...
...
Next Story

pickle Tips : ఊరగాయలకు బూజు ఎందుకు పడుతుంది? పాడవకుండా ఏం చేయాలి?

pickle Tips : కొందరి ఇళ్లలో ఊరగాయలు త్వరగా పాడైపోతాయి. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. సరైన జాగ్రత్తలు పాటిస్తే పచ్చళ్లు పాడవకుండా చూసుకోవచ్చు.

Published on: May 3, 2026, 19:08:30 IST
Advertisement

వేడి వేడి అన్నంలో ఊరగాయ కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు. ఇక వేసవిలో ఇంట్లో పెట్టుకునే మామిడికాయ పచ్చడికి ప్రతీ ఇంట్లో ఫ్యాన్స్ ఉంటారు. ఈ పచ్చడి ఆహారానికి రుచిని పెంచడమే కాకుండా.. చిన్ననాటి జ్ఞాపకాలను, ఇంటిని గుర్తుచేస్తుంది. మామిడి, నిమ్మ, మిరపకాయ లేదా ఉసిరికాయ ఊరగాయల విషయంలో ప్రతి ఒక్కరికీ వారి వారి ప్రత్యేక ఇష్టాలు ఉంటాయి.

ఊరగాయలు పాడవకుండా చిట్కాలు
ఊరగాయలు పాడవకుండా చిట్కాలు

ఇంట్లో తయారుచేసిన ఊరగాయలు తింటే ఆ టేస్టే వేరు. ఇక వేసవిలో ఇంట్లో పెట్టుకునే మామిడికాయ పచ్చడికి ప్రతీ ఇంట్లో ఫ్యాన్స్ ఉంటారు. ఈ పచ్చడి ఆహారానికి రుచిని పెంచడమే కాకుండా.. చిన్ననాటి జ్ఞాపకాలను, ఇంటిని గుర్తుచేస్తుంది. మామిడి, నిమ్మ, మిరపకాయ లేదా ఉసిరికాయ ఊరగాయల విషయంలో ప్రతి ఒక్కరికీ వారి వారి ప్రత్యేక ఇష్టాలు ఉంటాయి.

కానీ కొన్నిసార్లు ఎంతో శ్రమతో తయారుచేసిన ఊరగాయల పైన తెల్లటి పొరలాగా కనిపిస్తుంది. అదే బూజు పట్టడం అంటారు. ఇలా అయితే కొన్ని రోజుల్లోనే పాడవడం పచ్చళ్లు మెుదలవుతుంది. ఊరగాయలకు బూజు ఎందుకు పడుతుందో, దానిని ఎలా నివారించాలో ఇప్పుడు వివరిద్దాం.

బూజు రావడానికి కారణాలు

ఊరగాయలో బూజు పట్టడం అనేది ఒకే కాలానికి పరిమితం కాదు. ఇది సంవత్సరంలో ఎప్పుడైనా జరగవచ్చు. దీనికి అత్యంత సాధారణ కారణం చిన్నపాటి నిర్లక్ష్యమే. జాడీలోకి తేమ లేదా గాలి ప్రవేశించిన వెంటనే ఊరగాయ పాడయ్యే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. దీనిని వెంటనే పరిష్కరించకపోతే.. మొత్తం ఊరగాయ ఉపయోగపడకుండా అయిపోతుంది.

ఊరగాయ ఘాటైన, పుల్లని వాసన కలిగి ఉండాలి. కానీ అవి కుళ్ళిన లేదా వింత వాసన రావడం మొదలైతే, అది పాడైపోయిందని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఊరగాయ పైన బూజు పట్టడం అనేది.. ఊరగాయలోకి తేమ లేదా గాలి ప్రవేశించిందనడానికి స్పష్టమైన సంకేతం. తడి చెంచాను ఉపయోగించడం లేదా జాడీ మూత తెరిచి ఉంచడం వల్ల ఇలా అవుతుంది.

పచ్చడిలోని నూనె లేదా ఉప్పు నీటిలో కూడా మార్పులు గమనించవచ్చు. నూనె విడివిడి పొరలుగా కనిపించినా, లేదా నురుగు ఏర్పడటం మొదలైనా, ఇది ఊరగాయ పాడైపోయిందనడానికి సంకేతం. అదేవిధంగా రుచి మారినా, ఊరగాయ చేదుగా, చప్పగా, లేదా కొద్దిగా ఘాటుగా మారినా దానిని వెంటనే పారవేయాలి.

పాడవకుండా ఏం చేయాలి?

ఊరగాయను ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి, కొన్ని సాధారణ విషయాలను పాటించాలి. ఎల్లప్పుడూ పొడిగా, శుభ్రంగా ఉన్న చెంచాను వాడండి. ఎందుకంటే ఒక్క నీటి చుక్క పడినా బూజు పడుతుంది. గాలి లోపలికి వెళ్లకుండా ఉండేందుకు జాడీ మూతను ఎల్లప్పుడూ గట్టిగా మూసివేయండి. అవసరమైతే మూత పైన నుంచి ఒక శుభ్రమైన క్లాత్‌ను కట్టండి. ఊరగాయను చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయడం కూడా అవసరం.

సూర్యరశ్మి లేదా అధిక వేడి వల్ల మసాలాలు, నూనె పాడైపోతాయి. అలాగే ఊరగాయ మొత్తం నూనె పొరతో పూర్తిగా కప్పబడి ఉండేలా చూసుకోండి. నూనె సరిపోనట్లు అనిపిస్తే, పైన కొద్దిగా శుభ్రమైన నూనె కలపండి. ఈ చిట్కాలు పాటిస్తే పచ్చడి పాడవకుండా ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON