2026 కియా సెల్టోస్ వేరియంట్లు, ఫీచర్లు, వాటి ధరల వివరాలు..
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియా.. తన 2026 సెల్టోస్‌ను భారత మార్కెట్లో ఇటీవలే విడుదల చేసింది. రూ. 10.99 లక్షల ప్రారంభ ధరతో లభించే ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ వేరియంట్లు, ఫీచర్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారతీయ రోడ్లపై అత్యంత ఆదరణ పొందిన ఎస్‌యూవీల్లో ఒకటైన 'కియా సెల్టోస్' ఇప్పుడు సరికొత్త రూపంలో మన ముందుకు వచ్చింది. 2026 కియా సెల్టోస్‌ని కియా ఇండియా ఇటీవలే అధికారికంగా లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కియా ఈ కారును హెచ్‌టీఈ, హెచ్‌టీఈ (ఓ), హెచ్టీకే, హెచ్టీకే (ఓ), హెచ్‌టీఎక్స్, హెచ్‌టీఎక్స్ (ఏ), జీటీఎక్స్, జీటీఎక్స్ (ఏ) అనే ఎనిమిది ప్రధాన ట్రిమ్స్‌లో ప్రవేశపెట్టింది. వేర్వేరు ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో కలిపి మొత్తంగా 34 వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో 2026 కియా సెల్టోస్ వేరియంట్లు, ఫీచర్లు, ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
2026 కియా సెల్టోస్- ఇంజిన్, పెర్ఫార్మెన్స్..
కొత్త సెల్టోస్ మూడు రకాల పవర్ఫుల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తోంది:
1.5-లీటర్ పెట్రోల్ (ఎన్ఏ): ఇది 115 హెచ్‌పీ పవర్‌ని, 144 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
1.5-లీటర్ టర్బో-పెట్రోల్: ఇది మరింత శక్తివంతమైన 160 హెచ్‌పీ పవర్, 253 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది.
1.5-లీటర్ డీజిల్: ఇది 116 హెచ్‌పీ పవర్‌ని, 250 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
గేర్ బాక్స్ విషయానికి వస్తే.. మ్యాన్యువల్ (ఎంటీ), ఐవీటీ, డ్యూయల్-క్లచ్ (డీసీటీ), ఆటోమేటిక్ (ఏటీ) ఆప్షన్లలో కస్టమర్లు తమకు నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు.
2026 కియా సెల్టోస్ వేరియంట్ల వారీగా ఫీచర్లు..
హెచ్‌టీఈ వేరియంట్ (ధర: రూ. 10.99 లక్షల నుంచి): ఇది బేస్ వేరియంట్ అయినప్పటికీ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, డీఆర్ఎల్‌లు, 16-ఇంచ్ స్టీల్ వీల్స్, 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్‌ప్లే, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, అన్ని వీల్స్‌కి డిస్క్ బ్రేక్‌ల వంటి అవసరమైన ఫీచర్లతో వస్తుంది.
హెచ్‌టీఈ (ఓ) వేరియంట్ (ధర: రూ. 12.09 లక్షల నుంచి): ఇందులో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ట్రాక్షన్ కంట్రోల్, డ్రైవ్ మోడ్స్, 60:40 స్ల్పిట్ రియర్ సీట్లు, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు అదనంగా ఉంటాయి.
హెచ్టీకే వేరియంట్ (ధర: రూ. 13.09 లక్షల నుంచి): ఆటో-ఫోల్డ్ మిర్రర్లు, పుష్-బటన్ స్టార్ట్, స్మార్ట్ కీ, వెనుక వైపు సన్‌షేడ్స్, కొన్ని వేరియంట్లలో 17-ఇంచ్ అలాయ్ వీల్స్ ఇందులో లభిస్తాయి.
హెచ్టీకే (ఓ) వేరియంట్ (ధర: రూ. 14.19 లక్షల నుంచి): ప్రధాన ఆకర్షణ అయిన పనోరమిక్ సన్‌రూఫ్ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. దీనితో పాటు ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ డ్రైవర్ సీట్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.
హెచ్‌టీఎక్స్ వేరియంట్ (ధర: రూ. 15.59 లక్షల నుంచి): యాంబియంట్ లైటింగ్, 12.3-ఇంచ్ పెద్ద టచ్‌స్క్రీన్, 8-స్పీకర్ల బోస్ ఆడియో సిస్టమ్, గ్లోసీ బ్లాక్ గ్రిల్‌తో ఈ వేరియంట్ ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.
హెచ్‌టీఎక్స్ (ఏ) వేరియంట్ (ధర: రూ. 16.69 లక్షల నుంచి): భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ 2026 కియా సెల్టోస్ వేరియంట్లో లెవల్ 2+ అడాస్ టెక్నాలజీని చేర్చారు. 360-డిగ్రీల కెమెరా, 12.3-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే దీని ప్రత్యేకత.
జీటీఎక్స్, జీటీఎక్స్ (ఏ) వేరియంట్లు (ధర: రూ. 18.39 లక్షల నుంచి): ఇవి టాప్-ఎండ్ వేరియంట్లు. కేవలం ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో మాత్రమే లభిస్తాయి. మెమరీ సీట్లు, 18-ఇంచ్ పెద్ద వీల్స్, 21 రకాల అడాస్ ఫీచర్లతో ఇవి అత్యంత సురక్షితమైన, విలాసవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


