ఒక తండ్రికి తన బిడ్డను సాగనంపడం కంటే మించిన శోకం మరొకటి ఉండదు. వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ప్రస్తుతం అటువంటి పుత్రశోకంలో మునిగిపోయారు. ఆయన కుమారుడు, హిందుస్థాన్ జింక్ చైర్మన్ అగ్నివేష్ అగర్వాల్ (49) బుధవారం న్యూయార్క్‌లోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదం నుంచి కోలుకుంటున్న సమయంలోనే మృత్యువు ఆయనను కబళించింది.
కోలుకుంటున్న వేళ.. ఊహించని గుండెపోటు

అగ్నివేష్ అగర్వాల్ అమెరికాలో స్కీయింగ్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఆ తర్వాత న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రమాదం నుంచి బయటపడ్డారని కుటుంబ సభ్యులు భావించారు. కానీ, విధి వెక్కిరించింది. హఠాత్తుగా వచ్చిన గుండెపోటు అగ్నివేష్ ప్రాణాలను బలితీసుకుంది.
"నా ప్రపంచం ముక్కలైంది.."
ఈ విషాద వార్తను అనిల్ అగర్వాల్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. "ఈ రోజు నా జీవితంలో అత్యంత చీకటి రోజు. నా ప్రియతమ కుమారుడు అగ్నివేష్ మమ్మల్ని వదిలి చాలా త్వరగా వెళ్లిపోయాడు. కేవలం 49 ఏళ్ల వయసు.. ఎన్నో కలలు, ఎంతో ఉత్సాహంతో ఉండేవాడు. స్కీయింగ్ ప్రమాదం తర్వాత ఆసుపత్రిలో బాగానే కోలుకుంటున్నాడు, కష్టం గడిచిపోయింది అనుకున్నాం. కానీ ఆ గుండెపోటు మా కుమారుడిని లాగేసుకుంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక తండ్రిగా పడుతున్న బాధను వర్ణిస్తూ.. "తండ్రి కంటే ముందే కుమారుడు వెళ్లకూడదు. ఈ లోటు మమ్మల్ని ఎంతగా క్రుంగదీసిందో మాటల్లో చెప్పలేను. అతను నాకు కేవలం కొడుకు మాత్రమే కాదు.. ఒక మంచి స్నేహితుడు, నా గర్వం, నా ప్రపంచం" అని పేర్కొన్నారు. అనిల్ అగర్వాల్ భార్య కిరణ్ కూడా ఈ విషాదంతో కుప్పకూలిపోయారు.
ఆశయాల వారసుడు
అగ్నివేష్ అగర్వాల్ కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు.. క్రీడాకారుడిగా, సంగీత విద్వాంసుడిగా, సమర్థుడైన నాయకుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో ఆయనకు గట్టి నమ్మకం ఉండేదని అనిల్ అగర్వాల్ గుర్తు చేసుకున్నారు. "భారతదేశంలో ఏ బిడ్డ ఆకలితో నిద్రపోకూడదని, ప్రతి మహిళా సొంతకాళ్లపై నిలబడాలని మేము కలలు కన్నాం. మా సంపాదనలో 75 శాతం సమాజానికే తిరిగి ఇచ్చేస్తానని అగ్నివేష్‌కు నేను మాట ఇచ్చాను. నేడు ఆ మాటను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాను, ఆ ఆశయం కోసమే జీవిస్తాను" అని ఆయన తన నివాళిలో తెలిపారు.
అగ్నివేష్ ప్రస్థానం
{{/usCountry}}అగ్నివేష్ అగర్వాల్ కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు.. క్రీడాకారుడిగా, సంగీత విద్వాంసుడిగా, సమర్థుడైన నాయకుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో ఆయనకు గట్టి నమ్మకం ఉండేదని అనిల్ అగర్వాల్ గుర్తు చేసుకున్నారు. "భారతదేశంలో ఏ బిడ్డ ఆకలితో నిద్రపోకూడదని, ప్రతి మహిళా సొంతకాళ్లపై నిలబడాలని మేము కలలు కన్నాం. మా సంపాదనలో 75 శాతం సమాజానికే తిరిగి ఇచ్చేస్తానని అగ్నివేష్‌కు నేను మాట ఇచ్చాను. నేడు ఆ మాటను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాను, ఆ ఆశయం కోసమే జీవిస్తాను" అని ఆయన తన నివాళిలో తెలిపారు.
అగ్నివేష్ ప్రస్థానం
{{/usCountry}}చదువు: అజ్మీర్‌లోని ప్రఖ్యాత మాయో కాలేజీలో విద్యాభ్యాసం చేశారు.
వ్యాపారం: ఫుజైరా గోల్డ్ సంస్థను స్వయంగా స్థాపించారు.
బాధ్యతలు: మరణించే సమయానికి ఆయన హిందుస్థాన్ జింక్ చైర్మన్‌గా ఉన్నారు. అలాగే వేదాంత గ్రూపునకు చెందిన తల్వాండీ సాబో పవర్ లిమిటెడ్ (TSPL) బోర్డులో సభ్యుడిగా సేవలందిస్తున్నారు.