Mahindra SUVs : మహీంద్రా నుంచి ఎస్‌యూవీల ధమాకా! లాంచ్‌కి రెడీ అవుతున్న 4 కార్లు ఇవే..
భారత మార్కెట్లో తన దూకుడును కొనసాగించేందుకు మహీంద్రా సిద్ధమైంది. అప్‌డేటెడ్ థార్‌తో పాటు సరికొత్త ఎలక్ట్రిక్, ఐసీఈ ఎస్‌యూవీలను లాంచ్ చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. వాటిపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో తిరుగులేని ఆధీనంలో ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా.. రాబోయే నెలల్లో వరుస ఎస్‌యూవీ లాంచ్‌లతో దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రోడ్లపై టెస్టింగ్ జరుగుతున్న వాహనాలు, కాన్సెప్ట్ మోడల్స్ చూస్తుంటే కంపెనీ వ్యూహం ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది. అప్‌డేటెడ్ ఫీచర్లతో త్రీ-డోర్ థార్ మొదలుకొని అత్యాధునిక ఎలక్ట్రిక్ కార్ల వరకు మహీంద్రా ప్రణాళికలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాము..

త్రీ-డోర్ థార్‌కి మేజర్ అప్‌డేట్..
ప్రస్తుతం ఉన్న త్రీ-డోర్ మహీంద్రా థార్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు దీనికి తొలిసారిగా భారీ అప్‌డేట్ రాబోతోంది. 'థార్ రాక్స్' స్ఫూర్తితో దీని డిజైన్‌లో మార్పులు చేస్తోంది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. ముందు భాగంలో కొత్త లైటింగ్, రీ-డిజైన్ చేసిన బంపర్ ఉండనున్నాయి. ఇక క్యాబిన్ లోపల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు 5 డోర్ల ఎస్‌యూవీలో ఉన్న మరికొన్ని అధునాతన ఫీచర్లు ఇందులో చోటుచేసుకోనున్నాయి.
ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ, స్కార్పియో ఎన్ మధ్యలో విజన్ ఎస్..
మహీంద్రా మరో కాంపిటేటివ్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. 'విజన్ ఎస్' ఆధారంగా తయారవుతున్న ఈ కొత్త ఎస్‌యూవీ 2027 ప్రారంభంలో మార్కెట్లోకి రానుంది. కంపెనీ లైనప్‌లో ఇది ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ, స్కార్పియో ఎన్ మధ్యలో నిలవనుంది. న్యూ-ఐక్యూ (NU_IQ) ఆర్కిటెక్చర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ కారులో, ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓలో ఉన్న టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ల ఆప్షన్లే లభించే అవకాశం ఉంది.
విజన్ ఎస్కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ శ్రేణిలో 'బీఈ 07'..
మహీంద్రా తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగం దూకుడును పెంచేస్తోంది. ఇందులో భాగంగా వస్తున్న 'బీఈ 07' సరికొత్త అనుభూతిని పంచనుంది. బీఈ 6 కంటే పైన నిలిచే ఈ ఎస్‌యూవీ.. ఇంగ్లో (INGLO) స్కేట్‌బోర్డ్ ఆర్కిటెక్చర్‌పై తయారవుతోంది. ఇందులో మరింత పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. క్యాబిన్‌లో మూడు 12.3-అంగుళాల స్క్రీన్లు, లెవల్ 2 అడాస్, బై-డైరెక్షనల్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు డ్రైవింగ్ అనుభవాన్ని పూర్తిగా మార్చేస్తాయి.
విజన్ టీ స్ఫూర్తితో మరో ఎలక్ట్రిక్ సంచలనం!
2027 నాటికి ప్రీమియం ఎలక్ట్రిక్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ పెద్ద ఎస్‌యూవీని లాంచ్ చేయాలని మహీంద్రా ప్లాన్ చేస్తోంది. ఆ తర్వాత 'విజన్ టీ' కన్సెప్ట్ ఆధారంగా మరో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రానుంది. బాక్సీ డిజైన్‌తో ఆఫ్-రోడింగ్ ప్రియులను ఆకట్టుకునేలా దీనిని తీర్చిదిద్దుతున్నారు. థార్ రాక్స్ డిజైన్ ఎలిమెంట్స్ దీనికి అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి.
ఈ మోడల్స్ అన్నీ కూడా వేర్వేరు కస్టమర్లను టార్గెట్ చేస్తూ మార్కెట్లోకి వస్తుండటంతో, ఆటోమొబైల్ ప్రియులకు రాబోయే రోజుల్లో నిజంగానే మంచి ట్రీట్ దక్కనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


