురికావడం వల్ల నిద్రకు అంతరాయం కలగడం.

ఏ పండ్లు దూరంగా ఉంచాలి….?

అన్ని రకాల పండ్లు ఇబ్బంది కలిగించవు, కానీ కొన్ని పండ్ల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆపిల్స్, బేరి (Pears), మామిడి పండ్లు, పుచ్చకాయల్లో 'ఫ్రక్టోజ్' అనే సహజ చక్కెర అధికంగా ఉంటుంది. శరీరం ఈ ఫ్రక్టోజ్‌ను సరిగ్గా గ్రహించలేకపోతే….. అది ప్రేగుల్లో ఎక్కువ సేపు ఉండిపోయి, బ్యాక్టీరియా ద్వారా పులిసిపోయేలా చేస్తుంది. ఫలితంగా తీవ్రమైన గ్యాస్, ఉబ్బరం కలుగుతాయి.

ముఖ్యంగా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) లేదా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు రాత్రిపూట పండ్లకు దూరంగా ఉండటం మంచిది. ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండే ఆహారాలు వీరిలో కడుపు తిమ్మిర్లు, క్రమరహిత ప్రేగు కదలికలను ప్రేరేపిస్తాయి.

జీర్ణక్రియ సజావుగా సాగాలంటే భోజనంతో కలిపి కాకుండా, విడిగా పండ్లను తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం భోజనానికి ముందు (Mid-morning) లేదా సాయంత్రం వేళల్లో స్నాక్స్‌గా పండ్లు తీసుకోవడం మంచిది. ప్రతి ఒక్కరి జీర్ణశక్తి వేర్వేరుగా ఉంటుంది కాబట్టి, మీ శరీర ప్రతిస్పందనను బట్టి పండ్లు తినే సమయాన్ని నిర్ణయించుకోవాలి

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More