ఒకేసారి రెండు పనులు చేస్తున్నారా? శశి థరూర్ ప్రమాదంపై న్యూరాలజిస్ట్ వార్నింగ్

పార్లమెంటు ఆవరణలో శశి థరూర్ ప్రమాదవశాత్తూ మెట్లపై నుంచి కింద పడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఫోన్ మాట్లాడుతూ మెట్లు దిగడం వల్ల కలిగే ముప్పుపై ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ హెచ్చరిస్తున్నారు. మన మెదడు ఒకేసారి రెండు పనులు (Multitasking) చేయడంలో ఎంత బలహీనంగా ఉంటుందో ఆయన వివరించారు.

Published on: Feb 06, 2026 6:19 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

"ఒక్క ఫోన్ కాల్.. ఒక మెట్ల వరుస.. ఒక్క చిన్న అజాగ్రత్త.. ఇది చాలు ఒక వ్యక్తి జీవితాన్ని తలకిందులు చేయడానికి." అని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.

ఫిబ్రవరి 4న పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మెట్లు దిగుతూ అదుపుతప్పి కింద పడ్డారు. (PTI)
ఫిబ్రవరి 4న పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మెట్లు దిగుతూ అదుపుతప్పి కింద పడ్డారు. (PTI)

ఫిబ్రవరి 4న పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మెట్లు దిగుతూ అదుపుతప్పి కింద పడి ఫ్రాక్చర్‌కు గురైన సంగతి తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, అక్కడే ఉన్న అధికారులు వెంటనే స్పందించి ఆయనను పైకి లేపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను శశి థరూర్ స్వయంగా పంచుకున్నారు. అయితే, ఈ ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ సుధీర్ కుమార్ కీలక విషయాలను వెల్లడించారు.

మల్టీటాస్కింగ్ ఒక అపోహ మాత్రమే

చాలామంది నడుస్తూనో, మెట్లు దిగుతూనో ఫోన్ మాట్లాడటం గొప్ప విషయంగా భావిస్తారు. కానీ, మన మెదడు ఒకేసారి రెండు పనులు చేయడంలో చాలా 'వీక్' అని డాక్టర్ సుధీర్ పేర్కొన్నారు. ముఖ్యంగా మెట్లు దిగడం అనేది మెదడుకు చాలా శ్రమతో కూడుకున్న పని. ఆ సమయంలో మెదడు ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి పెడుతుంది:

  • శరీర సమతుల్యతను (Balance) కాపాడటం.
  • మెట్ల లోతును (Depth perception) అంచనా వేయడం.
  • అడుగు ఎక్కడ వేయాలో (Foot placement) నిర్ణయించడం.
  • ప్రమాదం పొంచి ఉంటే తక్షణం స్పందించడం.

మనం ఫోన్ మాట్లాడటం మొదలుపెట్టిన తక్షణమే, మెదడు ఏకాగ్రత అటువైపు మళ్లుతుంది. దీనివల్ల ప్రతిచర్య సమయం (Reaction time) తగ్గిపోయి, మెట్లపై పట్టు తప్పే అవకాశం పెరుగుతుంది. శశి థరూర్ విషయంలో జరిగింది కూడా ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు.

చిన్న పొరపాటే.. పెద్ద గాయాలకు దారి తీస్తుంది

"న్యూరాలజిస్ట్‌గా నా అనుభవంలో చెబుతున్నాను.. రోడ్డు ప్రమాదాల కంటే కూడా, ఇలాంటి చిన్న చిన్న జారి పడటాల వల్లే ఒక్కోసారి తలకు పెద్ద గాయం అయ్యే అవకాశం ఉంది" అని డాక్టర్ సుధీర్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మెట్లు ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు ఫోన్ వాడటం ఏమాత్రం క్షేమకరం కాదని ఆయన స్పష్టం చేశారు.

మీరు పాటించాల్సిన జాగ్రత్తలు: ప్రమాదాల బారిన పడకుండా ఉండటానికి డాక్టర్ సుధీర్ ఈ క్రింది సూచనలు చేశారు.

  • మెట్లు ఎక్కుతున్నప్పుడు లేదా దిగుతున్నప్పుడు ఫోన్ కాల్స్ మాట్లాడవద్దు.
  • రద్దీగా ఉన్న రోడ్లు దాటుతున్నప్పుడు ఫోన్ వాడటం మానేయాలి.
  • గుంతలు లేదా ఎగుడుదిగుడుగా ఉన్న ప్రాంతాల్లో నడుస్తున్నప్పుడు ఫోన్ జోలికి వెళ్లకండి.
  • ప్రమాదం జరగకూడదంటే.. ఫోన్ కాల్‌ను కాసేపు ఆపి, మెట్ల వైపు చూస్తూ, రెయిలింగ్ పట్టుకుని నడవడం ఉత్తమం.
  • మీ ప్రాణం కంటే ఏ నోటిఫికేషన్ కూడా ముఖ్యం కాదు. కాబట్టి, నడిచేటప్పుడు ఫోన్‌ను పక్కన పెట్టి మీ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి.

Risk of being on the phone while using the stairs

According to Dr Kumar, the brain is “terrible” at multitasking, that is, carrying on a conversation on the phone while moving. It is even worse when the movement comprises going down the stairs.

When an individual goes downstairs, the brain occupies itself with the following functions:

  • Maintain balance
  • Depth perception
  • Foot placement
  • Split-second corrections

The additional task of a phone call shifts the attention and drops the reaction time of the brain. This is all it takes for a mishap.

“As a neurologist, I can tell you, some of the worst head injuries I see come from simple falls, not big accidents,” noted Dr Kumar.

Safety measures to be taken

Dr Kumar advised avoiding using the phone while performing the following tasks:

  • Going up or down stairs
  • Crossing roads
  • Walking on uneven surfaces
  • Driving/riding

“Your brain can focus on movement or on your phone. Not both safely,” he cautioned. It is “too valuable to risk for a notification.”

The simplest safety hack to follow is:

  • Pause the call.
  • Look at the steps.
  • Hold the railing.

Note to readers: This article is for informational purposes only and not a substitute for professional medical advice. It is based on user-generated content from social media. HT.com has not independently verified the claims and does not endorse them.