2026 Kia Syros : కొత్త వేరియంట్లు, సరికొత్త ఫీచర్లు- అప్డేటెడ్ కియా సైరోస్ హైలైట్స్ ఇవే..
2026 Kia Syros price : కియా ఇండియా తన పాపులర్ మోడల్ ‘సైరోస్’ను 2026 వెర్షన్‌లో సరికొత్త హంగులతో మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం డిజైన్ మాత్రమే కాకుండా, కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా కొత్త వేరియంట్లు, డీజిల్ ఆటోమేటిక్ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
భారతీయ రోడ్లపై కాంపాక్ట్ ఎస్‌యూవీల హవా కొనసాగుతున్న తరుణంలో, తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు కియా ఇండియా సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే 2026 కియా సైరోస్‌ను సరికొత్త వేరియంట్లు, మెరుగైన ఫీచర్లతో లాంచ్ చేసింది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లు కోరుకునే వారి కోసం హెచ్‌టీఈ, హెచ్‌టీఈ (ఓ), హెచ్టీకే+ (ఓ), హెచ్‌టీఎక్స్ (ఓ) వంటి కొత్త ట్రిమ్స్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధరను రూ. 8,39,900 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అప్డేటెడ్ కియా సైరోస్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి.

2026 కియా సైరోస్- వేరియంట్లు, వాటి ధరలు..
| Powertrain/Trim | HTE | HTE (O) | HTK (EX) | HTK+ | HTK+ (O) | HTX | HTX (O) |
|---|---|---|---|---|---|---|---|
| G1.0 MT | 8,39,900 | 9,19,900 | 9,79,900 | 10,73,900 | 11,99,900 | - | - |
| G1.0 7DCT | - | - | - | 11,93,900 | 13,19,900 | 13,99,900 | 14,99,900 |
| D1.5 6MT | - | 9,99,900 | 10,59,900 | 11,53,900 | 12,79,900 | - | - |
| D1.5 6AT | - | - | - | 12,73,900 | 13,99,900 | 14,79,900 | 15,79,900 |
2026 కియా సైరోస్- లుక్ మార్చేశారు: స్పోర్టీ అండ్ రగ్గడ్ డిజైన్!
2026 మోడల్ సైరోస్ ఎస్యూవీ బాహ్య రూపంలో కీలక మార్పులు చేశారు. ముందు భాగంలో 'స్పోర్టీ అండ్ రగ్గడ్' బంపర్‌ను అమర్చారు, ఇది కారుకు ఒక పవర్‌ఫుల్ లుక్ ఇస్తుంది. గ్లోసీ బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన స్కిడ్ ప్లేట్లు, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్ కారు అందాన్ని రెట్టింపు చేశాయి.
నియాన్ టచ్: ఈసారి హై-ఎండ్ వేరియంట్లయిన హెచ్‌టీఎక్స్, హెచ్టీఎక్స (ఓ) మోడళ్లలో 17 ఇంచ్ స్పోర్టీ క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్‌ను అందించారు. వీటికి అదనంగా 'నియాన్ కలర్' బ్రేక్ కాలిపర్లను అమర్చడం విశేషం. ఇది యువతను ఎక్కువగా ఆకట్టుకునే అంశం.
కొత్త రంగులు: కస్టమర్ల కోసం మాగ్మా రెడ్, ఐవరీ సిల్వర్ మ్యాట్, ఐవరీ సిల్వర్ గ్లోస్ వంటి సరికొత్త రంగులను పరిచయం చేశారు.
2026 కియా సైరోస్- ఇంటీరియర్ అదుర్స్: 30 ఇంచ్ డిస్‌ప్లే!
ఈ ఫ్యామిలీ ఎస్యూవీ లోపలి భాగంలో అడుగుపెడితే ఒక లగ్జరీ విమానంలో కూర్చున్న అనుభూతి కలుగుతుంది.
టెక్నాలజీ: ఇందులో 30 ఇంచ్ (76.2 సెం.మీ) ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే ప్యానల్‌ను అమర్చారు. ఇది నావిగేషన్, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం అద్భుతంగా పనిచేస్తుంది.
సౌకర్యాలు: డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, వెెంటిలేటెడ్ సీట్లు, వెనుక సీట్లను వెనక్కి జరుపుకునే సౌకర్యం ఈ సెగ్మెంట్‌లో అరుదుగా కనిపిస్తాయి.
కనెక్టివిటీ: 80కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు, రిమోట్ డయాగ్నోస్టిక్స్ వంటి ఫీచర్లు డ్రైవింగ్ అనుభవాన్ని సులభతరం చేస్తాయి.
2026 కియా సైరోస్- సేఫ్టీలో నెంబర్ వన్: 5-స్టార్ రేటింగ్!
నేటి కాలంలో కారు భద్రతకు కస్టమర్లు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కియా సైరోస్ 'బీఎన్సీఏపీ' క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. 20 రకాల స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఈ కారును ఫ్యామిలీకి సురక్షితమైన వాహనంగా మారుస్తున్నాయి.
2026 కియా సైరోస్- ఇంజిన్, పర్ఫార్మెన్స్
ఈ 2026 కియా సైరోస్ ఎస్‌యూవీలో రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది:
1.0 లీటర్ టర్బో పెట్రోల్: ఇది 118 బీహెచ్పీ పవర్, 172 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
1.5 లీటర్ డీజిల్: ఇది 113 హెచ్‌పీ పవర్, 250 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది.
ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డీసీటీ, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా డీజిల్ ఆటోమేటిక్ వెర్షన్ ఇప్పుడు హెచ్టీకే+ వేరియంట్ నుంచే అందుబాటులో ఉంది.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. 2026 కియా సైరోస్ ప్రారంభ ధర ఎంత?
దీని ప్రారంభ ధర రూ. 8,39,900 (ఎక్స్-షోరూమ్). వేరియంట్, సిటీని బట్టి ఆన్-రోడ్ ధర మారవచ్చు.
2. సైరోస్ సేఫ్టీ రేటింగ్ ఎంత?
ఈ కారు బీఎన్సీఏపీ టెస్టులో 5-స్టార్ రేటింగ్‌ను పొందింది, ఇది అత్యున్నత భద్రతను సూచిస్తుంది.
3. డీజిల్ ఆటోమేటిక్ ఏ వేరియంట్ నుంచి లభిస్తుంది?
2026 మోడల్‌లో డీజిల్ ఆటోమేటిక్ ఆప్షన్ హెచ్టీకే+ వేరియంట్ నుంచి అందుబాటులో ఉంది. దీని ధర రూ. 12.74 లక్షల నుంచి మొదలవుతుంది.
4. కొత్తగా వచ్చిన రంగులు ఏంటి?
మాగ్మా రెడ్, ఐవరీ సిల్వర్ మ్యాట్, ఐవరీ సిల్వర్ గ్లోస్ అనే మూడు కొత్త కలర్ ఆప్షన్లను కియా ప్రవేశపెట్టింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


