2026 Tata Tigor : కొత్త డిజైన్, ఫీచర్లతో టాటా టిగోర్ ఫేస్​లిఫ్ట్- లాంచ్ ఎప్పుడు?

Tata Tigor facelift : టాటా మోటార్స్ తన కాంపాక్ట్ సెడాన్ టిగోర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను త్వరలోనే భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. కొత్త డిజైన్, ప్రీమియం కేబిన్, 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటి అప్‌డేట్లతో రానున్న ఈ కారు వివరాలు మీకోసం..

Published on: Aug 7, 2026, 17:01:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఆటోమొబైల్ రంగాన్ని తన సరికొత్త డిజైన్లతో ఏలుతున్న ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘టాటా మోటార్స్’.. కాంపాక్ట్ సెడాన్ విభాగంలో మరో పెద్ద అడుగు వేయబోతోంది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన టాటా టియాగో, టియాగో ఈవీ మోడళ్ల ఘనవిజయం తర్వాత, ఇప్పుడు ‘టిగోర్ ఫేస్‌లిఫ్ట్ 2026’ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. రాబోయే కొద్ది వారాల్లో లేదా పండుగ సీజన్ ప్రారంభానికి ముందే ఈ కొత్త సెడాన్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

టాటా టిగోర్..
టాటా టిగోర్..

కొత్త టాటా టిగోర్ విభిన్నమైన విజువల్ మార్పులు, అత్యంత ఆధునికమైన కేబిన్, భద్రతా ఫీచర్లతో రాబోతోంది. అదే సమయంలో ఇంజిన్ పరంగా మునుపటి పెట్రోల్, ఐ-సీఎన్జీ, ఎలక్ట్రిక్ (ఈవీ) ఆప్షన్లను అలాగే కొనసాగించనుంది.

2026 టాటా టిగోర్- మరింత ఆకర్షణీయంగా ఎక్స్‌టీరియర్ డిజైన్..

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్ కంటే ఈ కొత్త టాటా టిగోర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ చాలా మోడరన్‌గా, దూకుడుగా కనిపించేలా టాటా డిజైన్ బృందం దీనిని తీర్చిదిద్దింది.

ఫ్రంట్ లుక్: ముందరి భాగంలో సన్నటి షార్ప్ ఎల్‌ఈడీ హెడ్‌లాంప్‌లు, వాటితో కలిసిపోయే ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ఉంటాయి. వీటికి గ్లోసీ బ్లాక్ గ్రిల్ ఫినిషింగ్ జోడించడం వల్ల కారుకి స్పోర్టీ లుక్ వస్తుంది. ముందు బంపర్‌ను మరింత పదునైన లైన్లు, విశాలమైన ఎయిర్ డ్యామ్‌తో రీడిజైన్ చేయడం ద్వారా రోడ్డుపై డిజైన్ ప్రెజెన్స్ గణనీయంగా పెరగనుంది.

సైడ్, రియర్ లుక్: పక్కల నుంచి చూస్తే కొత్త డిజైన్‌తో కూడిన అట్రాక్టివ్ అలాయ్ వీల్స్ ఆకట్టుకుంటాయి. ఇక వెనుక భాగంలో సరికొత్త ఎల్‌ఈడీ టైల్ లాంప్స్, రీడిజైన్ చేసిన బంపర్, కనెక్టింగ్ బ్లాక్ ట్రిమ్ ఎలిమెంట్ లభిస్తాయి.

360-డిగ్రీ కెమెరా: ఈసారి కొత్తగా 360-డిగ్రీ కెమెరా సిస్టమ్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది. దీని కోసం కారు ముందు భాగాన, బయటి సైడ్ మిర్రర్ల కింద కెమెరాలను అమర్చారు.

2026 టాటా టిగోర్- ప్రీమియం అనుభూతినిచ్చే కేబిన్..

టాటా టిగోర్ ఫేస్​లిఫ్ట్ లోపలి భాగం (ఇంటీరియర్)లో టాటా మోటార్స్ భారీ మార్పులనే చేసింది.

పాత మోడల్‌లో ఉండే చిన్న డిస్‌ప్లే స్థానంలో ఇప్పుడు పెద్దదైన 10.25-ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుపరిచారు.

డ్రైవర్ సమాచారం కోసం సరికొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందుబాటులోకి రానుంది.వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్, టైప్-సీ ఛార్జింగ్ పోర్టులు, ఆటో-ఫోల్డింగ్ వింగ్ మిర్రర్స్, సరికొత్త డిజైన్‌తో కూడిన స్టీరింగ్ వీల్ కేబిన్ వాతావరణాన్ని మరింత లగ్జరీగా మార్చేస్తాయి.

2026 టాటా టిగోర్- భద్రతకు పెద్దపీట..

సేఫ్టీ విషయంలో ఎప్పుడూ ముందుండే టాటా మోటార్స్, ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో భద్రతా ప్రమాణాలను మరో స్థాయికి తీసుకెళుతోంది. అన్ని వేరియంట్లలోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా అందించనున్నారని సమాచారం. దీనికి తోడు 360-డిగ్రీ కెమెరా సపోర్ట్ కూడా తోడైతే ఈ సెగ్మెంట్లోనే అత్యంత సురక్షితమైన సెడాన్‌గా టైగోర్ నిలిచే అవకాశం ఉంది.

2026 టాటా టిగోర్- ఇంజిన్, గేర్‌బాక్స్ ఆప్షన్లు..

మెకానికల్‌గా ఈ టాటా టిగోర్ ఫేస్​లిఫ్ట్ ఎలాంటి మార్పులు చేయడం లేదు.

పెట్రోల్ వెర్షన్: 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 86 పీఎస్ పవర్, 113 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సీఎన్జీ వెర్షన్: ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ ఐ-సీఎన్జీ మోడల్ 75.5 పీఎస్ పవర్, 96.5 ఎన్​ఎం టార్క్‌ను ఇస్తుంది.

ఈ రెండింటిలోనూ 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. అయితే, ఈసారి ఏఎమ్‌టీ వేరియంట్లలో స్పోర్టీ డ్రైవింగ్ కోసం 'ప్యాడిల్ షిఫ్టర్లు' కూడా ఇచ్చే ఆలోచనలో కంపెనీ ఉన్నట్లు టాక్.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More