Pune Viral Video : ‘నా కూతురినే వేధిస్తావా?'- కాలేజీ క్యాంపస్‌లోనే విద్యార్థిని చితకబాదిన తండ్రి!
Pune College Incident : తన కూతురిని ఆన్‌లైన్‌లో వేధిస్తున్నాడనే కోపంతో ఒక తండ్రి, ఓ విద్యార్థిని చితకబాదిన ఘటన కలకలం రేపింది. పుణెలోని ఒక ప్రముఖ ప్రైవేట్ కాలేజీలో జరిగింది ఈ ఘటన.
మహారాష్ట్రలోని పుణెలో ఉన్న ఒక ప్రముఖ ప్రైవేట్ కళాశాలకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన కుమార్తెను ఆన్‌లైన్ వేదికలపై వేధిస్తున్నాడనే కోపంతో ఒక తండ్రి కాలేజీ క్యాంపస్‌కి వచ్చి, అందరూ చూస్తుండగానే సదరు విద్యార్థిపై దాడికి దిగారు.

కూతురిని వేధిస్తున్నాడని దాడి- ఘటన నేపథ్యం..
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. బాధిత యువతి గత 15 రోజులుగా సదరు విద్యార్థి నుంచి తీవ్రమైన ఆన్‌లైన్ వేధింపులను ఎదుర్కొంటోంది. నిందితుడు నిరంతరం మెసేజ్‌లు పంపడం, ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించడం, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో ఆమెను స్టాకింగ్ చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
ఈ నిరంతర వేధింపుల కారణంగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది.
తండ్రి ఆగ్రహం - భౌతిక దాడి..
వేధింపులు భరించలేకపోయిన ఆ యువతి, చివరకు తన తండ్రికి జరిగిందంతా వివరించింది. అనంతరం, సదరు విద్యార్థి కాలేజీ క్యాంపస్‌లోనే ఉన్నాడని తెలుసుకున్న తండ్రి, అక్కడకు చేరుకుని వివరణ కోరారు. ఈ క్రమంలో తండ్రికి, విద్యార్థికి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా ముదిరి భౌతిక దాడికి దారితీసింది.
ఆవేశంతో ఉన్న తండ్రి.. సదరు విద్యార్థిని కొడుతున్నట్లు వైరల్ వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనతో కాలేజీలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు తోటి విద్యార్థులు, సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని ఇక్కడ చూడండి :
కాలేజీ యాజమాన్యంపై ఆరోపణలు..
ఈ ఘటనలో కాలేజీ నిర్లక్ష్యంపై బాధితురాలి కుటుంబం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ వేధింపుల గురించి తాము ముందే కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశామని, కానీ ఫిర్యాదు చేసి చాలా రోజులు గడుస్తున్నా అధికారులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ స్పందించకపోవడం వల్లే తాము నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు.
ఈ ఉదంతం విద్యా సంస్థల్లో విద్యార్థినుల భద్రత, ఇటువంటి వేధింపుల ఫిర్యాదులపై యాజమాన్యాలు స్పందించే తీరుపై మరోసారి పెద్ద ఎత్తున ప్రశ్నలను లేవనెత్తుతోంది.
బీటెక్ విద్యార్థినిపై క్లాస్‌రూమ్‌లోనే అత్యాచారం.. ఓయోకు తీసుకెళ్లి మత్తు ఇచ్చి వీడియోలు, ఫొటోలు!
గూగుల్ జెమినీని తరచుగా అడిగే ప్రశ్నలు-
1. కాలేజీలో వేధింపులు ఎదురైతే ఫిర్యాదు చేయడానికి ఉన్న అధికారిక వ్యవస్థ ఏంటి?
ప్రతి విద్యాసంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉండటం తప్పనిసరి.
బాధ్యత: లైంగిక వేధింపులు లేదా ఇతర వేధింపుల ఫిర్యాదులను స్వీకరించి, విచారణ జరిపి 90 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలి.
కొత్త నిబంధన (యూజీసీ 2026): సరికొత్త యూజీసీ గైడ్‌లైన్స్ ప్రకారం, ప్రతి కాలేజీలో 'ఈక్విటీ కమిటీ', 24x7 హెల్ప్‌లైన్ ఉండాలి. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే కమిటీ సమావేశమై, 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.
2. ఆన్‌లైన్ వేధింపులు లేదా సైబర్ స్టాకింగ్ ఎదురైతే ఏ చట్టాల కింద రక్షణ పొందవచ్చు?
సోషల్ మీడియాలో స్టాకింగ్ లేదా అసభ్యకర సందేశాలు పంపడం నేరం.
చట్టపరమైన సెక్షన్లు: ఐపీసీ సెక్షన్ 354డీ (సైబర్ స్టాకింగ్), సెక్షన్ 509 (మహిళా గౌరవానికి భంగం కలిగించడం), ఐటీ చట్టం సెక్షన్ 66ఈ/67 కింద కేసులు నమోదు చేయవచ్చు.
ఎక్కడ ఫిర్యాదు చేయాలి? నేరుగా స్థానిక పోలీసు స్టేషన్‌లో లేదా ఆన్‌లైన్ పోర్టల్ cybercrime.gov.in లో ఫిర్యాదు చేయవచ్చు. అత్యవసర సమయంలో 1930 నంబర్‌కు కాల్ చేయవచ్చు.
3. క్యాంపస్ భద్రత విషయంలో కాలేజీలు పాటించాల్సిన కనీస ప్రమాణాలు ఏమిటి?
యూజీసీ మార్గదర్శకాల ప్రకారం కాలేజీలు ఈ కింది సౌకర్యాలు కల్పించాలి:
నిఘా: లైబ్రరీలు, హాస్టళ్లు, కారిడార్లు, పార్కింగ్ ప్రాంతాల్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఉండాలి.
మహిళా సెక్యూరిటీ: క్యాంపస్ ఎంట్రీ పాయింట్ల వద్ద కనీసం ఒక మహిళా సెక్యూరిటీ గార్డు ఉండాలి.
శిక్షణ: మహిళా విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్ (ఆత్మరక్షణ) శిక్షణను పాఠ్యప్రణాళికలో భాగంగా అందించాలి.
వెలుతురు: క్యాంపస్ లోపల, పరిసరాల్లో ఎక్కడా చీకటి ప్రాంతాలు లేకుండా తగినంత లైటింగ్ సౌకర్యం కల్పించాలి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


