VinFast VF5 : టాటా పంచ్‌కి పోటీగా విన్‌ఫాస్ట్ వీఎఫ్5- ఇండియా లాంచ్‌కు రెడీ! రేంజ్ ఎంతంటే..
విన్‌ఫాస్ట్ కంపెనీ భారత మార్కెట్లోకి వీఎఫ్5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకురానుంది. టాటా పంచ్ ఈవీకి గట్టి పోటీ ఇవ్వనున్న ఈ కారు రేంజ్, ఫీచర్ల సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 'విన్‌ఫాస్ట్'.. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా, భారత ఆటోమొబైల్ మార్కెట్లో మరో రెండు కొత్త ఈవీలను లాంచ్ చేయాలని సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా వీఎఫ్3, వీఎఫ్5 చిన్న ఎస్‌యూవీలను కంపెనీ పరిశీలిస్తోంది. ఈ రెండింటిలో అందరి ఫోకస్ వీఎఫ్5పైనే ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. నేరుగా టాటా పంచ్ ఈవీతో తలపడనుంది.

ఈ నేపథ్యంలో ఈ విన్‌ఫాస్ట్ వీఎఫ్5 ఈవీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
విన్‌ఫాస్ట్ వీఎఫ్5- బ్యాటరీ, రేంజ్..
అంతర్జాతీయ మార్కెట్లలో లభించే విన్‌ఫాస్ట్ వీఎఫ్5 ఈవీ రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది. ఇందులో మొదటిది 29.6 kWh బ్యాటరీ ప్యాక్. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్.. 95 బీహెచ్‌పీ పవర్‌ను, 135 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్‌ఈడీసీ నిబంధనల ప్రకారం ఇది 268 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది.
ఇక ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో రెండోది.. మరింత శక్తివంతమైన 37.23 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్. దీనిలోని ఫ్రంట్ ఎలక్ట్రిక్ మోటార్ 136 బీహెచ్‌పీ పవర్‌ను, 135 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. పూర్తి ఛార్జ్‌పై ఈ వేరియంట్ 326 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా.
విన్‌ఫాస్ట్ వీఎఫ్5 ఫీచర్లు ఇవే..
8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్
7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
లెదరెట్ సీట్ కవర్లు
4-స్పీకర్ సౌండ్ సిస్టమ్
పీఎం2.5 ఎయిర్ ఫిల్టర్
కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫీచర్
ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్
ప్రయాణికుల భద్రత కోసం మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్
ఈఎస్‌పీ, ట్రాక్షన్ కంట్రోల్
విన్‌ఫాస్ట్ వీఎఫ్5- డైమెన్షన్స్, డిజైన్..
విన్‌ఫాస్ట్ వీఎఫ్5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పొడవు 3,967 ఎంఎం, వెడల్పు 1,723 ఎంఎం, ఎత్తు 1,579 ఎంఎంగా ఉంది. దీని వీల్‌బేస్ 2,514 ఎంఎంగా నిలిచింది. ప్రముఖ టాటా పంచ్ ఈవీతో పోలిస్తే వీఎఫ్5 పొడవులో 87 ఎంఎం ఎక్కువగా ఉంది. వెడల్పులో 19 ఎంఎం తక్కువగా, ఎత్తులో 43 ఎంఎం పొట్టిగా ఉంటుంది. అయితే వీల్‌బేస్ మాత్రం పంచ్ ఈవీ కంటే 69 ఎంఎం ఎక్కువగా ఉండటం విశేషం.
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గ్రౌండ్ క్లియరెన్స్ 169 ఎంఎంగా ఉంది. అయితే భారతీయ రోడ్ల పరిస్థితులకు తగినట్లుగా దీన్ని మరింత పెంచే అవకాశం ఉంది. లగేజ్ కోసం ఇందులో 260 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. వెనుక సీట్లను 60:40 నిష్పత్తిలో మడతపెట్టడం ద్వారా దీన్ని ఏకంగా 900 లీటర్ల వరకు పెంచుకోవచ్చు. ఈ కారు 16 అంగుళాలు, 17 అంగుళాల వీల్స్‌తో రోడ్డెక్కనుంది.
విన్‌ఫాస్ట్‌కు చెందిన వీఎఫ్6, వీఎఫ్7 ఇప్పటికే భారత రోడ్లపై తిరుగుతున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


