Lakshmi Narayana Yogam: ఏడాది తరవాత కుంభ రాశిలో బుధ, శుక్రుల కలయికతో లక్ష్మీ నారాయణ యోగం.. 5 రాశులకు ధనవంతులయ్యే అవకాశం!
ఫిబ్రవరి 3న బుధుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు కూడా అదే రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఈ రెండిటి కలయికతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. కుంభ రాశిలో బుధుడు, శుక్రుడు సంయోగం చెందడంతో ద్వాదశ రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు వస్తాయి. కానీ కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు.
గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకు వస్తుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం 2026 ఫిబ్రవరి చాలా ముఖ్యమైనది. ఫిబ్రవరిలో కొన్ని ముఖ్యమైన గ్రహాల సంచారంలో మార్పు జరగబోతోంది. ఫిబ్రవరి మూడున బుధుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. కుంభ రాశికి అధిపతి శని.

శుక్రుడు కూడా అదే రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఈ రెండిటి కలయికతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. కుంభ రాశిలో బుధుడు, శుక్రుడు సంయోగం చెందడంతో ద్వాదశ రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు వస్తాయి. కానీ కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు. ఏడాది తర్వాత కుంభ రాశిలో బుధ, శుక్ర సంయోగం ఏ రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు తీసుకురాబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.
కుంభ రాశిలో బుధ, శుక్రుల కలయిక.. ఈ రాశులకు అనేక లాభాలు
1.మేష రాశి
మేష రాశి వారికి రెండు గ్రహాల కదలిక, కలయిక శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక లాభాలను పొందుతారు. ముఖ్యంగా ఆదాయం పెరుగుతుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది. ఊహించని విధంగా లాభాలను పొందుతారు. స్టాక్ మార్కెట్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా భారీగా లాభాలను పొందడానికి వీలుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి.
2.వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రెండు గ్రహాల కలయిక అద్భుతమైన ఫలితాలను తీసుకు వస్తుంది. ఈ రాశి పదవ ఇంట్లో ఈ సంచారం జరుగుతుంది. దీంతో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. పని ప్రదేశంలో ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం. భవిష్యత్తులో అధికంగా లాభాలు వస్తాయి.
3.మిథున రాశి
మిథున రాశి వారికి కూడా ఇది అద్భుతమైన సమయం. ఈ రెండు గ్రహాల కలయిక ఈ రాశి వారికి శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. అదృష్టం పెరుగుతుంది. ఎప్పటినుంచో పూర్తి కాకుండా ఉన్న పనులను ఈ సమయంలో పూర్తి చేస్తారు. మతపరమైన పనుల్లో కూడా ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు కూడా ఇది శుభ సమయం.
4.తులా రాశి
తులా రాశి వారికి ఈ రెండు గ్రహాల సంయోగం అద్భుతంగా మారుతుంది. ప్రేమ, చదువు, పిల్లల విషయంలో శుభ ఫలితాలను చూస్తారు. క్రియేటివ్ వర్క్, ఆర్ట్స్‌కు సంబంధించిన రంగాల్లో పని చేస్తున్న వారికి కూడా ఇది అద్భుతమైన సమయం. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికపరంగా బాగుంటుంది.
5.కుంభ రాశి
కుంభ రాశి వారికి రెండు ప్రధాన గ్రహాల కలయిక అద్భుతంగా మారుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వైవాహిక జీవితంలో ప్రేమ మరింత పెరుగుతుంది. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉంటారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


