Himachal Landslide Accident : హిమాచల్‌లో ఘోర ప్రమాదం - కొండచరియలు విరిగిపడి 13 మంది దుర్మరణం!

Himachal Pradesh Landslide Accident : హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ - స్పితిలో కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.  ఆరు నెలల పసికందు సహా 13 మంది మృతి చెందారు. కొండరాళ్ల దెబ్బకు వాహనంలో మంటలు చెలరేగి ప్రమాద తీవ్రత పెరిగింది.

Published on: Jul 24, 2026, 18:30:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Himachal Pradesh Landslide Accident : హిమాచల్ ప్రదేశ్‌లోని పర్వత ప్రాంత ప్రయాణాలు మళ్లీ తీవ్ర విషాదాన్ని నింపాయి. శుక్రవారం లాహౌల్-స్పితి జిల్లాలోని ఉదయ్‌పూర్-పాంగీ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక ట్యాక్సీపై కొండ పైభాగం నుంచి ఒక్కసారిగా భారీ రాళ్లు, కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘోర ప్రమాదంలో ఆరు నెలల పసికందు సహా మొత్తం 13 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు సమయస్ఫూర్తితో బయటకు దూకడంతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.

హిమాచల్‌లో ఘోర ప్రమాదం (ANI ) (ANI )
హిమాచల్‌లో ఘోర ప్రమాదం (ANI ) (ANI )

ఏం జరిగిందంటే..?

కుల్లు నుంచి కిల్లార్ వైపు వెళ్తున్న టాటా సుమో వాహనం కడు నాలా సమీపానికి చేరుకోగానే…. సమీపంలోని కొండ నుంచి భారీ రాళ్లు ఒక్కసారిగా వాహనంపై పడ్డాయి. రాళ్ల దెబ్బకు వాహనం నుజ్జునుజ్జు అవ్వడమే కాకుండా, వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జిల్లా కేంద్రం కీలాంగ్‌కు దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, ఆర్మీ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకు రాగా…. వాహనం రాళ్ల కింద పడి పూర్తిగా నలిగిపోయి మంటల్లో కాలిపోయింది.

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనలో 13 మంది మరణించినట్లు లాహౌల్-స్పితి జిల్లా కలెక్టర్ కిరణ్ బదానా అధికారికంగా ధృవీకరించారు. ప్రమాదంలో మరణించిన వారి గుర్తింపును అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు దిగ్భ్రాంతి

ఈ ఘోర ప్రమాదంపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. లాహౌల్-స్పితి డిప్యూటీ కమిషనర్‌ను తక్షణమే ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సాధ్యమైన అన్ని విధాలా సహాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు ఈ ఆరని లోటును తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే గాయపడిన ఇద్దరికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More