Kia Sorento hybrid : భారత్‌లోకి కియా 'సోరెంటో' హైబ్రిడ్ ఎస్‌యూవీ- బుకింగ్స్ షురూ..
కియా ఇండియా తన సరికొత్త సోరెంటో హైబ్రిడ్ ఎస్‌యూవీ బుకింగ్స్‌ను రూ.25,000 టోకెన్ అమోంట్తో అధికారికంగా ప్రారంభించింది. టీజర్ విడుదల చేయడంతో పాటు భారత మార్కెట్లోకి ఈ కారును త్వరలోనే లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
భారతీయ ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలోకి ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా తన సరికొత్త వాహనాన్ని తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో తన మోస్ట్ అవైటెడ్ మోడల్ ‘కియా సోరెంటో’ ఎస్‌యూవీకి సంబంధించిన అధికారిక టీజర్‌ను తాజాగా విడుదల చేసింది. అంతేకాదు, ప్రీ-బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది. రూ.25,000 టోకెన్ అమోంట్తో ఆన్‌లైన్ ద్వారా లేదా కియా డీలర్‌షిప్‌లలో ఈ కారును రిజర్వ్ చేసుకోవచ్చు.

భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో కియా నుంచి రాబోతున్న మొట్టమొదటి 'స్ట్రాంగ్ హైబ్రిడ్' ఎస్‌యూవీ ఇదే కావడం విశేషం. ఈ మోడల్ రాకతో బ్రాండ్ ప్రీమియం ఎస్‌యూవీల పోర్ట్‌ఫోలియో మరింత బలోపేతం కానుంది.
కియా సోరెంటో హైబ్రిడ్- అగ్రెసివ్ లుక్.. ఆకట్టుకునే డిజైన్!
కంపెనీ విడుదల చేసిన టీజర్ ఆధారంగా కియా సోరెంటో డిజైన్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ కారు బోల్డ్ లుక్‌తో పాటు చాలా ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో రెండు అంచెల ఎల్‌ఈడీ లైటింగ్ సెటప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 'T' ఆకారపు ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, నిలువుగా అమర్చిన ఎల్‌ఈడీ హెడ్‌లాంప్‌లు, ఫాగ్ లాంప్‌లను ఈ ఎస్‌యూవీకి ఇచ్చారు. నల్లటి మెష్ గ్రిల్ కారుకు మరింత అగ్రెసివ్, మస్క్యులర్ లుక్‌ను అందిస్తోంది.
ఎత్తైన ప్రొఫైల్, పొడవైన రూఫ్ రైల్స్, భారీ అలాయ్ వీల్స్ ఈ ఎస్‌యూవీకి రోడ్డుపై విశిష్టమైన ప్రాధాన్యతను తెచ్చిపెడతాయి.
కియా సోరెంటో హైబ్రిడ్- డైమెన్షన్స్..
గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న సోరెంటో మోడల్ కొలతలనే భారత్‌లోనూ కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీ పొడవు 4,815 ఎంఎం, వెడల్పు 1,900 ఎంఎం, ఎత్తు 1,700 ఎంఎంగా ఉన్నాయి.
కియా సోరెంటో హైబ్రిడ్- ఇంటీరియర్, ప్రీమియం ఫీచర్లు..
ఇంటీరియర్ చిత్రాలను కంపెనీ ఇంకా అధికారికంగా బహిర్గతం చేయలేదు. అయితే అంతర్జాతీయ మోడల్‌ను పరిశీలిస్తే, భారత వర్షన్‌లోనూ అత్యాధునిక సౌకర్యాలు లభించే అవకాశం ఉంది.
- ఇన్ఫోటైన్‌మెంట్, డ్రైవర్ డిస్ప్లే కోసం డ్యూయల్ 12.3-ఇంచ్ డిజిటల్ స్క్రీన్లు
- విశాలమైన పానోరమిక్ సన్‌రూఫ్
- వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్
- హెడ్-అప్ డిస్ప్లే, గేర్ సెలెక్షన్ కోసం రోటరీ డయల్
కియా సోరెంటో హైబ్రిడ్- రక్షణకు పెద్దపీట!
భద్రత విషయంలో కియా రాజీ పడకుండా అధునాతన సేఫ్టీ ఫీచర్లను ఈ సోరెంటో హైబ్రిడ్ ఎస్‌యూవీలో అందించబోతోంది.
- 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా
- లెవెల్-2 అడాస్ సేఫ్టీ సూట్
- ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్
అంతర్జాతీయ మార్కెట్లో 5, 6, 7 సీటర్ల ఆప్షన్లలో లభిస్తున్నప్పటికీ.. భారత్‌లో మాత్రం ఈ కియా సొరెంటో 6, 7 సీటర్ల వేరియంట్లలో దీనిని పరిచయం చేసే అవకాశం ఉంది.
కియా సోరెంటో హైబ్రిడ్- ఇంజిన్, పర్ఫార్మెన్స్..
కియా సోరెంటో అత్యంత సమర్థవంతమైన స్ట్రాంగ్-హైబ్రిడ్ సాంకేతికతతో రానుంది. సాంకేతిక వివరాలను కంపెనీ ఇంకా పూర్తిగా వెల్లడించకపోయినప్పటికీ.. అంతర్జాతీయ మోడల్‌లో ఉన్న 1.6-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 1.94 కేడబ్ల్యూహెచ్ లిథియమ్-అయాన్ బ్యాటరీ ప్యాక్ కాంబినేషన్‌నే ఇక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 238 బీహెచ్పీ పవర్, 380 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.
కియా సోరెంటో హైబ్రిడ్- ఎంత ధర ఉండవచ్చు?
కియా సోరెంటో ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 40 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కోడియాక్, జేప్ మెరిడియన్ వంటి పాపులర్ ప్రీమియం ఎస్‌యూవీలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


