ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలా? అత్యధిక రేంజ్ ఇచ్చే టాప్-5 ఆప్షన్స్ ఇవి..
పెట్రోల్ ధరల భారం తగ్గించుకోవాలనుకునే వారికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ-స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే 2026లో భారత మార్కెట్లో అత్యధిక రేంజ్ ఇస్తున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. నగరాల్లో తిరగడానికి లేదా ఆఫీసు పనులకు వెళ్లడానికి ఇప్పుడు చాలా మంది ఈ-స్కూటర్ల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అనగానే అందరికీ వచ్చే మొదటి ప్రశ్న.. 'ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు వెళుతుది?' అని! మీ ఈ సందేహాన్ని తీరుస్తూ, 2026లో అత్యధిక రేంజ్‌ని ఇచ్చే టాప్-5 స్కూటర్ల జాబితాను ఇక్కడ చూసేయండి..

రేంజ్లో బెస్ట్- టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవి..
1. ఓలా ఎస్1 ప్రో-
ప్రస్తుతం భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో 'ఓలా ఎస్1 ప్రో' తన హవా కొనసాగిస్తోంది. ముఖ్యంగా 5.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ కలిగిన 'ఎస్1 ప్రో స్పోర్ట్', 'ఎస్1 ప్రో+' వేరియంట్లు అదిరిపోయే రేంజ్‌ను ఇస్తున్నాయి. వీటి ధరలు వరుసగా రూ. 1,49,999, రూ. 1,54,999 (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి.
రేంజ్: 320 కి.మీ (ఐడీసీ)
వేగం: ప్రో స్పోర్ట్ వేరియంట్ కేవలం 2.0 సెకన్లలోనే 0-40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 152 కిలోమీటర్లు.
2. సింపుల్ వన్ జెన్ 2-
బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ నుంచి వచ్చిన ఈ లేటెస్ట్ స్కూటర్ రెండో స్థానంలో నిలిచింది. దీని 5.0 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వేరియంట్ ధర రూ. 1,77,999 (ఎక్స్-షోరూమ్). పాత మోడల్ కంటే ఇది మరింత స్టైలిష్‌గా, దృఢమైన బ్యాటరీతో మార్కెట్లోకి వచ్చింది.
రేంజ్: 265 కి.మీ (ఐడీసీ)
వేగం: ఇది 0-40 కి.మీ వేగాన్ని 2.55 సెకన్లలో అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లు.
3. టీవీఎస్ ఐక్యూబ్-
నమ్మకమైన బ్రాండ్ నుంచి వచ్చిన టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లోని ఎస్టీ వేరియంట్ 5.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 1,58,834 (ఎక్స్-షోరూమ్). ఇందులో 17.78 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
రేంజ్: 212 కి.మీ (ఐడీసీ)
వేగం: ఇది గరిష్టంగా గంటకు 82 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది.
4. విడా వీ2-
హీరో మోటోకార్ప్ వారి 'విడా' బ్రాండ్ నుంచి వచ్చిన వీ2 ప్రో మోడల్ రూ. 1,20,300 (ఎక్స్-షోరూమ్) ధరకు లభిస్తోంది. ఇందులో బ్యాటరీని తీసి విడిగా ఛార్జ్ చేసుకునే (రిమూవెబుల్ బ్యాటరీ) సదుపాయం ఉండటం పెద్ద ప్లస్ పాయింట్.
రేంజ్: 165 కి.మీ (ఐడీసీ)
వేగం: కేవలం 2.9 సెకన్లలో 0-40 కి.మీ వేగాన్ని అందుకునే ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు.
5. రివర్ ఇండీ-
‘స్కూటర్లలో ఎస్‌యూవీ’గా పేరు తెచ్చుకున్న రివర్ ఇండీ జెన్ 3, తన 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో మంచి పనితీరు కనబరుస్తోంది. దీని ధర రూ. 1,46,399 (ఎక్స్-షోరూమ్). థర్డ్ జనరేషన్ మోడల్‌లో రోడ్డుపై పట్టు కోసం మెరుగైన టైర్లను, కొండ ప్రాంతాల్లో వాహనం వెనక్కి జారకుండా ఉండేలా 'హిల్-హోల్డ్ అసిస్ట్' ఫీచర్‌ను జోడించారు.
రేంజ్: 163 కి.మీ (ఐడీసీ)
వేగం: గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
మీ ప్రయాణ అవసరాలను బట్టి ఈ ఐదింటిలో ఏదైనా ఎంచుకోవచ్చు. అయితే కొనేముందు మీ ప్రాంతంలోని షోరూమ్‌కు వెళ్లి టెస్ట్ రైడ్ చేయడం మర్చిపోకండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


