రసం అన్నం ఉంటే చాలు.. మైమరిచిపోతానంటున్న రెజీనా.. ఆమె డైట్ సీక్రెట్స్ ఇవే

టాలీవుడ్ నటి రెజీనా కాసాండ్రా తన ఫిట్‌నెస్, డైట్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమెకు ఇష్టమైన ఫుడ్, డైట్ సీక్రెట్స్ ఇంకా మరెన్నో ఆసక్తికర విషయాలు ఇక్కడ చూడండి.

Published on: Feb 19, 2026 12:35 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్లామర్ ప్రపంచంలో ఉండే హీరోయిన్లు అనగానే మనకు కఠినమైన డైట్, జిమ్ వర్కవుట్లు గుర్తుకు వస్తాయి. కానీ, నటి రెజీనా కాసాండ్రా శైలి మాత్రం ఇందుకు భిన్నం. తనకు ఎలాంటి కఠినమైన నియమాలు (Routines) పాటించడం నచ్చదని, కానీ శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం మాత్రం ఇష్టమని ఆమె తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

రసం అన్నం ఉంటే చాలు.. మైమరిచిపోతానంటున్న రెజీనా.. ఆమె డైట్ సీక్రెట్స్ ఇవే
రసం అన్నం ఉంటే చాలు.. మైమరిచిపోతానంటున్న రెజీనా.. ఆమె డైట్ సీక్రెట్స్ ఇవే

అన్నం అంటే ప్రాణం.. రసం ఉంటే చాలు!

రెజీనాకు సౌత్ ఇండియన్ వంటకాలంటే మక్కువ ఎక్కువ. ముఖ్యంగా అన్నం లేకుండా తను ఉండలేనని చెబుతూ.. "నేను పక్కా రైస్ లవర్ ని. రోజులో కనీసం కొద్దిపాటి అన్నం అయినా తినాల్సిందే. పప్పు అన్నం, రసం అన్నం లేదా సాంబార్ సదం.. వీటిలో ఏదైనా నాకు కంఫర్ట్ ఫుడ్. ప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఒక గిన్నె రసం అన్నం తింటే వచ్చే తృప్తి వేరు. దానికి తోడు ఒక చేపల వేపుడు (Fish Fry) ఉంటే చాలు.. ఇక ఆ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే" అని రెజీనా తన ఇష్టాన్ని పంచుకున్నారు.

ప్రతిరోజూ అది ఉండాల్సిందే..

రెజీనా డైట్‌లో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆమె ప్రతిరోజూ ‘కాంజీ’ (Congee - మన వాడుకలో గంజి/అన్నం జావ) తాగుతారు. ముఖ్యంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు జీర్ణవ్యవస్థ బాగుండడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె వివరిస్తారు. అప్పుడప్పుడు వెరైటీ కోసం పెస్టో పాస్తా వంటి ఇటాలియన్ వంటకాలు తిన్నా, మళ్ళీ తన మనసు దోశ లేదా అన్నం వైపే లాగుతుందని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు.

షూటింగ్ సమయంలో రెజీనా ఏం తింటారు?

ఇటీవల ఊటీలో షూటింగ్‌లో ఉన్నప్పుడు తను తిన్న ఆహారం గురించి చెబుతూ:

ఉదయం: ఐదు గుడ్ల తెల్లసొనతో చేసిన స్క్రాంబుల్డ్ ఎగ్ (కేవలం పచ్చిమిర్చి, ఉప్పుతో).

మధ్యాహ్నం: కాంజితో పాటు డ్రై మసాలా చికెన్.

రాత్రి: ఫ్లైట్ జర్నీ ఉండటంతో వేడి భోజనం దొరకదని, ఊటీలోని ఫేమస్ 'మోడీస్ బేకరీ'లో పఫ్స్, క్యారెట్ కేక్, టీ కేక్ వంటి వాటితో సరిపెట్టుకున్నట్లు తెలిపారు.

చీట్ డేస్ లేవు.. కేవలం బ్యాలెన్స్ మాత్రమే

చాలామందిలా తనకు ప్రత్యేకంగా ‘చీట్ డేస్’ ఉండవని రెజీనా స్పష్టం చేశారు. "నేను అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తాను. ఒకవేళ ఆ రోజు పిజ్జా తినాలనిపిస్తే, అదే నా మెయిన్ మీల్ అవుతుంది. దానిపై మళ్ళీ ఇంకేదీ తినకుండా జాగ్రత్తపడతాను" అని తన ఫిట్‌నెస్ సూత్రాన్ని వివరించారు. ఉదయాన్నే రోడ్లపై రన్నింగ్ చేయడం, యోగా చేయడం ద్వారా ఆమె తనను తాను ఫిట్‌గా ఉంచుకుంటారు.