హనుమంతుడు కేవలం ఒక పురాణ పురుషుడు మాత్రమే కాదు, నేటి కాలానికి కూడా సరిపోయే అద్భుతమైన మేనేజ్‌మెంట్ పాఠాలకు, వ్యక్తిత్వ వికాసానికి (Personality Development) నిలువెత్తు నిదర్శనం. ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, జీవిత సత్యాలు ఇక్కడ ఉన్నాయి.
అచంచలమైన భక్తి, అంకితభావం

హనుమంతుడు రామకార్యం పట్ల చూపిన అంకితభావం అద్భుతం. లంకలో సీతమ్మను వెతకడం నుంచి, లక్ష్మణుడి ప్రాణ రక్షణ కోసం సంజీవని పర్వతాన్ని మోసుకురావడం వరకు ఆయన ఎక్కడా అలసట చెందలేదు.
మనం చేసే పని చిన్నదైనా, పెద్దదైనా దాని పట్ల పరిపూర్ణమైన అంకితభావంతో ఉండాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం.
సమయస్ఫూర్తి, తెలివితేటలు
సముద్రాన్ని దాటేటప్పుడు సురస అనే రాక్షసి ఎదురైనప్పుడు, హనుమంతుడు తన రూపం పెంచి, చివరగా చిన్నగా మారి ఆమె నోటిలోకి వెళ్లి బయటకు వస్తాడు. ఇక్కడ ఆయన బలాన్ని కాకుండా తెలివితేటలను ఉపయోగించాడు.
ప్రతి సమస్యను శక్తితోనే పరిష్కరించలేం. కొన్నిసార్లు పరిస్థితులకు అనుగుణంగా మన వ్యూహాన్ని మార్చుకోవాలి. తెలివిగా వ్యవహరించాలి. అవతలివారిని కొన్నిసార్లు కన్ఫ్యూజ్ కూడా చేయాలి.
వినయం - అసలైన ఆభరణం
అపారమైన శక్తులు ఉన్నా, ఆంజనేయుడు ఎప్పుడూ తనను తాను కేవలం 'రామ సేవకుడి'గానే చెప్పుకున్నాడు. లంకలో రావణుడి ఎదుట నిలబడినప్పుడు కూడా ఆయన గర్వం ప్రదర్శించలేదు.
మనకు ఎంతటి అధికారం, సంపద వచ్చినా వినయం వీడకూడదు. అహంకారం లేని చోటే జ్ఞానం వృద్ధి చెందుతుంది. అంతేకాదు అందరికీ మీరు నచ్చుతారు.
కమ్యూనికేషన్ స్కిల్స్
హనుమంతుడు సీతమ్మతో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా పదాలను ఎంచుకుంటాడు. రామలక్ష్మణులను మొదటిసారి కలిసినప్పుడు ఆయన మాట్లాడిన తీరు చూసి రాముడు ముగ్ధుడై, "ఈయన గొప్ప వ్యాకరణ వేత్త" అని కొనియాడతాడు.
{{/usCountry}}హనుమంతుడు సీతమ్మతో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా పదాలను ఎంచుకుంటాడు. రామలక్ష్మణులను మొదటిసారి కలిసినప్పుడు ఆయన మాట్లాడిన తీరు చూసి రాముడు ముగ్ధుడై, "ఈయన గొప్ప వ్యాకరణ వేత్త" అని కొనియాడతాడు.
{{/usCountry}}ఎదుటివారి మనసు నొప్పించకుండా, స్పష్టంగా, మర్యాదగా మాట్లాడటం గొప్ప నాయకత్వ లక్షణం. ఇదే అందరినీ మీకు దగ్గరగా చేస్తుంది.
నాయకత్వం
వానర సైన్యంతో కలిసి పని చేసేటప్పుడు ఆయన అందరినీ ప్రోత్సహిస్తాడు. తాను గొప్పవాడినని కాకుండా, అందరినీ కలుపుకొనిపోతాడు. అందరం కలిసి పనిచేస్తేనే ముందుకుసాగుతాం అని భరోసా ఇస్తాడు.
ఒక గొప్ప విజయం వెనుక సమిష్టి కృషి ఉంటుంది. నలుగురిని కలుపుకొనిపోయేవారే నిజమైన నాయకులు అని హనుమంతుడి ద్వారా అర్థమవుతుంది..
హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద సత్యం ఏమిటంటే.. నమ్మకం, ప్రయత్నం తోడైతే అసాధ్యం అంటూ ఏదీ లేదు. ఆయన తన శక్తులను ఇతరుల మేలు కోసం, ధర్మ రక్షణ కోసం ఉపయోగించాడు. మనం కూడా మన సామర్థ్యాన్ని సమాజ హితం కోసం ఉపయోగిస్తే మన జీవితం సార్థకమవుతుంది.