హెల్మెట్ నుంచి సరుకుల వరకు.. స్టోరేజ్ స్పేస్‌లో టాప్-5 స్కూటర్లు ఇవే! ధర ఎంతంటే?
ప్రస్తుతం స్కూటర్ కొనేవారు కేవలం మైలేజీనే కాదు, డిక్కీలో ఎంత స్టోరేజ్ ఉందనేది కూడా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియాలో అధిక అండర్-సీట్ స్టోరేజ్ కలిగిన టాప్-5 స్కూటర్ల వివరాలను ఇక్కడ చూసేయండి..
2026లో స్కూటర్ కొనేవారికి 'ప్రాక్టికాలిటీ' అనేది అత్యంత కీలకమైన అంశంగా మారింది. నగరాల్లో నిత్యం ప్రయాణించే వారికి హెల్మెట్లు, బ్యాగులు, కిరాణా సరుకులు వంటివి సర్దుకోవడానికి విశాలమైన బూట్ స్పేస్ అవసరమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న స్కూటర్లలో, అత్యధిక స్టోరేజ్ సామర్థ్యం కలిగిన టాప్-5 మోడళ్ల వివరాలు, వాటి ధరలు ఇక్కడ చూడండి..

స్టోరేజ్ ఎక్కువగా ఉన్న స్కూటర్లు ఇవి..
రివర్ ఇండీ – 43 లీటర్లు: స్టోరేజ్ విషయంలో రివర్ ఇండీ ప్రస్తుతం భారత మార్కెట్లో రారాజుగా వెలుగొందుతోంది. ఇందులో ఏకంగా 43 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఉంది. ఇది చాలా లోతుగా, వెడల్పుగా ఉండటం వల్ల హెల్మెట్లతో పాటు పెద్ద వస్తువులను కూడా సులభంగా సర్దుకోవచ్చు. ప్రాక్టికాలిటీ కోరుకునే వారికి ఇదొక బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. ధర: రూ. 1,44,999 (ఎక్స్-షోరూమ్)
ఏథర్ రిజ్టా – 34 లీటర్లు: కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏథర్ రూపొందించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ 'రిజ్టా'. ఇందులో 34 లీటర్ల మెయిన్ బూట్ స్పేస్ ఉంది. దీనికి అదనంగా ఫ్రంట్ ఏప్రాన్ వద్ద మరో 22 లీటర్ల స్టోరేజ్ లభిస్తుంది. నిత్యం సరుకులు మోసే గృహిణులు, ఫ్యామిలీ రైడర్లకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ధర: రూ. 1,09,999 (ఎక్స్-షోరూమ్)
ఓలా ఎస్1 ప్రో ప్లస్ – 34 లీటర్లు: ఈవీ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓలా ఎస్1 ప్రో ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా 34 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యాన్ని అందిస్తోంది. స్టైలిష్ లుక్, అత్యాధునిక ఫీచర్లతో పాటు విశాలమైన డిక్కీ ఉండటం దీనికి పెద్ద ప్లస్ పాయింట్. ధర: రూ. 1,54,999 (ఎక్స్-షోరూమ్)
టీవీఎస్ జుపిటర్ 125 – 33 లీటర్లు: పెట్రోల్ స్కూటర్ల విభాగంలో అత్యధిక స్టోరేజ్ కలిగిన మోడల్ ఏదంటే అది టీవీఎస్ జుపిటర్ 125. పెట్రోల్ ట్యాంక్‌ను ఫ్లోర్‌బోర్డ్ కిందకు మార్చడం ద్వారా సీటు కింద 33 లీటర్ల భారీ స్పేస్‌ను టీవీఎస్ సృష్టించింది. పెట్రోల్ స్కూటర్ కావాలి, డిక్కీ పెద్దదిగా ఉండాలి అనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది. ధర: రూ. 75,950 (ఎక్స్-షోరూమ్)
టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ– 32 లీటర్లు: టీవీఎస్ నుంచి వస్తున్న ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ ఎస్టీ. ఇందులో 32 లీటర్ల స్టోరేజ్ లభిస్తుంది. పెద్ద బ్యాటరీ, ఎక్కువ రేంజ్‌తో పాటు నగర ప్రయాణాలకు అవసరమైన సరుకులను పెట్టుకోవడానికి ఇందులో తగినంత స్థలం ఉంటుంది. ధర: రూ. 1,61,984 (ఎక్స్-షోరూమ్)
మీ అవసరాలకు అనుగుణంగా ఎక్కువ స్టోరేజ్ కలిగిన ఈ స్కూటర్లను ఒకసారి పరిశీలించండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


