Today Horoscope: ఈరోజు మంగళవారం+ హనుమాన్ జయంతి.. పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? వారికి అదృష్టం, ఆర్థిక లాభం!

Today Horoscope: మే 12, మంగళవారం నాటి ద్వాదశ రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఆంజనేయ స్వామి ఆరాధనతో ఏ రాశుల వారికి కష్టాలు తొలగి అదృష్టం వరిస్తుందో, ఎవరు అప్రమత్తంగా ఉండాలో వివరణాత్మక విశ్లేషణ మీకోసం.

Published on: May 12, 2026, 04:00:55 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నవగ్రహాల గమనం, నక్షత్రాల స్థితిగతులను బట్టి మన దైనందిన జీవితంలో మార్పులు సంభవిస్తుంటాయి. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం మే 12వ తేదీ మంగళవారం కొన్ని రాశుల వారికి అద్భుతమైన యోగాలను కలిగిస్తుండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. మంగళవారం అంటేనే సాక్షాత్తూ ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన రోజు.

Today Horoscope: ఈరోజు మంగళవారం+ హనుమాన్ జయంతి వేళ పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? (pinterest)
Today Horoscope: ఈరోజు మంగళవారం+ హనుమాన్ జయంతి వేళ పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? (pinterest)

ఈ రోజున బజరంగబలిని నిష్టతో పూజిస్తే భయం, రోగాలు, మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా కుజ దోష ప్రభావం ఉన్నవారు, శని ప్రభావంతో ఇబ్బంది పడేవారు హనుమంతుడిని వేడుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి.

ఈరోజు మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి జాతకం ఎలా ఉందో చూడండి

మేష రాశి

ఈరోజు ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. అనవసరమైన ఆర్భాటాలకు పోయి బడ్జెట్ దాటొద్దు. మీపై మీకు ఉన్న నమ్మకాన్ని మళ్లీ పుంజుకునే సమయం ఇది. వృత్తిపరంగా మీ లక్ష్యాల వైపు దూసుకెళ్లేందుకు ఒక అరుదైన అవకాశం తలుపు తడుతుంది. మీ సృజనాత్మకత, మేధస్సు ఈ రోజు మీకు శ్రీరామరక్షగా నిలుస్తాయి.

వృషభ రాశి

విలాసవంతమైన వస్తువుల కొనుగోలు కోసం ఈ రోజు ధనం ఖర్చు చేసే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులు, పైఅధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఆర్థికంగా లాభపడే సూచనలు బలంగా ఉన్నాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ, మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.

మిథున రాశి

ఉద్యోగస్తులకు ఈ రోజు పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు సాధించాలంటే సాధారణం కంటే ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం ప్రశాంతతను ఇస్తుంది. ఆరోగ్య విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు లేదా వాహనం నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు శుభవార్తలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరగడమే కాకుండా, పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ రోజు లాభసాటిగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం వరిస్తుంది. ఉద్యోగ వేటలో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభించే ఆస్కారం ఉంది.

సింహ రాశి

మనస్సులో ప్రతికూల ఆలోచనలు చోటు చేసుకోకుండా చూసుకోవాలి. అనవసర ఆందోళనల వల్ల మీ ఆర్థిక ప్రణాళికలు దెబ్బతినవచ్చు. పిల్లల ప్రవర్తన లేదా వారి చదువుకు సంబంధించిన విషయాలు మిమ్మల్ని కొంత కలవరపెట్టవచ్చు. అయితే, పట్టుదలతో ప్రయత్నిస్తే ఒక ముఖ్యమైన పనిలో విజయం సాధిస్తారు.

కన్యా రాశి

నేడు కన్యా రాశి వారు వృత్తి లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలో అజాగ్రత్త వద్దు. ఇంటికి అవసరమైన వస్తువుల కోసం ఖర్చులు పెరగవచ్చు, ఇది మీ బడ్జెట్‌పై ప్రభావం చూపుతుంది. వ్యాపారస్తులకు ఈ రోజు కలిసి వచ్చే రోజు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. విజయం అందుకోవడానికి పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడాల్సి ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. రోజు మొదట్లో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, సాయంత్రానికి పరిస్థితి మెరుగుపడుతుంది.

వృశ్చిక రాశి

మిశ్రమ ఫలితాలు ఇచ్చే రోజు ఇది. ఉదయాన్నే కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ, వాటిని సమర్థవంతంగా అధిగమిస్తారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, మీ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, లేదంటే మాట పారేసుకుని ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది.

ధనుస్సు రాశి

మీ కష్టానికి తగిన ఫలితం లభించే రోజు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. అయితే, సాయంత్రం వేళ ధన లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. ఎవరికీ అప్పు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ చేయకపోవడమే మంచిది.

మకర రాశి

ఉద్యోగులపై పని భారం ఎక్కువగా ఉంటుంది. పనులను సకాలంలో పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. కుటుంబ జీవితం మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. బంధువుల నుంచి ఆశించిన సహకారం అందుతుంది. ఓర్పుతో వ్యవహరిస్తే క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడవచ్చు.

కుంభ రాశి

రోజు ముగిసే సమయానికి ఊహించని లాభాలు అందుతాయి. అయితే, ఏ పనిలోనూ నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదు. కార్యాలయంలో మీ వెనుక గోతులు తీసే 'గుప్త శత్రువుల' పట్ల అప్రమత్తంగా ఉండండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు సవాళ్లతో పాటు అద్భుతమైన అవకాశాలు కూడా ఎదురవుతాయి. మీ నైపుణ్యాలను నిరూపించుకోవడానికి ఇది సరైన సమయం. మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. ఇతరులతో సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టండి. జీవితంలో సమతుల్యత పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More