Amazon Sale : ఈ ఫెస్టివల్లో స్మార్ట్‌ఫోన్ షాపింగా చేయాలా? అమెజాన్‌లో భారీ ఆఫర్లు- ధర రూ. 30వేల లోపే!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026 ఇప్పటికే ప్రారంభమైంది. రూ. 30,000 లోపు బడ్జెట్‌లో శాంసంగ్, వన్‌ప్లస్, ఐక్యూ, రెడ్‌మీ, మోటోరోలా బ్రాండ్ల టాప్ స్మార్ట్‌ఫోన్లపై లభిస్తున్న బెస్ట్ డీల్స్, బ్యాంక్ డిస్కౌంట్ల పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి..
పండగ సీజన్‌ను పురస్కరించుకుని ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026' ఇప్పటికే అధికారికంగా ప్రారంభమైంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం అనేక రకాల ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా రూ. 30,000 లోపు బడ్జెట్‌లో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం అనే చెప్పాలి. ఐక్యూ, వన్‌ప్లస్, శాంసంగ్, రెడ్‌మీ, మోటోరోలా వంటి దిగ్గజ బ్రాండ్ల డివైజ్‌లు భారీ ధరకు తగ్గింపు పొందుతున్నాయి.
మీరు ఈ ఫెస్టివల్ సీజన్లో స్మార్ట్‌ఫోన్ షాపింగ్ చేయాలనుకుంటుంటే, ఇదే రైట్ టైమ్! రూ. 30వేల బడ్జెట్లోపు వివిధ స్మార్ట్‌ఫోన్ డీల్స్‌ని ఇక్కడ చూసేయండి..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్- బ్యాంక్ ఆఫర్లు, అదనపు క్యాష్‌బ్యాక్..
డైరెక్ట్ ప్రైస్ కట్స్‌తో పాటు బ్యాంక్ ఆఫర్లు, కూపన్లు, క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను ఉపయోగించుకుని ఫోన్ల ధరలను మరింత తగ్గించుకునే వెసులుబాటును అమెజాన్ కల్పిస్తోంది:
ఎస్బీఐ కార్డ్ ఆఫర్: ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ వినియోగదారులు సేల్ సమయంలో 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.
అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డ్: అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించే వారికి 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
అమెజాన్ పే లేటర్: ఈ సదుపాయం ద్వారా అర్హత ఉన్న ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంచారు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్- ఐక్యూ, వన్‌ప్లస్ డీల్స్..
ఈ అమెజాన్ సేల్‌లో రూ. 25,000 బడ్జెట్ పరిధిలో లభించే ఆఫర్లలో ఐక్యూ జెడ్11ఎక్స్ఏ 5జీ ప్రధానంగా నిలిచింది. సాధారణంగా రూ. 40,999 ధరఉన్న ఈ స్మార్ట్‌ఫోన్, వర్తించే బ్యాంక్ డిస్కౌంట్లు, కూపన్ ఆఫర్లతో కలిపి కేవలం రూ. 24,999 ప్రారంభ ధరకే లభిస్తోంది.
మరోవైపు మిడ్-రేంజ్ పాపులర్ మోడల్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 లైట్ రూ. 33,999 అసలు ధరతో అందుబాటులో ఉండగా, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆఫర్లను వర్తింపజేసి రూ. 26,999 కే సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్- శాంసంగ్, రెడ్‌మీ ఫోన్లపై ఆఫర్లు..
శాంసంగ్, రెడ్‌మీ కంపెనీలు కూడా తమ హిట్ మోడళ్లను తగ్గింపు ధరలకు అందిస్తున్నాయి:
శాంసంగ్ గెలాక్సీ ఎం47 5జీ: రూ. 46,999 వద్ద లిస్ట్ అయిన ఈ ఫోన్, ప్రస్తుత అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ. 26,999 ధరకే అందుబాటులోకి వచ్చింది.
రెడ్‌మీ నోట్ 17 5జీ: ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 27,999 ధరకు లభిస్తుండగా, ప్రాడక్ట్ పేజీలో కనిపిస్తున్న రూ. 1,000 అదనపు కూపన్‌ను అప్లై చేసి ధరను మరింత తగ్గించుకోవచ్చు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్- మోటోరోలా డీల్..
రూ. 30,000 బడ్జెట్ పరిమితిలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారి కోసం మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మంచి ఆప్షన్‌గా ఉంది. రూ. 37,999 ఎంఆర్‌పీ ఉన్న ఈ ఫోన్, వర్తించే బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ. 28,749 ధరకే లభ్యమవుతోంది.
నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా తోడవడంతో పాత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునే వారికి ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మంచి అవకాశం కల్పిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


