...
...
Next Story

Assam Air Force Plane Crash : కూలిపోయిన వాయుసేన AN-32 విమానం - ఐదుగురు మృతి

Indian Air Force Plane Crash Assam : భారత వైమానిక దళానికి (IAF) చెందిన AN-32 రవాణా విమానం అస్సాంలోని జోర్హాట్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఐదుగురు ఐఏఎఫ్ సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Published on: Jun 13, 2026 03:56 PM IST
Advertisement

Indian Air Force Plane Crash Assam : భారత వైమానిక దళంలో (IAF) తీవ్ర విషాదం నెలకొంది. ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో శనివారం జరిగిన ఒక ఘోర విమాన ప్రమాదంలో ఐదుగురు ఐఏఎఫ్ సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. వాయుసేనకు చెందిన ఏఎన్-32 (AN-32) రవాణా విమానం సాధారణ శిక్షణలో భాగంగా గాల్లోకి ఎగిరిన కాసేపటికే సాంకేతిక లోపంతో కూలిపోయినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఐదుగురు సిబ్బంది మృతి…

అస్సాంలో ఘోర విమాన ప్రమాదం
అస్సాంలో ఘోర విమాన ప్రమాదం

అస్సాంలోని జోర్హాట్ ప్రాంత సమీపంలో ఈ ప్రమాదం సంభవించినట్లు భారత వైమానిక దళం అధికారికంగా ధృవీకరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఐఏఎఫ్ తన అధికారిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. సాధారణ శిక్షణ ఫ్లైట్ సమయంలోనే ఈ విమానం నియంత్రణ కోల్పోయి నేలకూలిందని వాయుసేన ప్రకటనలో తెలిపింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాద తీవ్రతకు విమాన శకలాలు అక్కడ ఉన్న పొలాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. విమానం పూర్తిగా ధ్వంసమవడంతో లోపల ఉన్న ఐదుగురు సిబ్బందిని కాపాడే అవకాశం లేకుండా పోయింది.

ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వైమానిక దళ సిబ్బంది కుటుంబాలకు ఐఏఎఫ్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. "ఈ కష్టసమయంలో మరణించిన వీరుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ జవాన్ల కుటుంబాలకు వాయుసేన అండగా ఉంటుంది," అని వైమానిక దళం ఎక్స్‌ వేదికగా పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

వాయుసేన వెల్లడించిన వివరాల ప్రకారం.. చనిపోయిన వారిలో స్క్వాడ్రన్ లీడర్ ప్రశాంత్ సింగ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభమ్ కుమార్, సర్జెంట్ జితేంద్ర శర్మ ఉన్నారు. వీరితో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం ద్వారా ఎంపికైన ఇద్దరు యువ జవాన్లు అగ్నివీర్‌వాయు ఖేమారామ్ కుమావత్, అగ్నివీర్‌వాయు డానిష్ ఆలమ్ కూడా ఈ ప్రమాదంలోనే కన్నుమూశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe