AIBE Admit Card 2026 : భారతదేశంలో న్యాయవాద వృత్తిని చేపట్టడానికి అర్హత పరీక్షగా భావించే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (AIBE XXI) అడ్మిట్ కార్డ్‌లను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) అధికారికంగా విడుదల చేసింది. పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకున్న లా గ్రాడ్యుయేట్లు తమ అడ్మిట్ కార్డ్‌లను అధికారిక వెబ్‌సైట్ allindiabarexamination.com ద్వారా ఆన్‌లైన్‌లో పొందవచ్చు.
ఏఐబీఈ 21 పరీక్ష ఎప్పుడు?

ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఏఐబీఈ 21 పరీక్ష జూన్ 7, 2026 (ఆదివారం)న దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో జరుగుతుంది. పరీక్ష రోజు మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఈ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ విండో అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు రాకుండా ఉండేందుకు అభ్యర్థులు ముందే తమ హాల్ టికెట్లను ప్రింట్ తీసుకోవడం మంచిది.
ఏఐబీఈ 21 అడ్మిట్ కార్డ్ 2026- డౌన్‌లోడ్ చేయడం ఎలా?
అభ్యర్థులు కింది సాధారణ స్టెప్స్ ఫాలో అయి తమ హాల్ టికెట్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:
స్టెప్ 1: మొదట అధికారిక వెబ్‌సైట్ allindiabarexamination.com ను సందర్శించండి.
స్టెప్ 2: హోమ్‌పేజీలో కనిపించే "AIBE Admit Card 2026" లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: ఆ తర్వాత ఓపెన్ అయ్యే లాగిన్ పేజీలో మీ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలను నమోదు చేయండి.
స్టెప్ 4: సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 5: ఇప్పుడు మీ స్క్రీన్‌పై అడ్మిట్ కార్డ్ ప్రత్యక్షమవుతుంది. అందులోని వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి.
స్టెప్ 6: హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, పరీక్ష అవసరాల కోసం ఒకటి కంటే ఎక్కువ ప్రింటౌట్లు తీసి భద్రపరుచుకోండి.
{{/usCountry}}స్టెప్ 6: హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, పరీక్ష అవసరాల కోసం ఒకటి కంటే ఎక్కువ ప్రింటౌట్లు తీసి భద్రపరుచుకోండి.
{{/usCountry}}ఏఐబీఈ అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అడ్మిట్ కార్డ్‌పై ఉండే ముఖ్యమైన వివరాలు..
హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత అభ్యర్థులు కింది వివరాలను తప్పకుండా సరిచూసుకోవాలి.
- అభ్యర్థి పేరు, ఫోటో
- రోల్ నంబర్, హాల్ టికెట్ నంబర్
- పరీక్ష తేదీ, సమయం
- పరీక్షా కేంద్రం పేరు, పూర్తి చిరునామా
- రిపోర్టింగ్ సమయం
ఒకవేళ ఏవైనా తప్పులు దొర్లితే వెంటనే సరిదిద్దుకోవడానికి బీసీఐ హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలి.
పరీక్షకు సంబంధించిన సాధారణ సూచనలు, నిబంధనలు..
ముఖ్య గమనిక: పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి అడ్మిట్ కార్డ్ తప్పనిసరి. ఏఐబీఈ 21 హాల్ టికెట్ లేని ఏ అభ్యర్థిని కూడా ఎగ్జామ్ హాల్ లోపలికి అనుమతించరు. కాబట్టి అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌తో పాటు ఒక చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ గుర్తింపు కార్డును (ఆధార్/ ఓటర్ ఐడీ) కూడా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. పరీక్షకు హాజరయ్యే ముందు హాల్ టికెట్‌పై ఉన్న జనరల్ గైడ్‌లైన్స్‌ను అభ్యర్థులు జాగ్రత్తగా చదువుకోవాలి.