బజాజ్ చేతక్ సీ25 వర్సెస్ ఓలా, ఏథర్, టీవీఎస్.. తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది?
బజాజ్ ఆటో తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'చేతక్ సీ2501'ను మార్కెట్లోకి తెచ్చింది. తక్కువ ధర, మెరుగైన రేంజ్‌తో వచ్చిన ఈ స్కూటర్.. ఓలా ఎస్1 ఎక్స్, ఏథర్ రిజ్టా ఎస్, టీవీఎస్ ఐక్యూబ్‌లకు గట్టి పోటీనిస్తోంది. ఈ నాలుగు స్కూటర్ల ఫీచర్లు, ధరల మధ్య తేడాలేంటో ఇక్కడ చూడండి..
భారతీయ రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాల సందడి పెరుగుతోంది. తాజాగా స్వదేశీ దిగ్గజం బజాజ్ ఆటో తన పాపులర్ చేతక్ సిరీస్‌లో సీ25 ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేసింది. దీనినే సీ2501 అని కూడా పిలుస్తున్నారు. బజాజ్ నుంచి వస్తున్న అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం విశేషం. అయితే, మార్కెట్లో ఇప్పటికే దూసుకెళుతున్న ఓలా, ఏథర్, టీవీఎస్ వంటి సంస్థల నుంచి దీనికి గట్టి పోటీ ఎదురవుతోంది. మరి ఈ పోటీలో బజాజ్ చేతక్ ఎంతవరకు నిలబడుతుంది? వివిధ ఈ-స్కూటర్లతో దీనిని పోల్చి చూద్దాము..

బజాజ్ చేతక్ సీ25 వర్సెస్ ఏథర్ రిజ్టా, ఓలా ఎస్1 ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్..
బ్యాటరీ, రేంజ్: బజాజ్ చేతక్ సీ2501లో 2.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 113 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 55 కిలోమీటర్లు. కేవలం 2 గంటల 25 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది.
ఓలా ఎస్1 ఎక్స్ విషయానికొస్తే, ఇందులో 2 కేడబ్ల్యూహెచ్, 3 కేడబ్ల్యూహెచ్, 4 కేడబ్ల్యూహెచ్ అనే మూడు ఆప్షన్లు ఉన్నాయి. వీటి రేంజ్ వరుసగా 108 కి.మీ, 176 కి.మీ, 242 కి.మీ వరకు ఉంటుంది. పవర్ పరంగా ఇది 9.3 బీహెచ్పీతో దూసుకుపోతుంది.
ఇక ఏథర్ రిజ్టా ఎస్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మూడు బ్యాటరీ వేరియంట్లలో (2.7 కేడబ్ల్యూహెచ్, 2.9 కేడబ్ల్యూహెచ్, 3.7 కేడబ్ల్యూహెచ్) లభిస్తోంది. ఇది గరిష్టంగా 159 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. దీని పీక్ పవర్ 5.7 బీహెచ్పీ.
ఇక టీవీఎస్ ఐక్యూబ్ 2.2 కేడబ్ల్యూహెచ్ నుంచి 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది. ఇది మోడల్‌ను బట్టి 94 కి.మీ నుంచి 145 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. దీని పీక్ పవర్ 5.9 బీహెచ్పీ
బజాజ్ చేతక్ సీ25 వర్సెస్ ఏథర్ రిజ్టా, ఓలా ఎస్1 ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్- ఫీచర్ల సందడి..
బజాజ్ చేతక్‌లో కలర్ ఎల్‌సీడీ డిస్ప్లే, రివర్స్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా 'టెక్ ప్యాక్' తీసుకుంటే హిల్ హోల్డ్, గైడ్-మీ-హోమ్ లైట్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు లభిస్తాయి.
ఫీచర్ల పరంగా ఓలా, ఏథర్ చాలా ముందున్నాయి. ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 4.3 ఇంచ్ డిస్ప్లే, క్రూయిజ్ కంట్రోల్, జీపీఎస్ నావిగేషన్ వంటివి ఉండగా.. ఏథర్ రిజ్టాలో 7 ఇంచ్ పెద్ద డిస్ప్లే, టర్న్-బై-టర్న్ నావిగేషన్, క్రాష్ అలర్ట్స్, 34 లీటర్ల భారీ బూట్ స్పేస్ ఉన్నాయి. టీవీఎస్ ఐక్యూబ్‌లో కూడా అలెక్సా సపోర్ట్, యాంటీ థెఫ్ట్ అలర్ట్స్ వంటి ఆధునిక ఫీచర్లు విద్యార్థులను, యువతను ఆకట్టుకుంటున్నాయి.
బజాజ్ చేతక్ సీ25 వర్సెస్ ఏథర్ రిజ్టా, ఓలా ఎస్1 ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్- ధరలు..
ధర విషయంలో బజాజ్ చేతక్ సీ2501 మధ్యస్థంగా ఉంది.
బజాజ్ చేతక్ సీ2501: రూ. 91,399 నుంచి ప్రారంభం.
ఓలా ఎస్1 ఎక్స్: రూ. 82,999 నుంచి ప్రారంభం (అత్యంత చౌకైనది).
ఏథర్ రిజ్టా ఎస్: రూ. 1.04 లక్షల నుంచి ప్రారంభం.
టీవీఎస్ ఐక్యూబ్: రూ. 1.11 లక్షల నుంచి ప్రారంభం (అత్యంత ఖరీదైనది).
మీకు బజాజ్ బ్రాండ్ మీద నమ్మకం ఉండి, తక్కువ సమయంలో ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలంటే 'చేతక్ సీ2501' మంచి ఎంపిక. అలా కాకుండా ఎక్కువ ఫీచర్లు, తక్కువ ధర కావాలంటే ఓలా వైపు చూడవచ్చు. ఇక ఫ్యామిలీ కోసం ఎక్కువ స్టోరేజ్, సేఫ్టీ ఫీచర్లు కావాలనుకుంటే ఏథర్ రిజ్టా లేదా టీవీఎస్ ఐక్యూబ్ బెస్ట్ ఛాయిస్ అవుతాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


