TG LAWCET 2026 : లాసెట్ కు ప్రిపేర్ అవుతున్నారా..? పరీక్షా విధానం, సిలబస్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి

టీజీ లాసెట్ - 2026 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతి ఏడాది ఈ ఎగ్జామ్ రాసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే పరీక్షా విధానం, సిలబస్ ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి…. 

Published on: Mar 3, 2026, 10:09:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గత కొంతకాలంగా లా కోర్సుల్లో చేరేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి ఏడాది దరఖాస్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. వయోపరిమితి నిబంధన లేకపోవటంతో అర్హత ఉన్న చాలా మంది లాసెట్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఈ సీట్లకు చాలా డిమాండ్ ఉంటోంది.

టీజీ లాసెట్ 2026 (image source istock)
టీజీ లాసెట్ 2026 (image source istock)

ప్రస్తుతం తెలంగాణ లాసెట్ - 2026 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైన్ తో అయితే మే 13వ తేదీ వరకు అవకాశం ఉంది. అప్లికేషన్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 900, జనరల్ అభ్యర్థులు రూ. 1100 చెల్లించాలి. పీజీఎల్ సెట్ కు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ఖులు రూ. 900, జనరల్ అభ్యర్థులు రూ. 1100 చెల్లించాలి.

మే 18వ తేదీన మూడేళ్ల ఎల్ఎల్ బీ ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుంది. ఉదయం 09. 30 గంటల నుంచి 11 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మరో సెషన్ ఉంటుంది. ఇక ఎల్ఎల్ బీ ఐదేళ్ల కోర్సుతో పాటు ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ పరీక్షను సాయంత్రం 4 గంటల నుంచి 05.30 గంటల మధ్య నిర్వహిస్తారు.

టీజీ లాసెట్ పరీక్షా విధానం…

టీజీ లాసెట్ పరీక్షను మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. 5, 3 ఏళ్ల కోర్సులతో పాటు పీజీలాసెట్ కు ఇంతే మార్కులతో కూడిన ఎగ్జామ్ ఉంటుంది. 90 నిమిషాల వ్యవధి ఉంటుంది. 5, 3 ఏళ్ల లాకోర్సుకు ఓకే విధమైన సిలబస్ ఉంటుంది. కానీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష సిలబస్ వేరుగా ఉంటుంది.

  • పార్ట్ ఏ - 30 మార్కులు జనరల్ నాల్డెజ్, మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  • పార్ట్ బీ - 60 మార్కులు భారత రాజ్యాంగం నుంచి అడుగుతారు.
  • పార్ట్ సీ - 30 మార్కులు లీగల్ అప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

టీజీ లాసెట్ సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి…

  • ముందుగా https://lawcet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లండి.
  • హోం పేజీలోని సిలబస్ లింక్ పైక్లిక్ చేయాలి.
  • ఇక్కడ PGLCET Syllabus,LAWCET Syllabus ఆప్షన్లు ఉంటాయి.
  • మీరు ఏదానికైతే ప్రిపేర్ అవుతున్నారో… దానిపై క్లిక్ చేస్తే పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
  • సిలబస్ వివరాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా సిలబస్ కాపీని పొందొచ్చు.

టీజీ లాసెట్ ఫలితాల విడుదల తర్వాత ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టి సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను ప్రకటిస్తారు. గత కొంతకాలంగా లా కోర్సులకు మంచి డిమాండ్ ఉంటోంది. సీట్ల కోసం చాలా మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More