భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యధిక ఆదరణ పొందిన మారుతి సుజుకి బాలెనో మరింత కొత్త సొబగులతో ముందుకు వచ్చింది. 2026 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌కు సంబంధించి కంపెనీ మైలేజ్ గణాంకాలను అధికారికంగా వెల్లడించింది. పాత 4-సిలిండర్ కే12ఎన్ (K12N) ఇంజిన్ స్థానంలో, ఈసారి సరికొత్త 3-సిలిండర్ జెడ్12ఈ (Z12E) పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇటీవల విడుదలైన స్విఫ్ట్, డిజైర్ మోడళ్లలోనూ ఇదే ఇంజిన్‌ను ఉపయోగించారు.

సిలిండర్ల సంఖ్య తగ్గడం, కారు బరువు కొంత పెరిగినప్పటికీ.. మైలేజ్ విషయంలో మాత్రం కొత్త బాలెనో అందరినీ ఆకట్టుకుంటోంది. పెట్రోల్, సీఎన్జీ (CNG) రెండు వర్షన్లలోనూ మునుపటి కంటే మెరుగైన మైలేజ్ ఇస్తుండటం విశేషం.
మైలేజ్ లెక్కలు ఇవే
కొత్త బాలెనో పెట్రోల్ మ్యాన్యువల్ వర్షన్ లీటరుకు 23.80 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. పాత మోడల్ (22.35 కిమీ)తో పోలిస్తే ఇది లీటరుకు 1.45 కిలోమీటర్లు ఎక్కువ. ఇక ఏఎంటీ (AMT) ఆటోమేటిక్ వర్షన్ మైలేజ్ లీటరుకు 22.94 కిమీ నుంచి 24.77 కిమీకి పెరిగింది. అంటే ఆటోమేటిక్ వేరియంట్‌లో లీటరుకు 1.83 కిమీ మైలేజ్ అదనంగా లభించనుంది.
అత్యంత భారీ మార్పు సీఎన్జీ వేరియంట్‌లో కనిపిస్తోంది. పాత మోడల్ కిలో సీఎన్జీకి 30.61 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే, కొత్త 2026 మోడల్ ఏకంగా 33.61 కిమీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. అంటే కిలోకు ఏకంగా 3 కిలోమీటర్ల మైలేజ్ పెరిగింది.
ఇంజిన్ పవర్ తగ్గినా.. మైలేజ్ అదుర్స్
కొత్తగా తీసుకొచ్చిన 1.2 లీటర్, 3-సిలిండర్ జెడ్12ఈ ఇంజిన్ డ్యూయల్ వివిటి (Dual VVT), ఐడిల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీతో పనిచేస్తుంది. పెట్రోల్ మోడల్ 83 హెచ్‌పీ (hp) పవర్, 112 ఎన్ఎమ్ (Nm) టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్జీ వర్షన్‌లో ఇది 70 హెచ్‌పీ పవర్, 102 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది.
పాత 4-సిలిండర్ కే12ఎన్ ఇంజిన్‌తో పోలిస్తే కొత్త ఇంజిన్ పవర్ కాస్త తగ్గింది. పాత పెట్రోల్ ఇంజిన్ 90 హెచ్‌పీ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ ఇచ్చేది. అలాగే పాత సీఎన్జీ మోడల్ 77.5 హెచ్‌పీ పవర్, 98.5 ఎన్ఎమ్ టార్క్ అందించేది. రెండు ఇంజిన్లలోనూ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్లో 5-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్ కూడా ఉంది.
{{/usCountry}}పాత 4-సిలిండర్ కే12ఎన్ ఇంజిన్‌తో పోలిస్తే కొత్త ఇంజిన్ పవర్ కాస్త తగ్గింది. పాత పెట్రోల్ ఇంజిన్ 90 హెచ్‌పీ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ ఇచ్చేది. అలాగే పాత సీఎన్జీ మోడల్ 77.5 హెచ్‌పీ పవర్, 98.5 ఎన్ఎమ్ టార్క్ అందించేది. రెండు ఇంజిన్లలోనూ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్లో 5-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్ కూడా ఉంది.
{{/usCountry}}మరోవైపు, కొత్త బాలెనో బరువు కూడా పెరిగింది. పెట్రోల్ మాన్యువల్ కారు బరువు 955 కేజీల నుంచి 985 కేజీలకు చేరింది. పెట్రోల్ ఏఎంటీ వెర్షన్ బరువు 990 కేజీలు కాగా, సీఎన్జీ వేరియంట్ బరువు గరిష్టంగా 1,055 కేజీల వరకు ఉంటుంది.
లెవెల్-2 ఏడీఏఎస్ సేఫ్టీ టెక్నాలజీ
ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ప్రధాన ఆకర్షణ లెవెల్-2 ఏడీఏఎస్ (Level 2 ADAS) రక్షణ వ్యవస్థ. రాడార్, కెమెరా ఆధారంగా పనిచేసే ఈ సాంకేతికతలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్ అండ్ ప్రివెన్షన్, అడ్వాన్స్డ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అత్యంత సురక్షితమైన ఫీచర్లు ఉన్నాయి.
లుక్ విషయానికి వస్తే.. సరికొత్త ఫ్రంట్ డిజైన్, క్రోమ్ ఫెండర్ గార్నిష్, కొత్త గ్రిల్, కొత్త బంపర్‌తో పాటు ఆకట్టుకునే 'ఎనిగ్మాటిక్ టీల్' (Enigmatic Teal) రంగును అందుబాటులోకి తెచ్చారు.
అధునాతన ఫీచర్లు.. అంచనా ధర
క్యాబిన్ లోపల వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, లెథరెట్ అప్‌హోల్‌స్టరీ, క్లారియన్ (Clarion) ప్రీమియం సౌండ్ సిస్టమ్, కూలింగ్ సౌకర్యం ఉన్న వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్‌ను అమర్చారు. 9-ఇంచ్ స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ అందుబాటులో ఉన్నాయి.
కొత్త 2026 మారుతి బాలెనో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.10 లక్షలుగా ఉంటుందని అంచనా. వేరియంట్లను బట్టి ధరల వివరాలను కంపెనీ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.
| Version | New Baleno | Old Baleno | Improvement |
|---|
| Petrol MT | 23.80kmpl | 22.35kmpl | 1.45kmpl |
|---|
| Petrol AMT | 24.77kmpl | 22.94kmpl | 1.83kmpl |
|---|
| CNG MT | 33.61km/kg | 30.61km/kg | 3km/kg |
|---|
Other features include a ventilated front seat with leatherette upholstery, a Clarion premium sound system and a cooled wireless smartphone charger. Wireless Apple CarPlay and Android Auto are included in the existing 9-inch SmartPlay Pro+. The 2026 Maruti Baleno has an estimated ex-showroom price of ₹6.10 lakh, which will vary by variant and be announced by the automaker.