Eating fruits after dinner : రాత్రి భోజనం ముగించగానే ఏదో ఒక తీపి పదార్థం తినాలనిపించడం చాలామందికి అలవాటు. అయితే ఐస్‌క్రీమ్‌లు లేదా స్వీట్లు ఆరోగ్యానికి అంత మంచిది కాదని భావించి…. చాలామంది పోషకాలతో నిండిన పండ్లను ఎంచుకుంటారు. పండ్లు ఆరోగ్యకరమే అయినప్పటికీ, వాటిని తినే సమయం కూడా అంతే ముఖ్యం. భోజనం తర్వాత పండ్లు తినడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయనే అంశంపై ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సాహిల్ నోహ్రియా పలు కీలక విషయాలను వివరించారు.
జీర్ణక్రియలో జాప్యం.. అసలు కారణం ఇదే!

సాధారణంగా పండ్లు చాలా తేలికగా జీర్ణమవుతాయి. ఇవి కడుపులోకి వెళ్ళిన 20 నుంచి 40 నిమిషాల్లోనే జీర్ణం కావాల్సి ఉంటుంది. కానీ, భారీ భోజనం చేసిన వెంటనే పండ్లను తింటే సమస్యలు మొదలవుతాయి. మన శరీరం అప్పటికే భోజనంలోని కొవ్వులు, కార్బోహైడ్రేట్లను అరిగించే పనిలో ఉండటం వల్ల, పండ్లు జీర్ణాశయంలో ఎక్కువ సేపు ఉండిపోవాల్సి వస్తుంది. ఈ జాప్యం వల్ల పండ్లలోని చక్కెరలు, ఫైబర్ కడుపులో పులిసిపోయే (Fermentation) అవకాశం ఉందని డాక్టర్ నోహ్రియా హెచ్చరించారు.
కనిపించే లక్షణాలు:
- కడుపు ఉబ్బరం (Bloating) మరియు గ్యాస్ సమస్యలు.
- అధికంగా తేన్పులు రావడం మరియు పొట్ట బిగుతుగా అనిపించడం.
- కడుపులో తిమ్మిర్లు లేదా అసౌకర్యంగా అనిపించడం.
- జీర్ణవ్యవస్థ రాత్రిపూట అధిక పనిభారానికి గురికావడం వల్ల నిద్రకు అంతరాయం కలగడం.
ఏ పండ్లు దూరంగా ఉంచాలి….?
అన్ని రకాల పండ్లు ఇబ్బంది కలిగించవు, కానీ కొన్ని పండ్ల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆపిల్స్, బేరి (Pears), మామిడి పండ్లు, పుచ్చకాయల్లో 'ఫ్రక్టోజ్' అనే సహజ చక్కెర అధికంగా ఉంటుంది. శరీరం ఈ ఫ్రక్టోజ్‌ను సరిగ్గా గ్రహించలేకపోతే….. అది ప్రేగుల్లో ఎక్కువ సేపు ఉండిపోయి, బ్యాక్టీరియా ద్వారా పులిసిపోయేలా చేస్తుంది. ఫలితంగా తీవ్రమైన గ్యాస్, ఉబ్బరం కలుగుతాయి.
ముఖ్యంగా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) లేదా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు రాత్రిపూట పండ్లకు దూరంగా ఉండటం మంచిది. ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండే ఆహారాలు వీరిలో కడుపు తిమ్మిర్లు, క్రమరహిత ప్రేగు కదలికలను ప్రేరేపిస్తాయి.
{{/usCountry}}ముఖ్యంగా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) లేదా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు రాత్రిపూట పండ్లకు దూరంగా ఉండటం మంచిది. ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండే ఆహారాలు వీరిలో కడుపు తిమ్మిర్లు, క్రమరహిత ప్రేగు కదలికలను ప్రేరేపిస్తాయి.
{{/usCountry}}జీర్ణక్రియ సజావుగా సాగాలంటే భోజనంతో కలిపి కాకుండా, విడిగా పండ్లను తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం భోజనానికి ముందు (Mid-morning) లేదా సాయంత్రం వేళల్లో స్నాక్స్‌గా పండ్లు తీసుకోవడం మంచిది. ప్రతి ఒక్కరి జీర్ణశక్తి వేర్వేరుగా ఉంటుంది కాబట్టి, మీ శరీర ప్రతిస్పందనను బట్టి పండ్లు తినే సమయాన్ని నిర్ణయించుకోవాలి