Mahindra Scorpio N facelift లాంచ్- సన్​రూఫ్, 540 డిగ్రీ కెమెరా సహా ఇతర క్రేజీ ఫీచర్లతో!

Mahindra Scorpio N facelift 2026 : మహీంద్రా స్కార్పియో ఎన్ ఎస్‌యూవీ సంచలన ఫీచర్ అప్‌డేట్ పొందింది. పనోరమిక్ సన్‌రూఫ్, 540-డిగ్రీ కెమెరా, డిజిటల్ క్లస్టర్‌తో లగ్జరీ లుక్‌లో ముస్తాబైంది. రూ.13.69 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన ఈ కొత్త మోడల్ పూర్తి వివరాలు మీకోసం..

Published on: Aug 5, 2026, 13:14:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'స్కార్పియో ఎన్' ఫేస్​లిఫ్ట్​ని తాజాగా లాంచ్​ చేసింది. మరింత అధునాతన సాంకేతికత, సరికొత్త ఫీచర్లతో ఈ బడా ఎస్​యూవీని అప్​డేట్ చేసింది. వినియోగదారుల ప్రీమియం అనుభవాన్ని, భద్రతను, ప్రయాణ సౌకర్యాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేలా ఈ కొత్త ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్​లిఫ్ట్..
మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్​లిఫ్ట్..

ఈ నేపథ్యంలో ఈ 2026 మహీంద్రా స్కార్పియో ఎన్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

2026 మహీంద్రా స్కార్పియో ఎన్​- కొత్త ఫీచర్లు..

మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్​లిఫ్ట్​లో ఈ అప్‌డేట్‌లో అత్యంత ముఖ్యమైనది ‘పనోరమిక్ స్కైరూఫ్’! ఇప్పటివరకు ఉన్న సింగిల్-పేన్ సన్‌రూఫ్‌ స్థానంలో, టాప్ వేరియంట్లలో ఈ పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందించారు. దీనికితోడు కార్ పార్కింగ్, ఇరుకైన ప్రదేశాల్లో డ్రైవింగ్‌ను అత్యంత సులువుగా మార్చేందుకు 'బ్లైండ్ వ్యూ మానిటర్'తో కూడిన 540-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా సిస్టమ్‌ను సైతం జత చేశారు.

ఎస్​యూవీ ఎక్స్​టీరియర్ విషయానికి వస్తే, కొత్తగా డిజైన్ చేసిన 18-ఇంచ్ డైమండ్-కట్ అలాయ్ వీల్స్ ఎస్‌యూవీకి మరింత కంపాక్ట్, రఫ్‌ లుక్‌ను ఇస్తాయి. ఇక కేబిన్ లోపల 31.24 సెం.మీ (12.29 ఇంచులు) ఫ్లోటింగ్ హెచ్‌డీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. ఇందుకోసం డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ను కూడా కాస్త సవరించారు. దీనికి అదనంగా 26.03 సెం.మీ (10.25 ఇంచులు) డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను చేర్చారు. ఇందులో ఫుల్-స్క్రీన్ నావిగేషన్‌తో పాటు నార్మల్, ఇన్ఫర్మేషన్, మినిమల్ అనే మూడు డిస్​ప్లే లేఔట్లు లభిస్తాయి.

ముందు వరుస ప్రయాణికుల ఫోన్ల ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 65డబ్ల్యూ యూఎస్​బీ టైప్-సీ పోర్ట్‌ను మహీంద్రా అందించింది. ఆఫ్-రోడింగ్, సాహస యాత్రలు చేసే వారి కోసం ఇంజిన్ పనితీరు, రోల్ అండ్ పిచ్ యాంగిల్స్, కంపాస్, ఆల్టీమీటర్, జి-ఫోర్స్ సమాచారాన్ని ప్రత్యక్షంగా తెలిపే 'అడ్వెంచర్ స్టాటిస్టిక్స్' ఫీచర్‌ను కూడా పొందుపరిచారు.

2026 మహీంద్రా స్కార్పియో ఎన్ ఇంజిన్, పర్ఫార్మెన్స్‌లో మార్పు లేదు!

సాంకేతిక, కేబిన్ అప్‌డేట్లు ఉన్నప్పటికీ.. మెకానికల్‌గా మహీంద్రా స్కార్పియో ఎన్​ ఫేస్​లిఫ్ట్​లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది ఇదివరకు ఉన్న ప్రసిద్ధ G20 TGDi mStallion టర్బో-పెట్రోల్, D22 mHawk డీజిల్ ఇంజిన్ల ఆప్షన్లతోనే కొనసాగుతుంది. కస్టమర్లు తమ అవసరాలకు తగినట్లుగా రేర్-వీల్ డ్రైవ్, ఫోర్-వీల్ డ్రైవ్ వేరియంట్లను ఎంచుకోవచ్చు. వీటితో పాటు లెవెల్-2 అడాస్, 12-స్పీకర్ల సోనీ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6-వే పవర్డ్ డ్రైవర్ సీట్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్​వీఎం, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి టాప్-ఎండ్ ఫీచర్లు ఇందులో యథావిధిగా లభిస్తాయి.

2026 మహీంద్రా స్కార్పియో ఎన్- ధరలు..

కొత్త అప్‌డేటెడ్ మహీంద్రా స్కార్పియో ఎన్ ఎస్​యూవీ ప్రారంభ ధర బేస్ మోడల్ Z2 పెట్రోల్ మాన్యువల్ వేరియంట్‌కు రూ.13.69 లక్షలుగా నిర్ణయించారు. ఇక అన్ని ఫీచర్లు కలిగిన టాప్ వేరియంట్ జెడ్​8ఎల్ (అడాస్) డీజిల్ 4డబ్ల్యూడీ ఆటోమేటిక్ ధర రూ.25.49 లక్షల వరకు ఉంది (ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు).

2022లో మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మహీంద్రా స్కార్పియో ఎన్ ఏకంగా 3.8 లక్షలకు పైగా యూనిట్ల విక్రయాలను సాధించి ఆటోమొబైల్ రంగంలో రికార్డు సృష్టించింది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా 2024లో జెడ్8 సెలెక్ట్ వేరియంట్, 2025లో జెడ్8టీ వేరియంట్లను పరిచయం చేయడంతో పాటు లేయర్డ్ అడాస్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లను జోడిస్తూ మహీంద్రా దీని ప్రాచుర్యాన్ని కాపాడుకుంటూ వస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More