సరికొత్తగా టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- అదిరిపోయే డిజైన్, ఫీచర్లు.. లాంచ్​ ఎప్పుడు?

భారత మార్కెట్​లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫ్యామిలీ ఎస్‌యూవీ 'టాటా పంచ్' త్వరలో కొత్త అవతారంలో రాబోతోంది. 10.25 ఇంచ్​ స్క్రీన్, 360-డిగ్రీల కెమెరా వంటి అత్యాధునిక ఫీచర్లతో టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​కి రెడీ అవుతోంది. ఈ కారు విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 30, 2025, 14:01:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఆటోమొబైల్​ మార్కెట్​పై పట్టు సాధించేందుకు టాటా మోటార్స్​ అగ్రెసివ్​గా ప్లాన్స్​ వేస్తోంది. ఇందులో భాగంగానే సంస్థ ఇటీవలే విడుదల చేసిన ‘టాటా సియెర్రా’.. కేవలం 24 గంటల్లోనే 70వేలకు పైగా ఆర్డర్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు తన బెస్ట్​ సెల్లింగ్, ఫ్యామిలీ​ ఎస్​యూవీ ‘టాటా పంచ్’కు మిడ్-లైఫ్ ఫేస్​లిఫ్ట్​ ఇచ్చేందుకు సంస్థ సిద్ధమైంది. తాజాగా ఈ మోడల్ ఒకటి భారత రోడ్లపై టెస్ట్​ డ్రైవ్​ చేస్తూ కనిపించింది. ఈ నేపథ్యంలో 2026 టాటా పంచ్​కి సంబంధించి కొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​.. ((Image Credits: TeamBHP))
టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​.. ((Image Credits: TeamBHP))

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​- లాంచ్ ఎప్పుడు?

2026 టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​ డేట్​ని టాటా మోటార్స్ ఇంకా అధికారికంగా ప్రకటించ లేదు. అయితే, ఈ ఎస్​యూవీ ఈ ఆర్థిక సంవత్సరం చివరిలో, అంటే 2026 మార్చి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​- డిజైన్​ మార్పులు ఏంటి?

డిజైన్‌లో మార్పులు: లేటెస్ట్ స్పై ఇమేజెస్ ప్రకారం.. కొత్త పంచ్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ చూడటానికి 'పంచ్ ఈవీ'ని పోలి ఉంటుంది. అయితే, దీని ముందు భాగం పూర్తిగా మారనుంది. సన్నని హెడ్‌ల్యాంప్ సెటప్, కొత్త ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, రీడిజైన్ చేసిన బంపర్ దీనికి కొత్త లుక్‌ని ఇస్తాయి.

కొత్త అల్లాయ్ వీల్స్, వెనుక వైపు మారిన బంపర్, టెయిల్ లైట్స్ ఈ కారుకు మరింత ఆకర్షణను జోడిస్తాయి.

అయితే, ఎలక్ట్రిక్ మోడల్​లో ఉన్నట్టుగా ఇందులో పూర్తి వెడల్పుగా ఉండే ఎల్‌ఈడీ బ్యాండ్‌ను టాటా మోటార్స్ ఇవ్వకపోవచ్చు.

హై-ఎండ్ వేరియంట్లలో కార్నరింగ్ ఫంక్షన్‌తో కూడిన ఫాగ్ ల్యాంప్స్, 360-డిగ్రీల కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు ఉండనున్నాయి.

  • మధ్యతరగతి కుటుంబాల కోసం 7 సీటర్​ ఎంపీవీ- నిస్సాన్​ గ్రావిటే గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​- ఇంటీరియర్ ఎలా ఉండబోతోంది?

2026 టాటా పంచ్ ఎస్​యూవీ​ లోపలి భాగంలో కూడా టాటా మోటార్స్ భారీ మార్పులే చేస్తోంది.

కొత్తగా 'ట్విన్-స్పోక్' స్టీరింగ్ వీల్ రాబోతోంది. దీనిపై వెలిగే టాటా లోగో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పాత 7-ఇంచ్​ స్క్రీన్ స్థానంలో ఇప్పుడు పెద్దదైన 10.25-ఇంచ్​ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రానుంది.

డ్యాష్‌బోర్డ్ రంగులు, మెటీరియల్‌లో కూడా మార్పులు కనిపిస్తున్నాయి.

టాప్ మోడల్స్‌లో 10.25-ఇంచ్​ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ సహా అదనపు భద్రత కోసం అడాస్​ టెక్నాలజీని కూడా అందించే అవకాశం ఉంది.

టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​- ఇంజిన్, పనితీరు..

మెకానికల్ పరంగా టాటా పంచ్​ ఫేస్​లిఫ్ట్​లో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు! ప్రస్తుతం ఉన్న 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌నే ఇందులోనూ కొనసాగించనున్నారు. ఇది 86 హెచ్​పీ పవర్, 113 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. సీఎన్జీ మోడ్‌లో ఇది 73.4 హెచ్​పీ పవర్‌ని జనరేట్​ చేస్తుంది. సీఎన్జీ వెర్షన్‌లో కూడా ఏఎంటీ ఆప్షన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

2026 టాటా పంచ్​కి సంబంధించిన మరిన్ని వివరాలు లాంచ్​ టైమ్​కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More