Royal Enfield bike : 2026 రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 ఎలా ఉందో చూశారా?
2026 Royal Enfield Continental GT 650 : బైక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకునే రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 కొత్త అప్‌డేట్‌తో మార్కెట్లోకి వచ్చింది. సరికొత్త ఫీచర్లు, ధరల వివరాలను ఇక్కడ చూడండి..
రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ప్రముఖ 'కాంటినెంటల్ జీటీ 650' బైక్‌కి అదిరిపోయే అప్‌డేట్లను తీసుకువచ్చింది. ఈ సరికొత్త బైక్ నాలుగు ఆకర్షణీయమైన రంగుల ఆప్షన్లలో అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 3,58,427 నుంచి మొదలవుతుంది. ఈ అప్‌డేటెడ్ మోడల్‌లో గమనించదగ్గ మార్పు ఏంటంటే.. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ చుట్టూ నల్లటి పెయింట్‌తో కూడిన కౌల్ ఇచ్చారు. దీనివల్ల డ్యాష్‌బోర్డ్ లుక్ మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది. అలాగే ఇందులో కొత్త ఎల్ఈడీ ఇండికేటర్లతో పాటు యూఎస్బీ టైప్-సీ ఫాస్ట్-చార్జింగ్ పోర్ట్‌ను కూడా చేర్చారు.

ఆగస్టు 14, 2026 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌లలో ఈ కొత్త బైక్ కొనుగోలుకు అందుబాటులో ఉంది.
నాలుగు రంగుల ఆప్షన్లు, ధరల వివరాలు..
ఈ 2026 కాంటినెంటల్ జీటీ 650 నాలుగు విభిన్న రంగుల్లో లభిస్తుంది. ప్రతి వేరియంట్ ధర, వాటి ప్రత్యేకతలను కంపెనీ ఈ విధంగా ప్రకటించింది:
రాకర్ రెడ్ : ఈ వేరియంట్ ధర రూ. 3,58,427. ఇందులో ఇంజిన్, ఎగ్జాస్ట్, అలాయ్ వీల్స్ పూర్తిగా నలుపు రంగులో (బ్లాక్ అవుట్) వస్తాయి.
బ్రిటిష్ రేసింగ్ గ్రీన్ : దీని ధర కూడా రూ. 3,58,427గా ఉంది. అయితే ఇది పాత మోడల్ మాదిరిగానే పాలిష్ చేసిన ఇంజిన్, సాంప్రదాయ స్పోక్ వీల్స్‌తో వస్తుంది.
అపెక్స్ గ్రే : ఈ మోడల్ ధర రూ. 3,80,921. ఇది కూడా బ్లాక్ అవుట్ చేసిన ఇంజిన్, అలాయ్ వీల్స్‌తో ఆకట్టుకుంటుంది.
మిస్టర్ క్లీన్ : లైనప్‌లో ఇదే అత్యంత ఖరీదైన వేరియంట్. దీని ధర రూ. 3,87,667. ఇందులో పాలిష్ చేసిన ఇంజిన్, స్పోక్ వీల్స్ అమర్చారు.
పైన చెప్పినవి అన్ని ఎక్స్‌షోరూం ధరలు.
పాత ఇంజిన్, అవే మెకానికల్ ఫీచర్లు..
ఈ తాజా అప్‌డేట్‌లో 2026 రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. మోటార్‌సైకిల్ హారిస్ పర్ఫార్మెన్స్‌తో కలిసి అభివృద్ధి చేసిన స్టీల్ ట్యూబులర్ డబుల్-క్రెడిల్ ఫ్రేమ్‌పైనే రూపుదిద్దుకుంది. ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపు గ్యాస్-చార్జ్డ్ ట్విన్ షాక్ అబ్జార్బర్‌లను యథావిధిగా కొనసాగించారు.
బైక్ పనితీరు గురించి మాట్లాడుతూ.. "ఇందులో ఉన్న 648 సీసీ ప్యారలల్-ట్విన్ ఇంజిన్ 7,150 ఆర్‌పీఎమ్ వద్ద 47 హెచ్‌పీ పవర్‌ని, 5,250 ఆర్‌పీఎమ్ వద్ద 52.3 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది," అని కంపెనీ నిపుణులు పేర్కొన్నారు.
ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేసి ఉంది.
భారతీయ మార్కెట్లో కేఫ్ రేసర్ ఫార్మాట్‌లో లభించే అతికొద్ది మోడళ్లలో ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 ఒకటి. 1950, 60ల నాటి కేఫ్ రేసర్ బైక్ల స్ఫూర్తితో దీనిని డిజైన్ చేశారు. ఆకర్షణీయమైన ఫ్యూయెల్ ట్యాంక్, వెనుక వైపు ఉండే రైడింగ్ పొజిషన్, లో-సెట్ ప్రొఫైల్ ఈ బైక్ ప్రత్యేకతలు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


