పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ బిగ్గెస్ట్ డిస్కౌంట్ వేడుక ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్‌ను అక్టోబర్ 8న అధికారికంగా ప్రారంభించింది. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి లేదా పాత డివైజ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల నుంచి బడ్జెట్ సెగ్మెంట్ మోడళ్ల వరకు ప్రధాన బ్రాండ్ల ఫోన్లపై భారీ ఆఫర్లను అమెజాన్ అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్- ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఆఫర్లు..

ఈ సేల్‌లో అత్యంత ఆకర్షణీయమైన డీల్స్‌లో శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఒకటిగా నిలిచింది. రూ. 1,29,999 ప్రారంభ ధరతో (12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ సామర్థ్యం) మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్, ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కూపన్ ఆఫర్లతో కలిపి రూ. 84,999 ఎఫెక్టివ్ ప్రారంభ ధరకే లభిస్తోంది. దీనితో పాటు 9 నెలల వరకు వడ్డీ లేని ఈఎంఐ సౌకర్యాన్ని కూడా అందించడం గమనార్హం.
ఇక యాపిల్ అభిమానులకు ఐఫోన్ 16 ఆఫర్ తీపి కబురు అందిస్తోంది. సాధారణంగా రూ. 89,900గా ఉన్న ఐఫోన్ 16 ధర, ఈ సేల్‌లో వర్తించే అన్ని రకాల ప్రయోజనాలు కలుపుకుని రూ. 71,999 ఎఫెక్టివ్ ధరకు అందుబాటులోకి వచ్చింది.
మిడ్-రేంజ్, అప్పర్ మిడ్-రేంజ్ ఫోన్లపై ఆఫర్లు..
షియోమీ 17 : భారీ ధర తగ్గింపు పొందిన మరొక ప్రీమియం ఫోన్ షియోమీ 17. అసలు ధర రూ. 1,19,999 కాగా, ఈ అమెజాన్ సేల్‌లో రూ. 59,999 కే సొంతం చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ ఈఎంఐ బ్యాంక్ ఆఫర్‌లతో పాటు 6 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది.
ఐక్యూ 15ఆర్ : రూ. 69,999 ధర కలిగిన ఈ ఫోన్ కూపన్ ఆఫర్లు, 3 నెలల నో-కాస్ట్ ఈఎంఐ వెసులుబాటుతో రూ. 46,499 ఎఫెక్టివ్ ధరకు లభిస్తోంది.
{{/usCountry}}ఐక్యూ 15ఆర్ : రూ. 69,999 ధర కలిగిన ఈ ఫోన్ కూపన్ ఆఫర్లు, 3 నెలల నో-కాస్ట్ ఈఎంఐ వెసులుబాటుతో రూ. 46,499 ఎఫెక్టివ్ ధరకు లభిస్తోంది.
{{/usCountry}}వన్‌ప్లస్ నార్డ్ 6 : రూ. 52,999 ధర కలిగిన ఈ మిడ్-రేంజ్ పాపులర్ ఫోన్, బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ బెనిఫిట్స్‌తో రూ. 42,999 కి లభిస్తోంది. దీనిపై 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ అందుబాటులో ఉంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్- బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారి కోసం ఐకూ జెడ్11ఎక్స్ఏ మోడల్ రూ. 40,999 నుంచి రూ. 24,999 కే అందుబాటులో ఉంది. మరోవైపు రెడ్‌మీ 15సీ 5జీ ప్రైమ్ మోడల్ అసలు ధర రూ. 29,999 కాగా, సేల్‌లో కేవలం రూ. 15,999 ధరకే దక్కుతోంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్- బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు..
వివిధ ఫోన్లపై ఉన్న ప్రత్యక్ష తగ్గింపులతో పాటు కొనుగోలుదారుల కోసం అమెజాన్ అదనపు ప్రయోజనాలను అందిస్తోంది:
బ్యాంక్ డిస్కౌంట్: ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్: పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 70,000 వరకు పొదుపు చేయవచ్చు.
ఈఎంఐ, కూపన్లు: నెలవారీ ఈఎంఐ రూ. 2,944 నుంచి ప్రారంభమవుతోంది. దీనికి తోడు ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 7,500 వరకు విలువైన డిస్కౌంట్ కూపన్లు కూడా లభిస్తున్నాయి.
మరి ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026లో మీరు ఏ స్మార్ట్‌ఫోన్‌ని కొంటున్నారు?