రూ. 10.99 లక్షలకే 2026 కియా సెల్టోస్- వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఇలా..
భారత మార్కెట్లో కియా సెల్టోస్ సెకండ్ జనరేషన్ మోడల్ అధికారికంగా విడుదలైంది. అధునాతన డిజైన్, అదిరిపోయే ఇంటీరియర్స్, లెవల్-2 అడాస్ వంటి భద్రతా ఫీచర్లతో ఎస్‌యూవీ విభాగంలో ఇది సంచలనం సృష్టించనుంది. ఈ మోడల్ వేరియంట్లు, వాటి ధరల వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్‌యూవీల్లో ఒకటైన 'కియా సెల్టోస్' ఇప్పుడు సరికొత్త రూపంలో మన ముందుకు వచ్చింది. కియా ఇండియా తన సెకండ్ జనరేషన్ సెల్టోస్‌ను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది.

అత్యంత పోటీ ఉన్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, విక్టోరిస్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి కార్లకు ఈ 2026 కియా సెల్టోస్ గట్టి పోటీ ఇవ్వనుంది. త్వరలో రానున్న రెనాల్ట్ డస్టర్‌కు కూడా ఇది సవాల్ విసరనుంది. ఈ నేపథ్యంలో 2026 కియా సెల్టోస్ వేరియంట్లు, వాటి ధరలను ఇక్కడ తెలుసుకోండి..
2026 కియా సెల్టోస్ ఎక్స్‌షోరూం ధరలు
| ఇంజిన్ | వేరియంట్ | ధర (రూ. లక్షల్లో) |
|---|---|---|
| 1.5 పెట్రోల్ ఎంటీ | హెచ్‌టీఈ | 10.99 |
| 1.5 పెట్రోల్ ఎంటీ | హెచ్టీకే | 13.09 |
| 1.5 పెట్రోల్ ఎంటీ | హెచ్‌టీఎక్స్ | 15.59 |
| 1.5 పెట్రోల్ ఎంటీ | హెచ్‌టీఎక్స్ (అడాస్) | 16.69 |
| 1.5 పెట్రోల్ ఐవీటీ | హెచ్టీకే | 14.39 |
| 1.5 పెట్రోల్ ఐవీటీ | హెచ్‌టీఎక్స్ | 16.89 |
| 1.5 పెట్రోల్ వీటీ | హెచ్‌టీఎక్స్ (అడాస్) | 17.99 |
| 1.5 పెట్రోల్ ఐవీటీ | జీటీఎక్స్ | 18.39 |
| 1.5 పెట్రోల్ ఐవీటీ | జీటీఎక్స్ (అడాస్) | 19.49 |
| 1.5 టర్బో పెట్రోల్ ఎంటీ | హెచ్టీకే | 13.89 |
| 1.5 టర్బో పెట్రోల్ ఎంటీ | హెచ్టీకే (ఓ) | 14.99 |
| 1.5 టర్బో పెట్రోల్ డీసీటీ | హెచ్టీకే (ఓ) | 16.29 |
| 1.5 టర్బో పెట్రోల్ డీసీటీ | హెచ్‌టీఎక్స్ | 17.69 |
| 1.5 టర్బో పెట్రోల్ డీసీటీ | హెచ్‌టీఎక్స్ (అడాస్) | 18.79 |
| 1.5 టర్బో పెట్రోల్ డీసీటీ | జీటీఎక్స్ | 19.19 |
| 1.5 టర్బో పెట్రోల్ డీసీటీ | జీటీఎక్స్ (అడాస్) | 19.99 |
| 1.5 డీజిల్ ఎంటీ | హెచ్‌టీఈ | 12.59 |
| 1.5 డీజిల్ ఎంటీ | హెచ్టీకే | 14.69 |
| 1.5 డీజిల్ ఎంటీ | హెచ్‌టీఎక్స్ | 17.19 |
| 1.5 డీజిల్ ఎంటీ | హెచ్‌టీఎక్స్ (అడాస్) | 18.29 |
| 1.5 డీజిల్ ఏటీ | హెచ్టీకే | 15.99 |
| 1.5 డీజిల్ ఏటీ | హెచ్‌టీఎక్స్ | 18.49 |
| 1.5 డీజిల్ ఏటీ | హెచ్‌టీఎక్స్ (అడాస్) | 19.59 |
| 1.5 డీజిల్ ఏటీ | జీటీఎక్స్ | 19.79 |
| 1.5 డీజిల్ ఏటీ | జీటీఎక్స్ (అడాస్) | 19.99 |
2026 కియా సెల్టోస్- మరింత భారీగా.. మరింత కంఫర్ట్‌గా!
పాత మోడల్‌తో పోలిస్తే కొత్త కియా సెల్టోస్ ఎస్‌యూవీ పరిమాణం పెరిగింది. ఇది పొడవు, వెడల్పులో మరింత పెద్దదిగా ఉండటం వల్ల కారుకు మంచి రోడ్ ప్రెజన్స్ వచ్చింది. లోపల స్పేస్ కూడా పెరగడంతో, ముఖ్యంగా వెనుక సీట్లో కూర్చునే ప్రయాణికులకు మంచి సౌకర్యం లభిస్తుంది.
వీటిని చూస్తే ఇప్పటికే బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్‌యూవీగా ఉన్న సెల్టోస్‌ను మరింత ప్రీమియంగా తీర్చిదిద్దడంలో కియా విజయం సాధించిందని చెప్పొచ్చు.
2026 కియా సెల్టోస్- డిజైన్‌లో పదును.. టెక్నాలజీలో దూకుడు!
కొత్త సెల్టోస్ చూడటానికి చాలా షార్ప్‌గా, మోడ్రన్‌గా కనిపిస్తుంది. ముందు భాగంలో సరికొత్త స్టైలింగ్, ఆకర్షణీయమైన లైటింగ్ ఎలిమెంట్స్, కొత్త అల్లాయ్ వీల్ డిజైన్లు దీనికి సరికొత్త గుర్తింపును ఇచ్చాయి. ఫ్లష్-స్టైల్ డోర్ హ్యాండిల్స్, కొత్త రంగుల్లో ఈ కారు లభ్యం కానుంది.
ఇక ఎస్‌యూవీ లోపలికి అడుగుపెడితే కొత్తగా మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. డాష్‌బోర్డ్‌పై ఒక పెద్ద పనోరమిక్ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలిసిపోయి అద్భుతంగా కనిపిస్తాయి. ఇంటీరియర్ మెటీరియల్ క్వాలిటీ కూడా పెరిగింది. పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ప్రీమియం ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు నగరంలో ప్రయాణాలకైనా, లాంగ్ జర్నీలకైనా గొప్ప సౌకర్యాన్ని అందిస్తాయి.
2026 కియా సెల్టోస్- భద్రతకు పెద్దపీట..
ఈసారి కియా భద్రత విషయంలో భారీ అడుగు వేసింది! గ్లోబల్ కే3 ప్లాట్‌ఫారమ్‌పై తయారైన ఈ కియా సెల్టోస్ బాడీ చాలా దృఢంగా ఉంటుంది. డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది. ఎంపిక చేసిన వేరియంట్లలో లెవల్-2 అడాస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్) ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవి హైవేలపై లేదా ట్రాఫిక్‌లో డ్రైవర్లకు అదనపు రక్షణ కవచంలా పనిచేస్తాయి.
2026 కియా సెల్టోస్- ఇంజిన్ ఆప్షన్లు..
కొత్త సెల్టోస్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.
టర్బో పెట్రోల్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి.
వీటితో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. పనితీరు కావాలనుకునే వారికి, మైలేజీ కోరుకునే వారికి.. ఇలా అందరికీ నచ్చేలా 2026 సెల్టోస్‌లో విభిన్న వేరియంట్లను కియా మోటార్స్ సిద్ధం చేసింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


