నీతా అంబానీ రాయల్ లుక్: 4 నెలలు శ్రమించి నేసిన గులాబీ కంజీవరం చీర
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ మరోసారి తన రాయల్ లుక్‌తో ఆకట్టుకున్నారు. చేనేత నిపుణుడు రాజేష్ షా 4 నెలల పాటు శ్రమించి తయారు చేసిన పేస్టల్ పింక్ కంజీవరం పట్టుచీరలో ఆమె మెరిసిపోతున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
భారతీయ సాంప్రదాయ వస్త్ర శ్రేణికి, చేనేత కళాకారులకు ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో నీతా అంబానీ ఎప్పుడూ ముందుంటారు. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ తాజాగా మరో అద్భుతమైన చేనేత చీరలో ప్రత్యక్షమై అందరి దృష్టినీ ఆకర్షించారు. భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా ఆమె ధరించిన లేత గులాబీ రంగు (పేస్టల్ పింక్) కంజీవరం పట్టుచీర ఇప్పుడు సోషల్ మీడియాలో విశేషంగా నిలుస్తోంది.

4 నెలల శ్రమ.. స్వదేశ్ ప్రత్యేకత
అక్టోబర్ 25న 'స్వదేశ్' అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో నీతా అంబానీ కొత్త ఫోటోలను పంచుకున్నారు. కాంచీపురం చేనేత సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఈ చీరను మాస్టర్ చేనేత నిపుణుడు రాజేష్ షా దాదాపు నాలుగు నెలల పాటు శ్రమించి సిద్ధం చేశారు. నాణ్యమైన మల్బరీ పట్టుతో రూపొందించిన ఈ రాయల్ చీరలో బంగారం, స్వచ్ఛమైన వెండి జరీ వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రూపకల్పనలో ఆధ్యాత్మిక శోభ
ఈ గులాబీ రంగు కంజీవరం చీరపై క్లిష్టమైన 'కట్టం చెక్స్' (గ్రిడ్ ప్యాటర్న్) నేశారు. వెండి జరీ వెలుగులు చీరకు మెరుపును తెచ్చిపెట్టగా, సంప్రదాయానికి ప్రతీకలైన 'మయిల్' (నెమలి), 'రుద్రాక్ష' డిజైన్లు ఆధ్యాత్మిక శోభను చేకూర్చాయి. చీర పల్లూ చివర అందించిన కుచ్చులు (టాసెల్స్) ఈ కంజీవరం లుక్కు పరిపూర్ణతను ఇచ్చాయి. దీనికి జంటగా నీతా అంబానీ మెటాలిక్ షీన్ ఉన్న సిల్వర్-గ్రే రంగు బ్లౌజ్‌ను ఎంచుకున్నారు.
రాజస్థానీ రాయల్ జ్యువెలరీ మెరుపులు
చీరకు తగ్గట్టుగానే నీతా అంబానీ ధరించిన ఆభరణాలు రాజసాల్ని ఒలికించాయి. రాజస్థాన్ రాచరిక ఆభరణాల శైలితో రూపొందించిన మల్టీ-స్ట్రాండ్ హారాన్ని ఆమె ధరించారు. సాంప్రదాయ 'తప్పా' టెక్నిక్ ఉపయోగించిన బంగారు బార్లు, ముత్యాల హారాలు, సహజమైన 'పోల్కీ' వజ్రాలు ఈ హారంలో మెరుస్తున్నాయి.
దీనికి తోడు పెద్ద ఇయర్రింగ్స్, స్టేట్మెంట్ రింగ్, పింక్ రంగు గాజులు ఆమెకు మరింత రాయల్ లుక్‌ను అందించాయి. నుదుటన ఎర్రటి బొట్టు, మిడిల్ పార్టిషన్ హెయిర్‌స్టైల్, కాంతివంతమైన మేకప్‌తో నీతా అంబానీ భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల ప్రతిరూపంలా మెరిసారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


