"సరైన వయసులోనే పిల్లలను కనాలి” అనే మాట ప్రతి మహిళకు ఎదురయ్యే ఒక పెద్ద సామాజిక ఒత్తిడి. ఒకవైపు కెరీర్ గోల్స్, లైఫ్‌స్టైల్ ఎంపికలు.. మరోవైపు వేగంగా తిరిగే బయోలాజికల్ క్లాక్ మధ్య ఎప్పుడు గర్భం దాల్చాలనే నిర్ణయం తీసుకోవడం చాలా మంది మహిళలకు ఒక పెద్ద సవాలుగా మారుతోంది. ఇంటర్నెట్‌లో ప్రెగ్నెన్సీ వయసుపై ఎన్నో సిద్ధాంతాలు, సలహాలు ఉన్నప్పటికీ.. కోల్‌కతాలోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ నిపుణులు డాక్టర్ అనిందితా సింగ్.. వయసు-సంతానోత్పత్తి, గర్భధారణ వెనుక ఉన్న అసలు వాస్తవాలను క్లియర్‌గా వివరించారు.
పిల్లలను కనడానికి ఒక నిర్దిష్టమైన ‘సరైన’ వయసు అంటూ ఉంటుందా?

డాక్టర్ అనిందిత ప్రకారం.. అందరికీ ఒకేలా వర్తించే ‘సరైన వయసు’ అనేది ఏదీ లేదు. ఎందుకంటే ఈ నిర్ణయం పూర్తిగా బయోలాజికల్ (శారీరక), మెడికల్ (వైద్యపరమైన), పర్సనల్ (వ్యక్తిగత) అనే మూడు ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది.
శారీరక దృక్కోణం నుంచి చూస్తే.. మహిళల్లో 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసులో సంతానోత్పత్తి సామర్థ్యం అత్యధిక స్థాయిలో ఉంటుంది. 30 ఏళ్లు దాటినప్పటి నుంచి ఇది నెమ్మదిగా తగ్గడం ప్రారంభించి, 35 ఏళ్లకు చేరుకునే సరికి ఈ తగ్గుదల చాలా వేగంగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మహిళల శరీరంలో అండాల సంఖ్యతో పాటు వాటి నాణ్యత కూడా క్షీణిస్తుంది. దీనివల్ల సహజంగా గర్భం దాల్చే అవకాశాలు తగ్గడమే కాకుండా.. ప్రెగ్నెన్సీ సమయంలో జెస్టేషనల్ డయాబెటిస్ (గర్భధారణ మధుమేహం) రావడం, పుట్టబోయే బిడ్డలో క్రోమోజోమ్ లోపాలు తలెత్తే ప్రమాదం పెరుగుతుంది.
అయితే, వయసు అనేది గర్భధారణ ఫలితాన్ని ప్రభావితం చేసే ఒక అంశం మాత్రమే కానీ, అదే సర్వస్వం కాదని వైద్యులు చెబుతున్నారు. 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు కూడా సరైన వైద్య సంరక్షణ, నిరంతర ఆరోగ్య పరీక్షలు, శారీరక స్థిరత్వాన్ని కలిగి ఉంటే ఆరోగ్యకరమైన కాన్పును పొందవచ్చు.
మహిళల ఆరోగ్య స్థితిని నిర్ణయించే మూడు ప్రధాన అంశాలు:
- శారీరక దృఢత్వం, దీర్ఘకాలిక వ్యాధులు (బీపీ, షుగర్ వంటివి) లేకపోవడం.
- మెరుగైన మానసిక ఆరోగ్యం.
- నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండటం.
దీనితో పాటు మంచి పోషకాహారం, సరైన నిద్ర, ఒత్తిడి లేని జీవితం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం వంటి లైఫ్‌స్టైల్ అలవాట్లు గర్భధారణ విజయవంతం కావడానికి ఎంతగానో తోడ్పడతాయి.
పిల్లలను ప్లాన్ చేసే ముందు దంపతులు ఏం తెలుసుకోవాలి?
{{/usCountry}}దీనితో పాటు మంచి పోషకాహారం, సరైన నిద్ర, ఒత్తిడి లేని జీవితం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం వంటి లైఫ్‌స్టైల్ అలవాట్లు గర్భధారణ విజయవంతం కావడానికి ఎంతగానో తోడ్పడతాయి.
పిల్లలను ప్లాన్ చేసే ముందు దంపతులు ఏం తెలుసుకోవాలి?
{{/usCountry}}తల్లిదండ్రులు కావాలనుకునే వారు కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా సిద్ధం కావాలని డాక్టర్ అనిందిత సూచించారు. భావోద్వేగాల నియంత్రణ, పరస్పర బంధాన్ని బలోపేతం చేసుకోవడం, బాధ్యతలను పంచుకోవడం ద్వారానే పేరెంట్‌హుడ్‌కు పూర్తి అర్హత లభిస్తుంది.
దంపతులు తమ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక స్థితిగతులపై స్పష్టమైన అవగాహనతో ప్లాన్ చేసుకోవాలి. తమ ఫెర్టిలిటీ సైకిల్ (సంతానోత్పత్తి చక్రం) గురించి తెలుసుకోవడం, అవసరమైనప్పుడు సరైన సమయంలో వైద్య సహాయం తీసుకోవడం వల్ల ఎలాంటి ఆందోళనలు లేకుండా నిర్ణయాలు తీసుకోవచ్చు.
“క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, అవసరమైతే ముందే ఫెర్టిలిటీ అసెస్‌మెంట్ పరీక్షలు చేయడం, వైద్యులతో ముఖాముఖిగా మాట్లాడటం వల్ల సరైన సమయంలో, సరైన నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది,” అని డాక్టర్ అనిందితా సింగ్ పేర్కొన్నారు.