మార్కెట్​లోకి కొత్త ఫ్యామిలీ ఎస్​యూవీలు- 2026 కియా సెల్టోస్​, టాటా సియెర్రాలో ఏది బెస్ట్​?

భారత రోడ్లపై కియా సెల్టోస్, టాటా సియెర్రాల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. అదిరిపోయే ఫీచర్లు, పవర్‌ఫుల్ ఇంజిన్లతో వచ్చిన ఈ రెండు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్? దేని ధర తక్కువ? ఫీచర్లు ఎక్కువ? పూర్తి వివర

Published on: Jan 2, 2026, 13:00:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్​లో మిడ్-సైజ్ ఎస్‌యూవీల మధ్య పోటీ మరింత పెరిగింది1 ఒకవైపు అత్యాధునిక టెక్నాలజీతో దూసుకొచ్చిన 2026 'కియా సెల్టోస్', మరోవైపు తన ఘనమైన చరిత్రను గుర్తుచేస్తూ అగ్రెసివ్​ డిజైన్​తో వచ్చిన 'టాటా సియెర్రా'. ఈ రెండు కార్లు కూడా వినియోగదారులను ఆకట్టుకోవడంలో పోటాపోటీగా నిలుస్తున్నాయి. మరి మీ అవసరాలకు ఈ రెండు ఫ్యామిలీ ఎస్​యూవీల్లో ఏది సరిపోతుంది? ఏ ఎస్​యూవీలో ఫీచర్స్​ ఎక్కువ? దేని ధర తక్కువ? పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

2026 కియా సెల్టోస్​ వర్సెస్​ టాటా సియెర్రా..
2026 కియా సెల్టోస్​ వర్సెస్​ టాటా సియెర్రా..

2026 కియా సెల్టోస్​ వర్సెస్​ టాటా సియెర్రా- డైమెన్షన్స్​..

2026 కియా సెల్టోస్ 4,460 ఎంఎం పొడవు, 1,830 ఎంఎం వెడల్పు, 1,635 ఎంఎం ఎత్తుతో పాటు 2,690 ఎంఎం వీల్‌బేస్‌ను కలిగి ఉంది. సెల్టోస్ ఎస్​యూవీ పొడవు ఎక్కువగా ఉండటం వల్ల రోడ్డుపై ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

అయితే, టాటా సియెర్రా కొన్ని విషయాల్లో సెల్టోస్‌ను మించిపోయింది. దీని పొడవు 4,340 ఎంఎం ఉన్నప్పటికీ, వీల్‌బేస్ మాత్రం 2,730 ఎంఎం ఉండటం వల్ల లోపల కాలు ఉంచుకోవడానికి ఎక్కువ స్థలం దొరుకుతుంది. అంతేకాకుండా 1,715 ఎంఎం ఎత్తు, 1,841 ఎంఎం బాడీ వెడల్పుతో సియెర్రా చాలా గంభీరంగా, వెడల్పుగా కనిపిస్తుంది.

2026 కియా సెల్టోస్​ వర్సెస్​ టాటా సియెర్రా- ఫీచర్లు..

2026 కియా సెల్టోస్​లో లెవల్​ 2 ప్లస్​ డాస్​, వాయిస్​ కంట్రోల్డ్​ డ్యూయెల్​ పేన్​ సన్​రూఫ్​, వెంటిలేటెడ్​ ఫ్రెంట్​ సీట్స్​, ఆటోమేటిక్​ స్ట్రీమ్​లైన్​ డోర్​ హ్యాండిల్స్​, 8- స్పీకర్​ బోస్​ ప్రీమియం ఆడియో సిస్టమ్​, ఏఐ ఆధారిత వాయిస్​ రికగ్నీషన్​​, 8 ఇంచ్​ హెడ్​-అప్​ డిస్​ప్లే, 64 కలర్​ యాంబియెంట్​ మూడ్​ లైటింగ్​, కియా కనెక్ట్​ 2.0 టెక్​ వంటివి ఉన్నాయి.

అదనంగా, ఆటోమేటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, 10-వే అడ్జెస్టెబుల్​ డ్రైవర్​ సీట్​, 2-టోన్​ ఇంటీరియర్​, మెమొరీ ఓఆర్​వీఎంలు, టైప్​-సీ యూఎస్​బీ పోర్ట్​లు, 60:40 సీట్లు, 6 ఎయిర్​ బ్యాగ్స్​, ఏబీఎస్​ విత్​ ఈబీడీ, బ్లైండ్​ వ్యూ మానిటర్​, 360 డిగ్రీ సరౌండ్​ కెమెరా, సైడ్​ పార్కింగ్​ సెన్సార్లు వంటివి ఉన్నాయి.

టాటా సియెర్రా కూడా ఒక ఫీచర్​- రిచ్​ ఎస్​యూవీ అనే చెప్పుకోవాలి. ఇందులో 3 స్క్రీన్​ స్టెప్​, రేర్​ ఫాంగ్​ ల్యాంప్స్​, అమెజాన్​ అలెక్సా ఇంటిగ్రేషన్​, ఇన్​-బిల్ట్​ మాపల్స్​ నేవిగేషన్​, లెవల్​ 2 ప్లస్​ అడాస్​, బ్రీత్​ఐకూ ఎయిర్​ ప్యూరిఫయర్​, డాల్బీ 5.1 అట్మోస్​ ఆడియో, 12 జేబీఎల్​ స్పీకర్స్​, వెంటిలేటెడ్​ సీట్లు, వైర్​లెస్​ ఛార్జర్​, 6-వే పవర్డ్​ డ్రైవర్​ సీట్​, వాయిస్​ అసిస్టెడ్​ పనోరమిక్​ సన్​రూఫ్​, ఆటోమేటిక్​ క్లైమేట్​ కంట్రోల్​ వంటి ఫీచర్లు ఉన్నాయి.

2026 కియా సెల్టోస్​ వర్సెస్​ టాటా సియెర్రా- ఇంజిన్..

కియా సెల్టోస్ మూడు ఆప్షన్లలో లభిస్తుంది:

1.5 లీటర్ పెట్రోల్ (115 హెచ్​పీ, 144 ఎన్​ఎం)

1.5 లీటర్ టర్బో-పెట్రోల్ (160 హెచ్​పీ, 253 ఎన్​ఎం)

1.5 లీటర్ డీజిల్ (116 హెచ్​పీ, 250 ఎన్​ఎం) ఇందులో మాన్యువల్, ఐవీటీ, డీసీటీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయి.

టాటా సియెర్రా కూడా ఇదే తరహాలో మూడు ఇంజిన్లతో వస్తుంది:

1.5 లీటర్ పెట్రోల్ (106 హెచ్​పీ, 145 ఎన్​ఎం)

1.5 లీటర్ టర్బో-పెట్రోల్ (160 హెచ్​పీ, 255 ఎన్​ఎం)

1.5 లీటర్ డీజిల్ (118 హెచ్​పీ, 280 ఎన్​ఎం) దీనిలో 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్, 7-స్పీడ్ డీసీఏ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి.

2026 కియా సెల్టోస్​ వర్సెస్​ టాటా సియెర్రా- ధరలు..

ధర విషయంలో కియా సెల్టోస్ చాలా అగ్రెసివ్​గా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు. అదే సమయంలో టాప్ వేరియంట్ రూ. 19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్దే ముగుస్తుంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి 2026 కియా సెల్టోస్​ ఎస్​యూవీ ఇది మంచి ఛాయిస్.

మరోవైపు, టాటా సియెర్రా ధర రూ. 11.49 లక్షల నుంచి మొదలై రూ. 21.29 లక్షల వరకు వెళుతుంది. అంటే సెల్టోస్ కంటే సియెర్రా కాస్త ఖరీదైనది. ఎక్కువ స్థలం, గంభీరమైన రూపం, ప్రీమియం ఎక్స్​పీరియెన్స్​ని కోరుకునే వారు సియెర్రా వైపు మొగ్గు చూపుతున్నారు.

మొత్తానికి, టెక్నాలజీ ప్రాధాన్యత ఇచ్చేవారికి సెల్టోస్.. కంఫర్ట్- రోడ్ ప్రజెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చేవారికి సియెర్రా సరైన ఎంపిక అని చెప్పవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More