ఆధునిక డిజైన్, సరికొత్త ఫీచర్లతో 2026 Kia Seltos ఎస్‌యూవీ - రేపే లాంచ్..
2026 కియా సెల్టోస్ రేపు, బుధవారం లాంచ్కానుంది. ఈ నేపథ్యంలో సంస్థ కొత్త టీజర్ విడుదల చేసింది. ఆధునిక డిజైన్, సరికొత్త ఫీచర్లతో ఎస్‌యూవీ ప్రియులను ఆకట్టుకోనున్న ఈ నెక్ట్స్ జెన్ సెల్టోస్ గురించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో ఉన్న కియా సెల్టోస్‌కి సంబంధించిన ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ డిసెంబర్ 10న లాంచ్కానుంది. ఈ నేపథ్యంలో కంపెనీ తాజాగా మరో టీజర్‌ను విడుదల చేసింది. ఆరేళ్ల క్రితం మొదటి మోడల్ అరంగేట్రం చేసిన తర్వాత ఈ ఎస్‌యూవీని ఇంత సమగ్రమైన రీడిజైన్ చేయడం ఇదే తొలిసారి. పూర్తిగా కొత్త లుక్‌లో రానున్న ఈ సెల్టోస్.. మరింత బోల్డ్ ఎక్స్‌టీరియర్, అధునాతన టెక్నాలజీ ఫీచర్లు, మెరుగైన భద్రతా ఎలిమెంట్స్‌తో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ 2026 కియా సెల్టోస్ ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

2026 కియా సెల్టోస్ 'ఎక్స్-లైన్' ట్రిమ్‌పై ప్రత్యేక దృష్టి..
ఈ కొత్త టీజర్ ముఖ్యంగా ఎక్స్-లైన్ వేరియంట్‌ని హైలైట్ చేస్తోంది.
దీని ప్రత్యేకత మ్యాట్ బ్లాక్ రంగు ఎక్స్‌టీరియర్ పెయింట్, డార్కర్ యాక్సెంట్లు. ఎస్‌యూవీ వెనుక భాగంలో కొత్తగా కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్-లైట్ బార్ ఉంటుంది. అప్‌డేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, కొత్త ఫాగ్ ల్యాంప్స్, పెంటగాన్ ఆకారపు ఇన్సర్ట్‌లతో రీషేప్డ్ రేర్ బంపర్ కూడా కనిపిస్తాయి.
అంతేకాకుండా, ఇంటిగ్రేటెడ్ స్టాప్ ల్యాంప్‌తో కూడిన రివైజ్డ్ రూఫ్ స్పాయిలర్, వీల్ ఆర్చెస్ చుట్టూ గ్లోస్-బ్లాక్ క్లాడింగ్, షార్క్-ఫిన్ యాంటెన్నా వంటివి కూడా ఈ టీజర్‌లో స్పష్టంగా కన్పిస్తున్నాయి.
కియా సెల్టోస్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ అనేది కియా గ్లోబల్ డిజైన్ మార్పులను ప్రతిబింబిస్తుంది. ఇది మరింత వెడల్పైన గ్రిల్, పదునైన లైటింగ్ సిగ్నేచర్స్, మరింత స్క్వేర్డ్-ఆఫ్ స్టాన్స్ (బలమైన, చతురస్రాకారపు లుక్)ను కలిగి ఉంటుంది. ముందు భాగంలో కియా సరికొత్త స్టార్ మ్యాప్ డీఆర్ఎల్ సిగ్నేచర్ వస్తుంది. వెనుక భాగంలో, రీవర్క్ చేసిన ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్ మరింత క్లీన్‌గా, ఆధునికంగా కనిపిస్తుంది.
ఇది కొత్త ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, అప్‌డేట్ చేసిన కలర్ ఆప్షన్లను కూడా కలిగి ఉంటుంది.
అల్లాయ్ వీల్స్ కనిపించనప్పటికీ, కొత్త డిజైన్ వీల్స్, రివైజ్డ్ ఓఆర్వీఎం, ట్వీక్డ్ సీ-పిల్లర్‌ను ఆశించవచ్చు.
టెక్నాలజీతో నిండిన క్యాబిన్..
2026 కియా సెల్టోస్ ఇంటీరియర్ మరింత ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. పూర్తిగా అప్‌డేట్ చేసిన డాష్‌బోర్డ్, రీడిజైన్ చేసిన సెంటర్ కన్సోల్ ఇందులో ఉంటాయి.
క్యాబిన్‌లోని ప్రధాన ఆకర్షణ డ్యుయల్-స్క్రీన్ సెటప్ - ఇందులో డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటాయి.
పనోరమిక్ సన్‌రూఫ్, డ్యుయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్‌లు, 360-డిగ్రీ కెమెరా వంటి అప్‌గ్రేడ్‌లు కూడా ఉండవచ్చు.
భద్రతా ఫీచర్లను బలోపేతం చేయడానికి కియా ఇందులో లెవెల్ 2+ అడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ను కూడా జోడించే అవకాశం ఉంది.
2026 కియా సెల్టోస్- హైబ్రిడ్ వచ్చేస్తోంది!
2026 కియా సెల్టోస్‌లో ప్రస్తుత ఇంజిన్ ఆప్షన్లే కొనసాగే అవకాశం ఉంది.
1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్లు మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో అందుబాటులో ఉంటాయి.
కాగా అతిపెద్ద వార్త ఏంటంటే.. ఈ నెక్స్ట్-జెన్ మోడల్‌తో పాటు హైబ్రిడ్ పవర్‌ట్రైన్ కూడా వచ్చే అవకాశం ఉంది!
2025 ఇన్వెస్టర్స్ డే సందర్భంగా, కియా తన లైనప్‌లో హైబ్రిడ్ వాహనాలను విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. ఈ ప్రయత్నంలో, కొత్త సెల్టోస్ ముందుండే అవకాశం ఉంది.














