...
...
Next Story

Amazon Great Summer Sale : స్మార్ట్​ఫోన్​ కొనాలా? అమెజాన్​లో ఈ గ్యాడ్జెట్స్​పై భారీ తగ్గింపు..

Amazon sale : భారతీయ కస్టమర్ల కోసం అమెజాన్ 'గ్రేట్ సమ్మర్ సేల్'ను ప్రారంభించింది. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలపై ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించగా.. ముఖ్యంగా రెడ్‌మీ ఫోన్లపై భారీగా ధరలు తగ్గాయి. ఆ వివరాలపై ఇక్కడ ఒక లుక్కేయండి..

Published on: May 9, 2026, 06:43:34 IST
Advertisement

వేసవి తాపాన్ని చల్లబరిచేలా అమెజాన్ ఇండియా తన ప్లాట్‌ఫామ్‌లో ‘గ్రేట్ సమ్మర్ సేల్’ని ఘనంగా ప్రారంభించింది. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ టీవీలు, ఏసీల వంటి గృహోపకరణాలపై అదిరిపోయే డీల్స్ అందుబాటులోకి వచ్చాయి. పరిమిత కాలం పాటు ఉండే ఈ సేల్‌లో నేరుగా ధర తగ్గింపుతో పాటు ఎక్స్​ఛేంజ్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్, బ్యాంక్ డిస్కౌంట్లు కస్టమర్లకు భారీ ఊరటనిస్తున్నాయి.

అమెజాన్ సేల్​లో రెడ్​మీ స్మార్ట్​ఫోన్స్​పై భారీ తగ్గింపు..
అమెజాన్ సేల్​లో రెడ్​మీ స్మార్ట్​ఫోన్స్​పై భారీ తగ్గింపు..

ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఈజీ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసే వారికి అర్హత గల ఉత్పత్తులపై అదనంగా 10 శాతం వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది.

ఈ నేపథ్యంలో అమెజాన్ గ్రేట్​ సమ్మర్​ సేల్​ 2026లో భాగంగా రెడ్​మీ స్మార్ట్​ఫోన్స్​పై లభిస్తున్న బెస్ట్​ డీల్స్​ గురించి ఇక్కడ తెలుసుకోండి..

అమెజాన్ గ్రేట్ సమ్మర్​ సేల్ 2026- రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్ డీల్స్..

బడ్జెట్, ప్రీమియం మిడ్-రేంజ్ విభాగాల్లో పాపులర్ అయిన రెడ్‌మీ ఫోన్ల ధరలు భారీగా తగ్గాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:

రెడ్‌మీ నోట్ 15 ప్రో+ 5జీ : ప్రీమియం ఫీచర్లతో వచ్చే ఈ ఫోన్ వాస్తవ ధర రూ. 39,999 కాగా, సేల్‌లో భాగంగా బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ. 37,249కే సొంతం చేసుకోవచ్చు.

రెడ్‌మీ నోట్ 15 ప్రో 5జీ : రూ. 33,999 విలువైన ఈ స్మార్ట్‌ఫోన్‌పై దాదాపు రూ. 6,500 తగ్గింపు లభిస్తోంది. ప్రస్తుతం ఇది రూ. 27,499 కే అందుబాటులో ఉంది.

రెడ్‌మీ నోట్ 14 ప్రో+ ప్రైమ్ ఎడిషన్: ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్ రూ. 34,099 ధరకు లభిస్తోంది.

రెడ్‌మీ నోట్ 14 ప్రో 5జీ ప్రైమ్ ఎడిషన్: ఈ మోడల్‌ను రూ. 25,499కే కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మీ ఏ7 ప్రో 5జీ : ఎంట్రీ లెవల్ 5జీ స్మార్ట్​ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీని ధర రూ. 15,999 నుంచి ఏకంగా రూ. 11,999 కి పడిపోయింది.

స్మార్ట్‌ఫోన్లే కాకుండా ల్యాప్‌టాప్‌లు, ఎయిర్ కండిషనర్లపై కూడా భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఒక మంచి అవకాశం. అయితే ఈ ఆఫర్లు స్టాక్ ఉన్నంత వరకు లేదా పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయని గమనించాలి.

ఏసీలు, ఫ్రిడ్జ్​లు..

ఈ అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​లో స్మార్ట్​ఫోన్స్​తో పాటు అనేక ఎలక్ట్రానిక్స్​పైనా అదిరే ఆఫర్లు ఉన్నాయి.

ఏసీలు, ఫ్రిడ్జ్​లు- ఈ ఎండల తీవ్రత నుంచి తప్పించుకోవడానికి ఏసీలపై అమెజాన్ ఏకంగా 55% వరకు తగ్గింపును ప్రకటించింది. ఇన్వర్టర్ ఏసీలు, స్మార్ట్ కూలింగ్ ఫీచర్లు ఉన్న మోడళ్లు ఇప్పుడు సామాన్యులకు అందుబాటు ధరలోకి వచ్చాయి. అలాగే, రిఫ్రిజిరేటర్లపై 50% వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. సింగిల్ డోర్ నుంచి లార్జ్ కెపాసిటీ సైడ్-బై-సైడ్ మోడళ్ల వరకు అన్నీ ఆఫర్లలో ఉన్నాయి.

వాషింగ్ మెషీన్లు: ఫుల్లీ ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లపై 60శాతం వరకు భారీ తగ్గింపు ఉంది. ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ మోడళ్లలో మీకు నచ్చిన బ్రాండ్‌ను తక్కువ ధరకే ఎంచుకోవచ్చు.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe