వావ్! 50 గంటల బ్యాటరీ లైఫ్‌తో Realme buds air 8 pro- ధర ఎంతంటే..
Realme buds air 8 pro price : ఇండియాలోకి సరికొత్త ఇయర్‌బడ్స్‌ని తీసుకొచ్చింది రియల్‌మీ సంస్థ. దాని పేరు రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8 ప్రో. 50 గంటల బ్యాటరీ లైఫ్‌తో ఈ గ్యాడ్జెట్ వస్తుండటం విశేషం. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి? డీటైల్డ్‌గా ఇక్కడ తెలుసుకోండి..
Realme earphones in India 2026 : భారతదేశ ఇయర్‌బడ్స్ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు రియల్‌మీ సరికొత్త ఆడియో డివైజ్‌ను ఇటీవలే పరిచయం చేసింది. అదిరిపోయే సౌండ్ క్వాలిటీ, అధునాతన కాలింగ్ సిస్టమ్‌తో ‘రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8 ప్రో’ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. పాత మోడళ్లతో పోలిస్తే ఇందులో డిజైన్, ఆడియో టెక్నాలజీ పరంగా చాలా మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ధర, ఫీచర్స్ వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..

రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8 ప్రో- ధర, లభ్యత వివరాలు..
భారత్‌లో రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8 ప్రో ధరను రూ. 6,999గా నిర్ణయించారు. అయితే లాంచ్ ఆఫర్ కింద కస్టమర్లకు రూ. 300 ప్రత్యేక డిస్కౌంట్ లభిస్తుంది. ఇవి మాస్టర్ వైట్, మాస్టర్ బ్లాక్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి.
మొదటి సేల్: జూన్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమై, జూన్ 5వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు కొనసాగుతుంది.
కస్టమర్లు వీటిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8 ప్రో- స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..
- థియేటర్ లాంటి సౌండ్ - డ్యూయల్ డ్రైవర్ సిస్టమ్
ఈ ఇయర్‌బడ్స్‌లో కో-యాక్సియల్ డ్యూయల్-డ్రైవర్ ఆడియో సిస్టమ్‌ను అమర్చారు. ఇందులో బేస్ కోసం 11ఎంఎం డైనమిక్ డ్రైవర్, హై-ఫ్రీక్వెన్సీ సౌండ్ కోసం 6ఎంఎం మైక్రో-ప్లానార్ ట్వీటర్ ఉన్నాయి. ఇది 20హెచ్‌జెడ్ నుంచి 40కేహెచ్‌జెడ్ వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్‌ను అందిస్తుంది. అదనంగా, ఇది హై-రెజల్యూషన్ వైర్‌లెస్ ఆడియో కోసం ఎల్హెచ్డీసీ 5.0 కోడెక్ ను సపోర్ట్ చేస్తుంది, దీనివల్ల మ్యూజిక్ వినేటప్పుడు క్రిస్టల్ క్లియర్ సౌండ్ వస్తుంది.
2. 55డీబీ అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఏఎన్సీ)
బయటి శబ్దాలు ఏమాత్రం వినపడకుండా ప్రశాంతంగా మ్యూజిక్ ఆస్వాదించడానికి ఇందులో 55డీబీ వరకు అడాప్టివ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను ఇచ్చారు. చుట్టుపక్కల మనుషుల మాటలను వినడానికి వీలుగా ఇయర్‌బడ్స్ తీయకుండానే ‘ట్రాన్స్‌పరెన్సీ మోడ్’లోకి మారే సదుపాయం కూడా ఉంది.
3. క్రిస్టల్ క్లియర్ కాల్స్ - బోన్ కండక్షన్ టెక్నాలజీ
కాలింగ్ కోసం ప్రతి బడ్‌లో మూడు చొప్పున మొత్తం 6-మైక్రోఫోన్ సిస్టమ్‌ని అందించారు. దీనికి తోడుగా ఇందులో ఉన్న బోన్-కండక్షన్ టెక్నాలజీ ఆధారిత వాయిస్ ప్రాసెసింగ్ యూనిట్ (వీపీయూ), ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్.. చుట్టుపక్కల ఉండే పర్యావరణ శబ్దాలను దాదాపు 90డీబీ వరకు తగ్గించి, మనం మాట్లాడే వాయిస్ అవతలి వారికి స్పష్టంగా వినబడేలా చేస్తుంది.
4. గేమింగ్, కనెక్టివిటీ
గేమర్స్ కోసం ఇందులో ప్రత్యేకంగా 'గేమ్ మోడ్' ఉంది, ఇది కేవలం 45ఎంఎస్ లో-లేటెన్సీని అందిస్తుంది. దీనివల్ల పబ్‌జీ లేదా ఫ్రీ ఫైర్ లాంటి గేమ్‌లు ఆడేటప్పుడు ఆడియో లాగ్ అస్సలు ఉండదు. ఇది లేటెస్ట్ బ్లూటూత్ 6.1, గూగుల్ ఫాస్ట్ పెయిర్, ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునే 'డ్యూయల్-డివైస్ కనెక్టివిటీ'ని సపోర్ట్ చేస్తుంది. చెవిలో నుంచి తీయగానే పాట ఆగిపోయే 'వేర్ డిటెక్షన్' ఫీచర్ కూడా ఇందులో ఉంది.
5. బ్యాటరీ, ఛార్జింగ్
బ్యాటరీ పరంగా రియల్‌మీ ఇందులో అద్భుతమైన బ్యాకప్‌ను ప్రవేశపెట్టింది.
ప్రతి ఇయర్‌బడ్‌లో 62ఎంఏహెచ్, ఛార్జింగ్ కేస్‌లో 590ఎంఏహెచ్ బ్యాటరీ సెటప్ ఉంది.
సింగిల్ ఛార్జ్‌పై బడ్స్ 12 గంటల ప్లేబ్యాక్ ఇస్తాయి. కేస్‌తో కలిపితే మొత్తంగా 50 గంటల భారీ బ్యాటరీ లైఫ్ లభిస్తుంది.
ఫాస్ట్ ఛార్జింగ్: కేవలం 10 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే ఏకంగా 11 గంటల పాటు మ్యూజిక్ వినవచ్చు. టైప్-సీ పోర్ట్ ద్వారా కేస్ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 2 గంటల సమయం పడుతుంది.
ఇవి ధూళి, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ55 రేటింగ్ తో వస్తాయి. ప్రతి బడ్ బరువు కేవలం 4.8 గ్రాములు మాత్రమే ఉండటం వల్ల రోజంతా పెట్టుకున్నా చెవులకు ఎలాంటి నొప్పి ఉండదు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


