Why Humans Are Right Handed Oxford Study : కుడిచేతి వాటం ఏలుతున్న ప్రపంచం ఇంది! ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90శాతం మంది కుడిచేతి వాటం వారే ఉన్నారు మరి. అయితే దీని వెనక రహస్యం ఏంటి? అన్నది దశాబ్దాలుగా శాస్త్రవేత్తలకు ఒక పెద్ద సవాలుగా నిలిచింది. అయితే, దీనికి సమాధానం మన చేతుల్లో లేదు.. మన కాళ్లు, మెదడు పరిణామ క్రమంలోనే దాగి ఉందని సరికొత్త అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది!

‘న్యూయార్క్ పోస్ట్’ నివేదిక ప్రకారం.. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, రీడింగ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 41 విభిన్న జాతులకు చెందిన 2,025 కోతులు, వానరుల (ప్రిమేట్స్)పై విస్తృతమైన పరిశోధనలు చేసి ఈ వివరాలను వెల్లడించారు.
కోతులు వేరు.. మనుషులు వేరు!
పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు ‘మీన్ హ్యాండెడ్‌నెస్ ఇండెక్స్’ను ఉపయోగించారు. ఇందులో పాజిటివ్ నంబర్లు కుడిచేతి వాటాన్ని సూచిస్తాయి. ఈ ఇండెక్స్‌లో ఇతర కోతులు, చింపాంజీల రేటింగ్ దాదాపు సున్నా (0) కి దగ్గరగా ఉండగా.. మానవుల స్కోరు మాత్రం ఏకంగా 0.76గా నమోదైంది. స్పైడర్ మంకీస్, లంగూర్లు వంటి కొన్ని ప్రిమెటివ్స్లో వ్యక్తిగతంగా చేతి ప్రాధాన్యతలు (ఎడమ లేదా కుడి) ఉన్నప్పటికీ.. ఒక జాతి మొత్తంగా 90 శాతం మంది ఒకే చేతిని అమితంగా ఇష్టపడటం కేవలం మానవుల్లో మాత్రమే కనిపిస్తుందని ‘ప్లోస్ బయోలజీ’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం పేర్కొంది.
చేతి వాటానికి కారణాలు ఇవే..
మానవుల్లో ఈ కుడిచేతి వాటం ఎలా ఏర్పడిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తల బృందం ఆహారం, నివాసం, శరీర బరువు, సామాజిక నిర్మాణాలు, సాధనాల వినియోగం, నడిచే విధానం వంటి ప్రధాన సిద్ధాంతాలను పరీక్షించింది. అయితే, వీటన్నింటిలోనూ మానవులు ఇతరుల కంటే భిన్నంగా (అవుట్‌లయర్స్) కనిపించారు. కానీ, పరిశోధకులు తమ పరిశోధనా నమూనాకు మరో రెండు ముఖ్యమైన అంశాలను జోడించినప్పుడు అసలు విషయం బయటపడింది. అవి..
- మెదడు పరిమాణం
- ఇంటర్‌మెంబ్రల్ ఇండెక్స్ : ఇది చేతుల పొడవుతో పోలిస్తే కాళ్ల పొడవును కొలిచే కొలమానం.
మానవులకు ఇతర వానరాల కంటే చేతులు చిన్నవిగా, కాళ్లు చాలా పొడవుగా ఉంటాయి. ఇది మనం రెండు కాళ్లపై నిటారుగా నిలబడి నడవడానికి సహాయపడే ఒక ముఖ్యమైన పరిణామ లక్షణం. ఈ రెండు అంశాలను పరిశోధనలో చేర్చిన వెంటనే, మానవుల కుడిచేతి వాటం అనేది వానర జాతుల సాధారణ ప్యాటర్న్‌తో సరిగ్గా సరిపోయింది.
{{/usCountry}}మానవులకు ఇతర వానరాల కంటే చేతులు చిన్నవిగా, కాళ్లు చాలా పొడవుగా ఉంటాయి. ఇది మనం రెండు కాళ్లపై నిటారుగా నిలబడి నడవడానికి సహాయపడే ఒక ముఖ్యమైన పరిణామ లక్షణం. ఈ రెండు అంశాలను పరిశోధనలో చేర్చిన వెంటనే, మానవుల కుడిచేతి వాటం అనేది వానర జాతుల సాధారణ ప్యాటర్న్‌తో సరిగ్గా సరిపోయింది.
{{/usCountry}}పరిశోధకుడు డాక్టర్ థామస్ ఏ పుస్చెల్ మాట్లాడుతూ.. "మానవుల చేతి వాటానికి సంబంధించిన ప్రధాన సిద్ధాంతాలను ఒకే ఫ్రేమ్‌వర్క్‌లో పరీక్షించిన మొదటి అధ్యయనం ఇది. మన ఫలితాల ప్రకారం.. మనుషులను ప్రత్యేకంగా నిలిపే రెండు ముఖ్యమైన ఫీచర్లు అయిన నిటారుగా నడవడం, పెద్ద మెదడు అభివృద్ధి చెందడమే కుడిచేతి వాటానికి కారణమని తెలుస్తోంది," అని పేర్కొన్నారు.
లక్షల సంవత్సరాల చరిత్ర..
చెట్లపై నివసించే కోతులు కొమ్మలపై కదిలేందుకు సమతుల్యత కోసం రెండు చేతులను సమానంగా వాడాల్సి వస్తుంది. కానీ, మానవులు నేలపై నిటారుగా నడవడం ప్రారంభించాక.. నడకకు చేతులతో పని లేకుండా పోయింది. దీనివల్ల పనులను మరింత నైపుణ్యంతో చేయడానికి ఒక నిర్దిష్ట చేతిని (ముఖ్యంగా కుడి చేతిని) ఎక్కువగా ఉపయోగించడం మొదలుపెట్టారని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.
మానవ పరిణామ క్రమంలో కుడిచేతి వాటానికి చాలా సుదీర్ఘ చరిత్ర ఉంది. టాంజానియాలో లభించిన 18 లక్షల సంవత్సరాల నాటి ‘హోమో హాబిలిస్’ దవడ ఎముకలోని ముందు పళ్లపై కుడి వైపుకు వంగి ఉన్న గీతలు ఉన్నాయి. పదార్థాలను ప్రాసెస్ చేసేటప్పుడు కుడిచేతిని ఎక్కువగా వాడటం వల్లే ఆ గుర్తులు పడ్డాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే, కనీసం ఐదు లక్షల సంవత్సరాల క్రితం (హాఫ్ మిలియన్ ఇయర్స్) నుంచి మానవులు ఆయుధాలు, సాధనాలు తయారు చేయడానికి కుడిచేతినే ఎక్కువగా ఆశ్రయించారని పురాతత్వ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.