Airtel Recharge Plans : ఎయిర్​టెల్​ కస్టమర్స్​కి పండగే! 30 రోజుల వాలిడిటీతో రీఛార్జ్​ ప్లాన్స్..

Airtel 30 day recharge plans : ఎయిర్​టెల్​ కస్టమర్స్​కి అలర్ట్​! 30 రోజుల వాలిడిటీతో పలు రీఛార్జ్​ ప్లాన్స్​ని సంస్థ ఇటీవలే ప్రవేశపెట్టింది. ఇందులో అన్​లిమిటెడ్​ కాల్స్​ సహా ఇతర బెనిఫిట్స్​ వంటివి లభిస్తున్నాయి. పూర్తి వివరాలు చూసేయండి..

Published on: Apr 15, 2026, 11:31:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ టెలీకాం సంస్థలు సాధారణంగా 28 రోజుల వాలిడిటీతో రిఛార్జ్​ ప్లాన్స్​ని ఇస్తుంటాయి. కానీ 30 రోజుల వాలిడిటీతో ప్లాన్స్​ కావాలని చాలా కాలంగా కస్టమర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎయిర్​టెల్​ తన కస్టమర్లకు గుడ్​ న్యూస్​ చెప్పింది. 30 రోజుల వాలిడిటీతో పలు రకాల ప్రీపెయిడ్ రీఛార్జ్​ ప్లాన్స్​ని ప్రవేశపెట్టింది. ఇవి కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఒకవేళ మీరు ఎయిర్​టెల్​ వినియోగదారులైతే లేదా ఎయిర్​టెల్​కి స్విఛ్​ అవ్వాలని ప్లాన్​ చేస్తుంటే.. ఇందులోని 30 రోజుల వాలిడిటీ గల రీఛార్జ్​ ప్లాన్స్​ గురించి ఇక్కడ తెలుసుకోండి..

ఎయిర్​టెల్ 30 డే​ రీఛార్జ్​ ప్లాన్స్​
ఎయిర్​టెల్ 30 డే​ రీఛార్జ్​ ప్లాన్స్​

ఎయిర్​టెల్​ 30 డే రీఛార్జ్​ ప్లాన్స్​- ధర, బెనిఫిట్స్..

ఎయిర్​టెల్​ రూ. 319 ప్లాన్- నెల రోజుల వాలిడిటీతో వస్తున్న ఈ ఎయిర్​టెల్​ ప్లాన్​లో అన్​లిమిటెడ్​ 5జీ, అన్​లిమిటెడ్​ లోకల్, ఎస్​టీడీ, రోమింగ్​ కాల్స్​ లభిస్తాయి. రోజుకు 1.5 డేటా పొందొచ్చు. రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు ఉచితం. యాపిల్​ మ్యూజిక్, 12 నెలల పాటు అడోబ్​ ఎక్స్​ప్రెస్​ ప్రీమియం, ఫ్రీ హెలో ట్యూన్స్, ఎయిర్​టెల్​ ఎక్స్​ట్రీమ్ ప్లే, గూగుల్​ వన్ వంటి వాటికి యాక్సెస్​ లభిస్తుంది.

ఎయిర్​టెల్ రూ. 429 ప్లాన్- 30 రోజుల వాలిడిటీతో పాటు అధిక ఇంటర్నెట్​ డేటా కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది. అన్​లిమిటెడ్​ 5జీ, అన్​లిమిటెడ్​ లోకల్​, ఎస్​టీడీ, రోమింగ్​ కాల్స్​ పొందొచ్చు. రోజుకు 2.5జీబీ డేటా లభిస్తోంది. అడోబ్​ ప్రీమియం ఎక్స్​ప్రెస్​, ఎయిర్​టెల్​ స్పామ్ వార్నింగ్​ అలర్ట్స్​, ఫ్రీ హలో ట్యూన్స్, ఎయిర్​టెల్​ ఎక్స్​ట్రీమ్ వంటి బెనిఫిట్స్​ దక్కించుకోవచ్చు. రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు ఫ్రీ.

ఎయిర్​టెల్​ రూ. 589 ప్లాన్- నెల రోజులు వాలిడిటీ గల ఈ ఎయిర్​టెల్​ రీఛార్జ్​ ప్లాన్​లో మొత్తం 50 జీబీ డేటా లభిస్తోంది. అన్​లిమిటెడ్​ కాలింగ్​, రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు ఫ్రీ వంటి ఆప్షన్స్​ ఎలాగూ ఉన్నాయి. వీటితో పాటు అడోబ్​ ప్రీమియం ఎక్స్​ప్రెస్​, ఎయిర్​టెల్​ స్పామ్ వార్నింగ్​ అలర్ట్స్, ఫ్రీ హలోట్యూన్స్​ వంటివి బెనిఫిట్స్​గా పొందొచ్చు.

ఎయిర్​టెల్​ రూ. 609 ప్లాన్- ఈ ఎయిర్​టెల్​ రీఛార్జ్​ ప్లాన్​ రూ. 589 ప్లాన్​తో పోలి ఉంటుంది. కానీ ఇందులో డేటా ఎక్కువగా వస్తుంది. 60 జీబీ వరకు డేటాను పొందొచ్చు. మిగిలిన బెనిఫిట్స్​ అన్నీ సేమ్​ టు సేమ్.

30 రోజుల వాలిడిటీతో డేటా ప్యాక్స్​..

కేవలం డేటా మాత్రమే కావాలనుకునే కస్టమర్ల కోసం 30 రోజుల వాలిడిటీతో ఎయిర్​టెల్​లో రీఛార్జ్​ ప్లాన్స్​ లభిస్తున్నాయి. అవి..

రూ. 48- 1జీబీ డేటా (30 రోజుల వాలిడిటీ)

రూ. 100- 6జీబీ డేటా (30 రోజుల వాలిడిటీ)

రూ. 161- 12జీబీ డేటా (30 రోజుల వాలిడిటీ)

రూ. 195- 12జీబీ డేటా (30 రోజుల వాలిడిటీ). ఇందులో జియోహాట్​స్టార్​తో పాటు ఇతర ఓటీటీ ప్లాట్​ఫామ్స్​కి యాక్సెస్​ కూడా ఉంటుంది.

రూ. 361- 50 జీబీ డేటా (30 రోజుల వాలిడిటీ). ఇందులో కూడా ఓటీటీలకు యాక్సెస్​ ఉంటుంది.

రూ. 279- 1జీబీ డేటా (30 రోజుల వాలిడిటీ). నెట్​ఫ్లిక్స్​ బేసిక్​తో పాటు ఇతర ఓటీటీలకు యాక్సెస్​ లభిస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More