15-15-15 rule : ఈ ఒక్క ఫార్ములాతో.. 15ఏళ్లల్లో ఏకంగా రూ. 1కోటి సంపద సృష్టి!

మ్యూచువల్ ఫండ్స్​లో సిప్​ ద్వారా రూ.1 కోటి కార్పస్ నిధిని ఎలా సమకూర్చుకోవచ్చో తెలిపే మంత్రమే '15-15-15 ఫార్ములా'. కాంపౌండింగ్ పవర్​తో దీర్ఘకాలంలో భారీ సంపదను ఎలా సృష్టించవచ్చో విశ్లేషించే ప్రత్యేక కథనం..

Published on: Oct 25, 2026, 09:10:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రిటైర్మెంట్ సమయానికి చేతిలో రూ.కోటి నిధి ఉంటే జీవితం నిశ్చింతగా ఉంటుంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో నివసించే సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక పెద్ద కల. అయితే నెలకు కొంత కొంత చొప్పున క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే ఈ రూ.కోటి లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్​లో సంపద సృష్టికి అత్యంత ప్రజాదరణ పొందిన '15-15-15 ఫార్ములా'ను ఉపయోగించాలని సూచిస్తున్నారు.

మ్యూచువల్​ ఫండ్ ఇన్వెస్ట్​మెంట్ టిప్స్..
మ్యూచువల్​ ఫండ్ ఇన్వెస్ట్​మెంట్ టిప్స్..

15-15-15 ఫార్ములా అంటే ఏంటి?

సాధారణ పొదుపు ఖాతాలు లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో డబ్బులు దాచడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం కష్టం. కానీ స్టాక్ మార్కెట్ ఆధారిత సిప్​లలో పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో చక్రవడ్డీ లాభాలు అందుతాయి.

ఇక ఈ 15-15-15 సూత్రాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి దీనిని మూడు '15'లుగా విభజించారు:

మొదటి 15: ప్రతి నెలా రూ.15,000 చొప్పున సిప్ (సిస్టెమాటిక్ ఇన్వెస్ట్​మెంట్ ప్లాన్) రూపంలో ఇన్వెస్ట్ చేయడం.

రెండొవ 15: ఏమాత్రం విరామం ఇవ్వకుండా 15 ఏళ్ల పాటు సుదీర్ఘ కాల పరిమితితో పెట్టుబడిని కొనసాగించడం.

మూడొవ 15: వార్షికంగా 15 శాతం సగటు రాబడిని అంచనా వేయడం.

ఈ మూడు అంశాలు కలిసినప్పుడు “చక్రవడ్డీ” (కాంపౌండింగ్) మ్యాజిక్ మొదలవుతుంది. మీరు పొందే లాభాలపై మళ్లీ లాభాలు రావడం వల్ల చిన్న మొత్తంలో ప్రారంభించిన పొదుపు నిధి కాలక్రమేణా భారీ సంపదగా మారుతుంది.

లెక్కలు ఇవే: రూ.27 లక్షలతో రూ.కోటి నిధి!

ఈ 15-15-15 ఫార్ములా ప్రకారం మీ పెట్టుబడి ఏ విధంగా పెరుగుతుందో స్పష్టమైన లెక్కలతో పరిశీలిద్దాం:

  • నెలవారీ మ్యూచువల్ ఫండ్ సిప్: రూ.15,000
  • పెట్టుబడి కాలం: 15 సంవత్సరాలు (మొత్తం 180 నెలలు)
  • మీరు జమ చేసే మొత్తం నిధి: రూ.27.00 లక్షలు
  • అంచనా వేసిన వార్షిక రాబడి: 15%
  • రాబడి ద్వారా వచ్చే అంచనా లాభం: రూ.74.53 లక్షలు
  • 15 ఏళ్ల తర్వాత చేతికి అందే మొత్తం (కార్పస్): రూ.1,01,52,946 (సుమారు రూ.1.01 కోటి)

అంశాలు

అమౌంట్ (అంచనా)

నెలవారీ సిప్రూ. 15,000
ఇన్వెస్ట్​మెంట్ పీరియడ్15 సంవత్సరాలు
ఇన్వెస్ట్​ చేసే మొత్తం అమౌంట్రూ. 27,00,000
వార్షిక రిటర్ను (అంచనా)15శాతం
కార్పస్ (అంచనా)రూ. 1,01,52,946
సంపద సృష్టి (అంచనా)రూ. 74,52,946

ఈ లెక్కను గమనిస్తే.. మీరు 15 ఏళ్లలో సొంతంగా పొదుపు చేసేది కేవలం రూ.27 లక్షలు మాత్రమే. కానీ సమయం, కాంపౌండింగ్ ప్రభావం తోడవడంతో అదనంగా రూ.74.53 లక్షల లాభం వచ్చి చేరుతుంది.

ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాల్సిన విషయాలు..

15 శాతం రాబడి అనేది ఒక అంచనా మాత్రమే తప్ప గ్యారెంటీ కాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ ఫార్ములాను పాటించేటప్పుడు ఇన్వెస్టర్లు కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి:

మార్కెట్ అస్థిరతలు: మ్యూచువల్ ఫండ్లు స్టాక్ మార్కెట్‌తో ముడిపడి ఉంటాయి. ప్రపంచ ఆర్థిక పరిణామాలు, రూపాయి విలువ, ముడిచమురు ధరలు, ద్రవ్యోల్బణం ఆధారంగా మార్కెట్ రాబడులు మారుతుంటాయి.

క్రమశిక్షణే ప్రధానం: మార్కెట్లు పడిపోయిన సమయంలో కూడా మ్యూచువల్​ ఫండ్ సిప్​ని ఆపకుండా కొనసాగించినప్పుడే రూపీ కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనం లభిస్తుంది.

పోర్ట్‌ఫోలియో సమీక్ష: ఏటా మీ మ్యూచువల్​ ఫండ్ పెట్టుబడుల పనితీరును పరిశీలించుకోవాలి. ఆశించిన స్థాయిలో రాబడి ఇవ్వని ఫండ్ల నుంచి లాభదాయకమైన ఈక్విటీ ఫండ్లకు మారడం శ్రేయస్కరం.

స్టెప్-అప్ సిప్ వెసులుబాటు: ఉద్యోగులకు ఏటా జీతం పెరిగినప్పుడు సిప్ మొత్తాన్ని 10% చొప్పున పెంచుకుంటూ పోతే ఈ రూ.కోటి లక్ష్యాన్ని 15 ఏళ్ల కంటే ముందే 10 లేదా 12 ఏళ్లలోనే సాధించవచ్చు.

ఆర్థిక క్రమశిక్షణ, ఓర్పు, సరైన ప్రణాళిక ఉన్నప్పుడు సంపద సృష్టి సాధ్యమవుతుంది.

గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీ రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని అంచనా వేసుకుని, సెబీ నమోదిత ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం మంచిది.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More