Electric bike : సింగిల్ ఛార్జ్‌తో 255 కి.మీ రేంజ్! అవోర్ ఈఎక్స్2 ఎలక్ట్రిక్ బైక్ ధర ఎంతంటే..
Avore EX2 : ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లోకి వచ్చిన అవోర్ ఈఎక్స్2 బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ఈ-బైక్ ధర, బ్యాటరీ సామర్థ్యం, రేంజ్ విశేషాలను ఇక్కడ చూడండి..
ప్రస్తుతం భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. పెట్రోల్ ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్స్ సేల్స్ ఈ మధ్య మరింత పెరిగాయి! మరి మీరు కూడా ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీ లిస్ట్‌లో అవోర్ బ్రాండ్‌కి చెందిన ఈఎక్స్2 మోడల్ ఉందా? అవోర్ నుంచి వస్తున్న ఈ మిడ్ స్పెక్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కొనుగోలు చేయాలని బావిస్తుంటే.. కొనుగోలు చేయాలని భావిస్తుంటే, ముందుగా తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన అంశాలను ఇక్కడ చూసేయండి..

అవోర్ ఈఎక్స్2 ఎలక్ట్రిక్ బైక్- బ్యాటరీ, మోటార్ పనితీరు ఎలా ఉంటాయి?
ఈఎక్స్2 బైక్‌లో 5kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీనికి జతగా 7.5kW పీఎంఎస్‌ఎం మోటార్‌ను ఇచ్చారు. ఒకసారి ఛార్జ్ చేస్తే ఐడీసీ ప్రకారం ఇది 255 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీని గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు. ఇందులో రివర్స్, ఎకో, సిటీ, స్పోర్ట్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి.
అవోర్ ఈఎక్స్2 ఎలక్ట్రిక్ బైక్- ధర ఎంత ఉంటుంది?
అవోర్ లైనప్‌లో వస్తున్న ఈ మిడ్-స్పెక్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ప్రారంభ పరిచయ ధర రూ. 1.46 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు. దీని కంటే కాస్త ఎక్కువ ధర ఉండే ‘ఈఎక్స్2ఎస్’ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.70 లక్షలుగా ఉంది.
అవోర్ ఈఎక్స్2 ఎలక్ట్రిక్ బైక్- ఫీచర్ల లిస్ట్ ఏంటి?
అవోర్ ఈఎక్స్2 ఎలక్ట్రిక్ బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, నేవిగేషన్ సపోర్ట్ ఉన్న కలర్ ఎల్సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వీటితో పాటు క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్, రిజెనరేటివ్ బ్రేకింగ్, కీలెస్ ఆపరేషన్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. అలాగే వెహికల్ ట్రాకింగ్, గియోఫెన్సింగ్, యాంటీ-థెఫ్ట్ అలర్ట్స్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఇందులో లభిస్తాయి.
అవోర్ ఈఎక్స్2 ఎలక్ట్రిక్ బైక్- కలర్ ఆప్షన్స్..
అవోర్ ఈఎక్స్2 బైక్ ప్రధానంగా మూడు ఆకర్షణీయమైన డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి.. స్టెల్లర్ బ్లాక్ డీటీ, స్టార్‌లిట్ రెడ్ డీటీ, మెటోర్ బ్లూ డీటీ.
అవోర్ ఈఎక్స్2 ఎలక్ట్రిక్ బైక్- డైమెన్షన్స్, బ్రేకింగ్ సిస్టమ్..
ఈ ఎలక్ట్రిక్ బైక్ సీటు ఎత్తు 790 ఎంఎం ఉండగా, కర్బ్ బరువు 154 కేజీలు ఉంది. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు. భద్రత కోసం రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లతో పాటు కాంబి బ్రేకింగ్ సిస్టమ్‌ని అందించారు.
మరి మీరు ఈ అవోర్ ఈఎక్స్2 ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


