మద్యం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. కానీ, "ఎప్పుడో ఒకసారి తాగితే ఏమవుతుంది? మితంగా తాగితే ఆరోగ్యానికి మంచిదే కదా!" అనే అపోహ చాలా మందిలో ఉంది. సోషల్ డ్రింకింగ్ లేదా అప్పుడప్పుడు తాగడం వల్ల ప్రాణాపాయం ఉండదని భావించే వారిని హెచ్చరిస్తూ గుజరాత్‌కు చెందిన ఒక ప్రముఖ వైద్యుడు షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.

వడోదరకు చెందిన ప్రివెంటివ్ అండ్ డయాగ్నోస్టిక్ రేడియాలజిస్ట్ డాక్టర్ హర్ష్ వ్యాస్, ఒక 28 ఏళ్ల యువకుడి కాలేయానికి (Liver) సంబంధించిన అల్ట్రాసౌండ్ రిపోర్ట్‌ను పంచుకున్నారు. ఆ నివేదిక చూసిన వైద్యులే విస్తుపోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మృత్యువు అంచున 28 ఏళ్ల యువకుడు
డాక్టర్ వ్యాస్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఒక షాకింగ్ ఇమేజ్‌ను షేర్ చేస్తూ.. "ఇది కేవలం అప్పుడప్పుడు మాత్రమే మద్యం తాగుతానని చెప్పే ఒక 28 ఏళ్ల యువకుడి కాలేయం అల్ట్రాసౌండ్ చిత్రం. మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఎవరికైనా ఈ ఫొటో చూడగానే అర్థమవుతుంది.. ఇది లివర్ సిర్రోసిస్ (Liver Cirrhosis) అనే ప్రమాదకర స్థితికి చేరుకుందని. ఇది క్యాన్సర్‌కు ముందు వచ్చే దశ, దీనిని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురాలేం" అని వివరించారు.
"నా కొడుకు కోలుకుంటాడు కదా డాక్టర్?"
ఆ యువకుడి పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని డాక్టర్ వ్యాస్ ఆవేదన వ్యక్తం చేశారు. "రోగి పొత్తికడుపులో విపరీతంగా నీరు (Ascites) చేరిపోయింది. దానివల్లే అతను తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు. అతని తల్లి నా దగ్గరకు వచ్చి.. 'డాక్టర్, నా కొడుకు కోలుకుంటాడు కదా? తనకేం కాదు కదా?' అని అడిగారు. కానీ పరిస్థితి అప్పటికే చేయి దాటిపోయిందని నాకు, ఆ రోగికి తెలుసు. అది ముదిరిపోయిన దశ" అని ఆయన పేర్కొన్నారు.
లివర్ సిరోసిస్ వంటి పరిస్థితుల్లో వైద్యులకు కూడా పరిమితమైన అవకాశాలే ఉంటాయని ఆయన వివరించారు. ఇలాంటి స్థితిలో 'లివర్ ట్రాన్స్‌ప్లాంట్' (కాలేయ మార్పిడి) ఒక్కటే మార్గమని, కానీ అది అందరికీ సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
విషంతో ప్రయోగాలు వద్దు
{{/usCountry}}లివర్ సిరోసిస్ వంటి పరిస్థితుల్లో వైద్యులకు కూడా పరిమితమైన అవకాశాలే ఉంటాయని ఆయన వివరించారు. ఇలాంటి స్థితిలో 'లివర్ ట్రాన్స్‌ప్లాంట్' (కాలేయ మార్పిడి) ఒక్కటే మార్గమని, కానీ అది అందరికీ సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
విషంతో ప్రయోగాలు వద్దు
{{/usCountry}}మద్యం అలవాటు ఉన్నవారు లేదా తమ సన్నిహితుల్లో ఎవరైనా తాగుతుంటే వారికి ఈ సమాచారాన్ని చేరవేయాలని డాక్టర్ వ్యాస్ కోరారు. "మద్యం క్రమం తప్పకుండా తాగుతూ కూడా ఇప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నామంటే, మీకు ఏమీ కాదని అర్థం కాదు. ఆ విషం ఇంకా మీ శరీరంపై ప్రభావం చూపడం మొదలుపెట్టలేదని మాత్రమే అర్థం. విషంతో ఎవరూ ప్రయోగాలు చేయకూడదు" అని ఆయన హెచ్చరించారు.
సమాజంలో ఉన్న "లిమిటెడ్ డ్రింకింగ్" అనే భ్రమను వీడి, ప్రాణాల మీదకు రాకముందే మేల్కోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
(గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందింది.)