Iron absorption Foods Combination : శరీరంలో విపరీతమైన అలసట, నీరసం, కాళ్లూ చేతుల బలహీనత, తక్కువ శక్తి (Low Energy) కి ప్రధాన కారణం హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోవడమే. రక్తహీనత (Anemia) బారిన పడినప్పుడు చాలామంది ఇనుము (ఐరన్) అధికంగా ఉండే ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకుంటారు. అయినప్పటికీ, చాలా మందిలో హిమోగ్లోబిన్ శాతం ఆశించిన స్థాయిలో పెరగదు. "నేను ఐరన్ ఫుడ్స్ బాగానే తింటున్నాను, అయినా రక్తం ఎందుకు పెరగడం లేదు..?" అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

వాస్తవానికి, మనం తినే ఆహారంలో ఐరన్ ఎంత ఉందనేదాని కంటే, ఆ ఐరన్‌ను మన శరీరం ఏ మేరకు లోపలికి గ్రహిస్తోంది అనేదే ఇక్కడ అత్యంత ముఖ్యం. శరీరంలో ఐరన్ శోషణ సరిగ్గా జరగనప్పుడు…. మీరు ఎంత మంచి ఆహారం తిన్నా ప్రయోజనం శూన్యం. ఈ సమస్యకు చెక్ పెడుతూ, శరీరంలో ఐరన్ శోషణను వేగవంతం చేసి హిమోగ్లోబిన్‌ను పెంచే 5 శక్తివంతమైన పద్ధతులను డాక్టర్ హర్షిణి జైన్ వివరించారు.
1. జీర్ణక్రియను మెరుగుపరచడం :
శరీరంలో ఐరన్ పూర్తిగా శోషించబడాలంటే మన జీర్ణక్రియ అద్భుతంగా ఉండాలి. ముఖ్యంగా జీర్ణాశయంలో ఉండే స్టమక్ యాసిడ్ పరిమాణం సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే మనం తినే ఆహారం బాగా జీర్ణమై, అందులోని పోషకాలను శరీరం గ్రహించగలుగుతుంది.
- డాక్టర్ చిట్కా : స్టమక్ యాసిడ్‌ను సహజంగా పెంచడానికి ఒక చిన్న అల్లం ముక్కను నిమ్మరసంలో అరగంట పాటు నానబెట్టండి. భోజనం చేయడానికి సరిగ్గా పది నిమిషాల ముందు ఆ అల్లం ముక్కను బాగా నమిలి తినండి. ఇది మీ జీవక్రియను వేగవంతం చేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
2. గట్ హెల్త్ పై ఫోకస్ :
ఐరన్ లోపాన్ని అధిగమించాలంటే ముందుగా మీ గట్ హెల్త్ (ప్రేగుల ఆరోగ్యం) ను మెరుగుపరుచుకోవాలి. ఎందుకంటే ప్రేగుల ఆరోగ్యమే శరీరంలోని మిగిలిన అన్ని అవయవాల పనితీరును నియంత్రిస్తుంది. మీకు నిరంతరం కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఉంటే…. ముందుగా వాటిని నయం చేసుకోవాలి. ప్రేగులు ఆరోగ్యంగా లేకపోతే ఐరన్ శోషణ అసలు జరగదు.
3. కేవలం ఐరన్ మాత్రమే కాదు :
{{/usCountry}}ఐరన్ లోపాన్ని అధిగమించాలంటే ముందుగా మీ గట్ హెల్త్ (ప్రేగుల ఆరోగ్యం) ను మెరుగుపరుచుకోవాలి. ఎందుకంటే ప్రేగుల ఆరోగ్యమే శరీరంలోని మిగిలిన అన్ని అవయవాల పనితీరును నియంత్రిస్తుంది. మీకు నిరంతరం కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఉంటే…. ముందుగా వాటిని నయం చేసుకోవాలి. ప్రేగులు ఆరోగ్యంగా లేకపోతే ఐరన్ శోషణ అసలు జరగదు.
3. కేవలం ఐరన్ మాత్రమే కాదు :
{{/usCountry}}శరీరంలో రక్తం తక్కువగా ఉందని కేవలం ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు మాత్రమే తింటే ఫలితం ఉండదు. ఆహారం ఎల్లప్పుడూ సమతుల్యంగా ఉండాలి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఐరన్‌తో పాటు ప్రోటీన్, విటమిన్ B12, విటమిన్ B6 వంటి పోషకాలు కూడా ఎంతో అవసరం.
- ఉదాహరణకు : చాలామంది రక్తం పెరగడానికి కేవలం బీట్‌రూట్ రసం మాత్రమే తాగుతుంటారు. కానీ కేవలం బీట్‌రూట్ రసం వల్ల ఐరన్ పూర్తిగా అందదు. బీట్‌రూట్ రసంలో విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరికాయను కూడా కలిపి జ్యూస్ లాగా చేసుకుని తాగితే అద్భుతమైన ఫలితం ఉంటుంది.
4. నిర్విషీకరణ:
ఈ రోజుల్లో జంక్ ఫుడ్ తినడం, అనారోగ్యకరమైన జీవనశైలి, విపరీతమైన మానసిక ఒత్తిడి మరియు నిద్రలేమి కారణంగా శరీరంలో అంతర్గత వాపులు పెరుగుతాయి. ఇది కాలేయాన్ని (Liver) తీవ్రంగా దెబ్బతీస్తుంది. కాలేయంపై ఒత్తిడి పడితే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు తగినంత నిద్ర… ఒత్తిడి లేని జీవితం చాలా అవసరం. దీనివల్ల కాలేయం తనను తాను డిటాక్స్ చేసుకునే అవకాశం లభిస్తుంది.
- డైట్ మార్పు: మీ ఆహారంలో కాకరకాయ, చేదు కూరగాయల సూప్స్ వంటి కొద్దిగా చేదు రుచి ఉండే పదార్థాలను చేర్చుకోండి. ఇవి కాలేయ పనితీరును మెరుగుపరిచి శరీరంలో ఐరన్ శోషణను పెంచుతాయి.
5. కాంబినేషన్ ఫుడ్స్ తీసుకోవడం:
మీరు ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని తింటున్నప్పుడు, దాంతో పాటు ఏ ఆహారాన్ని కలిపి తీసుకుంటున్నారనేది చాలా ముఖ్యం. ఐరన్ శరీరానికి అబ్బాలంటే దానికి 'విటమిన్ సి' తోడు కావాలి.
- ఉదాహరణకు : మీరు వేయించిన శనగలు, ఖర్జూరాలు లేదా బీట్‌రూట్‌ను బెల్లంతో కలిపి తింటున్నప్పుడు…. వాటితో పాటు విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మరసం లేదా ఉసిరికాయ వంటి ఆహారాలను కలిపి తీసుకోవాలి. విటమిన్ సి తోడైనప్పుడే ఆహారంలోని ఐరన్‌ను శరీరం పూర్తిగా శోషించుకోగలదు.