200ఎంపీ కెమెరా, 7000ఎంఏహెచ్​ బ్యాటరీ- ఇంకొన్ని రోజుల్లో అదిరిపోయే స్మార్ట్​ఫోన్స్​ లాంచ్​…

కొత్త సంవత్సరం ప్రారంభంలోనే భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సందడిగా మారింది. దిగ్గజ టెక్ కంపెనీలు తమ కొత్త డివైజ్‌లను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. రియల్‌మీ, రెడ్‌మీ, ఒప్పో, పోకో నుంచి అదిరే గ్యాడ్జెట్స్​ వస్తున్నాయి. ఆ వివరాలు..

Published on: Jan 3, 2026, 09:10:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2026 సంవత్సరం స్మార్ట్‌ఫోన్ లవర్స్​కి అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వబోతోంది. బడ్జెట్ నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు వరుస లాంచ్‌లతో మొబైల్ మార్కెట్ కళకళలాడుతోంది. పలు ప్రధాన కంపెనీలు తమ వినూత్న ఉత్పత్తులను జనవరి నెలలోనే మార్కెట్లోకి తెస్తుండటంతో కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి మరిన్ని ఆప్షన్లు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెలలో లాంచ్​కానున్న స్మార్ట్​ఫోన్స్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

ఇంకొన్ని రోజుల్లో అదిరిపోయే స్మార్ట్​ఫోన్స్​ లాంచ్​… (Realme)
ఇంకొన్ని రోజుల్లో అదిరిపోయే స్మార్ట్​ఫోన్స్​ లాంచ్​… (Realme)

రియల్‌మీ 16 ప్రో సిరీస్..

రియల్‌మీ ఈ ఏడాదిని జనవరి 6న గ్రాండ్‌గా ప్రారంభించనుంది. ఈ సిరీస్‌లో ‘రియల్‌మీ 16 ప్రో’, 'రియల్‌మీ 16 ప్రో ప్లస్' అనే రెండు మోడళ్లు రానున్నాయి. ఈ ఫోన్లు ప్రధానంగా కెమెరా పనితీరుపై దృష్టి సారించాయి.

కెమెరా: రెండింటిలోనూ 200ఎంపీ మెయిన్ కెమెరా ఉండగా, ప్రో ప్లస్ మోడల్‌లో 50ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను అదనంగా చేర్చారు.

ప్రాసెసర్: రియల్​మీ 16 ప్రో ప్లస్ స్మార్ట్​ఫోన్​ 'స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4' ప్రాసెసర్‌తో, ప్రో మోడల్ 'మీడియాటెక్ డైమెన్సిటీ 7000' సిరీస్ చిప్‌తో వచ్చే అవకాశం ఉంది.

బ్యాటరీ: రెండింటిలోనూ 7,000ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ, 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇదే రోజున కంపెనీ రియల్‌మీ ప్యాడ్ 3 టాబ్లెట్‌ను కూడా విడుదల చేయనుంది. ఇందులో 12,200ఎంఏహెచ్​ బ్యాటరీ, 2.8కే డిస్‌ప్లే ఉండబోతున్నాయి.

రెడ్‌మీ నోట్ 15 5జీ..

రెడ్‌మీ నోట్ 15 5జీ కూడా జనవరి 6న విడుదల కానుంది.

ఫీచర్లు: 108ఎంపీ మెయిన్ కెమెరా, 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్ దీని ప్రత్యేకతలు. కేవలం 7.35ఎంఎం మందంతో ఉండే ఈ ఫోన్‌లో 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్ గల కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది.

పెర్ఫార్మెన్స్: ఇది 'స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3' ప్రాసెసర్, 5,520ఎంఏహెచ్​ బ్యాటరీ, 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో రానుంది. ఇదే వేదికపై ప్యాడ్ 2 ప్రో 5G టాబ్లెట్‌ను కూడా కంపెనీ పరిచయం చేయనుంది. ఇది డాల్బీ అట్మోస్, డాల్బీ విజన్, 12,000ఎంఏహెచ్​ బ్యాటరీ వంటి ఫీచర్లతో వస్తోంది.

రెడ్​మీ నోట్​ 15 సిరీస్​కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

పోకో ఎం8..

పోకో బ్రాండ్ నుంచి పోకో ఎం8 స్మార్ట్‌ఫోన్ జనవరి 8న భారత్‌లో లాంచ్ కానుంది. ఇది తక్కువ ధరలో మెరుగైన స్పెసిఫికేషన్లు కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని వస్తోంది. పెర్ఫార్మెన్స్‌కు పెద్దపీట వేసే పోకో, ఈ బడ్జెట్ సెగ్మెంట్‌లో ఎలాంటి ఫీచర్లు తెస్తుందోనని యూజర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఒప్పో రెనో 15 సిరీస్..

ఒప్పో తన పాపులర్ రెనో సిరీస్‌లో రెనో 15, రెనో 15 ప్రో, రెనో 15 ప్రో మినీ ఫోన్లను ఈ నెలాఖరులోపు విడుదల చేయనుంది.

డిస్‌ప్లే: ప్రో మోడల్‌లో 6.78 ఇంచ్​ స్క్రీన్ (గొరిల్లా గ్లాస్ విక్టస్ 2), ప్రో మినీలో 6.32 ఇంచ్​ స్క్రీన్, స్టాండర్డ్ మోడల్‌లో 6.59 ఇంచ్​ అమోలెడ్ స్క్రీన్లు ఉండనున్నాయి.

భద్రత: ఈ మూడు మోడళ్లు నీరు, ధూళి నుంచి రక్షణ కోసం ఐపీ66, ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లతో వస్తున్నాయి. ఇప్పటికే దీని కోసం 'ప్రివిలేజ్ ప్యాక్' విక్రయాలను ఒప్పో ప్రారంభించింది.

మరి వీటిల్లో మీరు ఏ గ్యాడ్జెట్​ని కొనుగోలు చేస్తారు?

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More