టాటా సియెర్రాకి పోటీగా మహీంద్రా కొత్త ఎస్​యూవీ- ఇది ‘బుడ్డి’ స్కార్పియో​!

మహీంద్రా తన సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'విజన్-ఎస్' టెస్టింగ్ ప్రారంభించింది. 'బేబీ స్కార్పియో'గా పిలుస్తున్న ఈ కారు రగ్గడ్ డిజైన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో త్వరలోనే మార్కెట్లోకి రానుంది. దీని స్పై షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Published on: Dec 25, 2025 2:01 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎస్‌యూవీల తయారీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న మహీంద్రా అండ్ మహీంద్రా.. ఇప్పుడు తన పోర్ట్‌ఫోలియోను మరింత ఎక్స్​ప్యాండ్​ చేసే పనిలో పడింది. తన కొత్త 'ఎన్​యూ ఐక్యూ' అనే మల్టీ-ఎనర్జీ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఒక కొత్త ఎస్​యూవీని రూపొందిస్తోంది. దాని పేరు ‘మహీంద్రా విజన్-ఎస్’. ఇదొక కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఈ మోడల్​ని త్వరలో ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది.

మహీంద్రా విజన్​ ఎస్​..
మహీంద్రా విజన్​ ఎస్​..

ఇటీవల ఈ కారు భారత రోడ్ల మీద టెస్ట్​ డ్రైవ్​ చేస్తూ కనిపించింది. ఈ స్పా షాట్స్​ ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. టాటా సియెర్రాకి పోటీనిచ్చేందుకు రెడీ అవుతున్న ఈ విజన్​ ఎస్​కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..

మహీంద్రా విజన్​-ఎస్​ ఎస్​యూవీ..

డిజైన్​ని చూస్తుంటే ఈ విజన్​-ఎస్​ మహీంద్రా స్కార్పియోకి బేబీ వర్షెన్​లా తలిపిస్తుంది. బాక్సీ షేప్, నిటారుగా ఉండే ఫ్రంట్ ఫాసియా, ఫ్లాట్ బోనెట్ దీనికి రగ్గడ్ లుక్‌ను ఇస్తున్నాయి. థార్ రాక్స్‌లో చూసినట్లుగానే ఇందులో గుండ్రటి హెడ్‌ల్యాంప్స్, వర్టికల్ గ్రిల్ ఉండనున్నాయి. కారు కింది భాగంలో రాడార్ యూనిట్ కనిపిస్తుండటంతో.. ఇందులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్​) ఫీచర్లు ఖచ్చితంగా ఉంటాయని అర్థమవుతోంది.

ఈ విజన్​- ఎస్​ కాన్సెప్ట్​ని 2025 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తొలిసారి ఆవిష్కరించింది మహీంద్రా అండ్​ మహీంద్రా సంస్థ. ఇప్పుడు ఇది టెస్ట్​ డ్రైవ్​ దశకు చేరుకుంది.

మహీంద్రా విజన్​- ఎస్​.. ఆఫ్-రోడింగ్‌కు అనుకూలంగా..

మహీంద్రా కార్లంటేనే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజన్-ఎస్ ఎస్​యూవీ కూడా భారీ చక్రాలు, హై-ప్రొఫైల్ టైర్లతో ఎత్తుగా కనిపిస్తోంది. గతుకుల రోడ్లపై కూడా సౌకర్యవంతంగా వెళ్లేందుకు వీలుగా ఇందులో 5-లింక్ రయర్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ ఉండవచ్చని సమాచారం. వెనుక వైపు టెయిల్‌గేట్‌కు అమర్చిన స్పేర్ వీల్ దీనికి క్లాసిక్ ఎస్‌యూవీ రూపాన్ని ఇచ్చింది.

  • రెనాల్ట్​ డస్టర్​ వచ్చేస్తోంది- పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ కొత్త టీజర్.​ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

మహీంద్రా విజన్​- ఎస్​.. ఫీచర్ల వివరాలు..

బయట ఎంత రగ్గడ్‌గా ఉన్నా, లోపల మాత్రం ఈ మహీంద్రా విజన్​- ఎస్​ ఎస్​యూవీ చాలా ప్రీమియంగా ఉండనుంది.

డాష్‌బోర్డ్‌పై రెండు భారీ 12.3-ఇంచ్​ డిజిటల్ స్క్రీన్‌లు ఉండనున్నాయి. పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ క్యాబిన్‌కు రిచ్ లుక్ ఇస్తాయి.

ముఖ్యంగా ఐసీఈ ఇంజిన్ కలిగిన కార్లలో తొలిసారిగా 'ఫ్లాట్-ఫ్లోర్' డిజైన్‌ను మహీంద్రా పరిచయం చేస్తోంది. దీనివల్ల లోపల స్థలం ఎక్కువగా ఉండి ప్రయాణికులకు చాలా సౌకర్యంగా ఉంటుంది.

సీట్ హీటింగ్, హిల్ డిసెంట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, ఆఫ్-రోడ్ డ్రైవ్ మోడ్స్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లను మహీంద్రా ఇందులో జోడించనుంది. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉండే అవకాశం ఉంది.

మహీంద్రా విజన్​- ఎస్​.. ఇంజిన్..

మహీంద్రా అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ, ప్రారంభంలో విజన్-ఎస్ 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో దీని హైబ్రిడ్, ఫుల్లీ ఎలక్ట్రిక్ వెర్షన్లను కూడా ఆశించవచ్చు.

ఇది మార్కెట్లోకి వస్తే టాటా సియెర్రా వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.