ఈ 5 వస్తువులు చేతి నుంచి జారి పడడం మంచిది కాదు.. అశుభ ఫలితాలు ఎదురవచ్చు!

ఈ వస్తువులు చేతి నుంచి జారి కింద పడడం వల్ల అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం కావాలని చేయకపోయినా, ఈ వస్తువులు చేతి నుంచి జారి కింద పడటం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉందట. ఏదో ఒక విధంగా బాధపడాల్సి ఉంటుందట. ఈ వస్తువులు చేతి నుంచి కింద పడటం వల్ల ఆర్థిక నష్టం, ఓటమి, ఉద్యోగంలో సమస్యలు రావచ్చు.

Published on: Feb 6, 2026, 13:31:04 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, కొన్ని వస్తువులు కింద పడటం మంచిది కాదని, అది శుభ శకునం కాదని పెద్దలు చెప్పడం మీరు వినే ఉంటారు. ఈ వస్తువులు చేతి నుంచి జారి కింద పడడం వల్ల అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం కావాలని చేయకపోయినా, ఈ వస్తువులు చేతి నుంచి జారి కింద పడటం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉందట. ఏదో ఒక విధంగా బాధపడాల్సి ఉంటుందట.

ఈ వస్తువులు చేతి నుంచి జారి పడడం మంచిది కాదు (pinterest)
ఈ వస్తువులు చేతి నుంచి జారి పడడం మంచిది కాదు (pinterest)

వస్తువులు చేతి నుంచి కింద పడటం వల్ల ఆర్థిక నష్టం, ఓటమి, ఉద్యోగంలో సమస్యలు వంటి పరిణామాలు జరగవచ్చు. పెద్దవాళ్లు కూడా ఈ విషయాన్ని చెప్పడం మీరు వినే ఉంటారు. అయితే, ఈ వస్తువులు చేతిలోంచి కింద పడటం వల్ల ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయో, ఏ వస్తువులు అసలు మన చేతుల నుంచి కిందకు జారి పడకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వస్తువులు చేతి నుంచి జారి పడడం మంచిది కాదు, అశుభ ఫలితాలు ఎదురవుతాయి

1.ఉప్పు

జ్యోతిష్యం ప్రకారం చూసినట్లయితే ఉప్పు శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. చేతి నుంచి ఉప్పు పదే పదే కింద పడడం అనేది అశుభంగా భావిస్తారు. చేతిలోంచి ఉప్పు పదే పదే జారి కింద పడితే శుక్రుడు, చంద్రుడు బలహీనంగా మారతారని చెబుతారు. ఉప్పు కింద పడటం వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఉప్పు జారి నేల మీద పడిపోతే జీవితంలో సమస్యలు వస్తాయని అంటారు. కాబట్టే ఉప్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

2.పూజ వస్తువులు

చాలా మంది పూజ కోసం అవసరమైన వస్తువులను ముందుగానే సిద్ధం చేసి ఉంచుతారు. అలా పెట్టిన పూజా ప్లేట్ చేతి నుంచి జారి కింద పడితే అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవితంలో పెద్ద పెద్ద ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉందని పెద్దలు చెబుతారు.

3.బియ్యం

బియ్యాన్ని అన్నపూర్ణగా భావిస్తాము, పూజిస్తాము. బియ్యాన్ని అక్షింతలుగా కూడా పూజలో ఉపయోగిస్తాము. వీటిని పవిత్రంగా భావిస్తాము. అయితే బియ్యం లేదా అన్నం ఉన్న గిన్నె చేతి నుంచి పదే పదే కింద పడిపోవడం మంచిది కాదు. అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్మకం. కాబట్టి బియ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.

4.పాలు

చేతి నుంచి పాలు కింద పడడం కూడా ఏమాత్రం మంచిది కాదు. పదే పదే పాలు కింద పడుతున్నట్లయితే ఏదో ఒక ఇబ్బంది రాబోతోందని అర్థం చేసుకోవాలని అంటారు. ముఖ్యంగా బిడ్డకు సంబంధించిన ఏదో ఒక సమస్య రాబోతుందని అర్థం చేసుకోవాలి. ఇంట్లో పదే పదే ఇలా జరుగుతున్నట్లయితే కూడా ఏదో ఒక ఇబ్బంది వచ్చే అవకాశం ఉందట.

5.నూనె

చేతి నుంచి నూనె జారి కింద పడటం మంచిది కాదు. దీనిని అశుభంగా భావిస్తారు. చేతుల నుంచి నూనె కిందకు జారి పడితే ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుందని చెబుతారు. అలాగే భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అప్పులు కూడా ఎక్కువ కావచ్చు. చేసిన అప్పులు కూడా తీరకపోవచ్చని నమ్మకం ఉంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More