MG Hector Tomahawk EV : సూపర్ స్టైలిష్​గా ఎంజీ కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కారు- లాంచ్ ఎప్పుడంటే..

MG Hector Tomahawk EV India launch : ఎంజీ మోటార్స్ త్వరలో లాంచ్ చేయనున్న త్రీ-రో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పుణెలో కెమెరాకు చిక్కింది. టీవీ షూటింగ్ సందర్భంగా కనిపించిన ఈ కారు డిజైన్ వివరాలు బయటకు వచ్చాయి. ఆ వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Aug 17, 2026, 10:00:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎంజీ మోటార్స్ నుంచి రానున్న కొత్త త్రీ-రో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పుణెలోని మగర్‌పట్టా సిటీలో ఎటువంటి కవర్లు లేకుండా కనిపించింది. టెలివిజన్ కమర్షియల్ షూటింగ్ సమయంలో ఈ ప్రొడక్షన్-రెడీ మోడల్​కి చెందిన క్లియర్​ వ్యూ లభించింది. ‘హెక్టార్ టోమహాక్ ఈవీ’గా పిలుస్తున్న ఈ ఎస్‌యూవీకి సంబంధించి కంపెనీ ఇప్పటికే కొన్ని టీజర్‌లను విడుదల చేసింది. కొత్త ‘అడాప్ట్’ ఆర్కిటెక్చర్​పై తయారవుతున్న తొలి మోడల్ ఈ ఆగస్టు 26న లాంచ్​ కానుంది.

సూపర్ స్టైలిష్​గా ఎంజీ హెక్టార్ టోమహాక్ ఈవీ.. (punekar__nikhil/Instagram)
సూపర్ స్టైలిష్​గా ఎంజీ హెక్టార్ టోమహాక్ ఈవీ.. (punekar__nikhil/Instagram)

భారత మార్కెట్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న త్రీ-రో ఫ్యామిలీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఎస్ వంటి మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్​లో భావిస్తున్నారు.

ఎంజీ హెక్టార్ టోమహాక్ ఈవీ- ప్రొడక్షన్ డిజైన్ ప్రత్యేకతలు..

కొత్త ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగా కాకుండా, ఈ ఎంజీ హెక్టార్ టోమహాక్ ఈవీ సాంప్రదాయ ఎస్‌యూవీల లాగా నిటారుగా, పటిష్టమైన రూపంలో కనిపిస్తోంది. ముందు భాగంలో మధ్యలో ఎంజీ లోగోతో కూడిన క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్ ఉంది. దీనికి ఇరువైపులా సన్నని ఎల్ఈడీ డీఆర్‌ఎల్‌లు అంచుల వరకు విస్తరించి ఉండగా, ప్రధాన ల్యాంప్స్ బంపర్ కింది భాగంలో నిలువుగా అమర్చారు.

లైట్ గ్రీన్ కలర్‌లో కనిపించిన ఈ టెస్ట్ వెహికల్ చుట్టూ వీల్ ఆర్చ్‌లు, లోయర్ బాడీ, రూఫ్ దగ్గర బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు. డార్క్ పిల్లర్స్ దీనికి డ్యూయల్-టోన్ లుక్‌ను తెచ్చిపెట్టాయి.

ఎంజీ హెక్టార్ టోమహాక్ ఈవీ- మూడు వరుసల సీట్ల సౌకర్యం..

సైడ్ ప్రొఫైల్ పరిశీలిస్తే ఈ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎంత విశాలంగా ఉందో అర్థమవుతుంది. పొడవైన వీల్‌బేస్, వెనుక వైపు పొడిగించిన భాగం మూడో వరుస సీట్ల సౌకర్యం కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు స్పష్టమవుతోంది. రూఫ్ రెయిల్స్, పెద్ద ఓఆర్‌వీఎంలు, స్టాండర్డ్ డోర్ హ్యాండిల్స్, జియోమెట్రిక్ ప్యాటర్న్‌తో కూడిన డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్‌ను ఇందులో అమర్చారు. రెండో, మూడో వరుసల ప్రయాణికుల కోసం పెద్ద గ్లాస్ ఏరియా ఇచ్చారు. ఇది మెరుగైన విజిబిలిటీని అందించడంతో పాటు సాంప్రదాయ ఎస్‌యూవీ రూపాన్ని ఇస్తుంది. వెనుక వైపు సన్నని హారిజంటల్ టెయిల్ ల్యాంప్స్ అమర్చినట్లు తెలుస్తోంది.

ఎంజీ హెక్టార్ టోమహాక్ ఈవీ- అడాప్ట్ ప్లాట్‌ఫారమ్..

ఈ ఎలక్ట్రిక్ కారు అధికారిక పేరును ఎంజీ ఇంకా పూర్తిగా ధృవీకరించనప్పటికీ, భారతదేశంలో 'ఎంజీ హెక్టార్ టోమహాక్' పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. ఇటీవలి టీజర్‌లో ప్రపంచ యుద్ధం నాటి కర్టిస్ పీ-40 టోమహాక్ యుద్ధ విమానాన్ని చూపడం విశేషం. గ్లోబల్ మార్కెట్లో లభించే వూలింగ్ స్టార్‌లైట్ 560 ఆధారంగా, భారతీయ అవసరాలకు తగిన మార్పులతో ఇది రానుంది.

ఎంజీకి చెందిన ‘అడాప్ట్’ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌పై భారత్‌లో తయారవుతున్న మొదటి మోడల్ ఇదే. ఈ ఆర్కిటెక్చర్ బ్యాటరీ ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్, స్ట్రాంగ్-హైబ్రిడ్ సిస్టమ్స్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే తొలి దశలో దీనిని ప్యూర్ ఈవీ (ఎలక్ట్రిక్ వెర్షన్) రూపంలో మార్కెట్లోకి తెస్తున్నారు.

ఇందులో 69.2 కేడబ్ల్యూహెచ్ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ ప్యాక్, ముందు భాగంలో అమర్చిన మోటార్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది సుమారు 204 బీహెచ్‌పీ పవర్, 310 ఎన్ఎం టార్క్​ని ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చైనా సీఎల్‌టీసీ నిబంధనల ప్రకారం సుమారు 530 కిలోమీటర్ల దూరం ప్రయాణించే (రేంజ్) అవకాశం ఉంది. అయితే భారత్‌లో దీని అధికారిక సర్టిఫికేషన్ వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More