కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన ఫిట్‌నెస్ రహస్యాన్ని బహిర్గతం చేశారు. 56 ఏళ్ల వయసులోనూ ఆయనంత శారీరకంగా దృఢంగా, ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతున్నారో వివరించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా యువత, విద్యార్థులతో నిర్వహించిన 'ఆస్క్ మీ ఎనీథింగ్' (AMA) కార్యక్రమంలో తన వర్కౌట్ దినచర్యపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. "విద్యార్థులు, జెన్ జీ యూత్.. నన్ను ఏమైనా అడగండి, వీలైనన్ని ప్రశ్నలకు సమాధానమిస్తా" అని కోరడంతో ఒక నెటిజన్ ఆయన ఫిట్‌నెస్ దినచర్య గురించి ప్రశ్నించారు.
ఒకే రకమైన దినచర్య కాదు.. క్రమశిక్షణే ముఖ్యం

ఫిట్‌నెస్ సాధించడానికి ఏదో ఒక ప్రత్యేకమైన వర్కౌట్ ప్లాన్ ఉండాల్సిన అవసరం లేదని రాహుల్ చెప్పారు. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే అసలైన రహస్యమని స్పష్టం చేశారు.
"ఫిట్‌నెస్ విషయంలో మనం అనుసరించే వర్కౌట్ రకం కంటే, దానిని నిలకడగా, నిరంతరం చేయడం చాలా ముఖ్యం" అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
తన రోజువారీ కసరత్తుల్లో అనేక రకాల వ్యాయామాలు ఉంటాయని తెలిపారు. మార్షల్ ఆర్ట్స్, ఈత (స్విమ్మింగ్), రన్నింగ్‌తో పాటు ఇటీవల యోగాను కూడా తన దినచర్యలో భాగం చేసుకున్నట్లు చెప్పారు.
రాత్రి 11 గంటలైనా సరే కసరత్తులు ఆగవు
ఎంత బిజీగా ఉన్నప్పటికీ వ్యాయామానికి సమయం కేటాయించడంపై ఆయన మాట్లాడారు. రోజూ కనీసం ఒక గంట పాటు స్ట్రెంత్, ఏరోబిక్ సామర్థ్యం, ఫ్లెక్సిబులిటీ పెంచుకోవడానికి కేటాయిస్తానని తెలిపారు. వ్యాయామాన్ని ఖాళీ సమయంలో చేసే వ్యాపకంలా చూడకూడదని స్పష్టం చేశారు.
"సమయం దొరికినప్పుడు చేసేది కాదు వ్యాయామం. షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా దీని కోసం సమయం కేటాయించి తీరాలి. అవసరమైతే రాత్రి 11 గంటలకు అయినా సరే నా వర్కౌట్ పూర్తి చేస్తాను" అని రాహుల్ వివరించారు.
జెన్ జీ కి రాహుల్ ఇచ్చిన హెల్త్ టిప్స్
నేటి యువతకు రాహుల్ గాంధీ కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. కేవలం వ్యాయామం మాత్రమే సరిపోదని, సరైన ఆహార అలవాట్లు లేకపోతే వర్కౌట్ల వల్ల ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.
{{/usCountry}}నేటి యువతకు రాహుల్ గాంధీ కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. కేవలం వ్యాయామం మాత్రమే సరిపోదని, సరైన ఆహార అలవాట్లు లేకపోతే వర్కౌట్ల వల్ల ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.
{{/usCountry}}పరిశుభ్రమైన ఆహారానికి ప్రాధ్యాన్యం ఇవ్వాలని, పదేపదే స్నాక్స్ తినే అలవాటుకు దూరంగా ఉండాలని కోరారు. మద్యం సేవించడాన్ని వీలైనంత వరకు పరిమితం చేసుకోవాలని సూచించారు. శారీరక శ్రమ, సమతుల్య ఆహారం రెండూ తోడైతేనే పరిపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని వెల్లడించారు.