ఏపీ ఈసెట్‌ -2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల... ముఖ్య తేదీలివే

ఏపీఈసెట్‌ - 2025 అభ్యర్థులకు మరో అప్డేట్ వచ్చేసింది. కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. జూలై 4వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.  జూలై13వ తేదీన సీట్లను కేటాయించనున్నారు.

Published on: Jul 2, 2025, 11:15:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బీటెక్‌ సెకండ్ ఇయర్ లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈసెట్‌ - 2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు అధికారులు వివరాలను వెల్లడించారు. ఎంట్రెన్స్ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు….. జూలై 4 నుంచి ఫీజు చెల్లించుకోవచ్చు. జూలై 13వ తేదీన సీట్లను కేటాయించనున్నారు.

ఏపీఈసెట్‌ కౌన్సెలింగ్‌ 2025
ఏపీఈసెట్‌ కౌన్సెలింగ్‌ 2025

ముఖ్య తేదీలు…

  • ఏపీ ఈసెట్‌ - 2025 కౌన్సెలింగ్‌ జూలై 4 నుంచి ప్రారంభమవుతుంది.
  • అర్హులైన అభ్యర్థులు జూలై 8వ తేదీ వరకు ఫీజు చెల్లింపుతో పాటు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
  • జూలై 4 వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌ సర్టిఫికెట్ల అప్ లోడ్ కుఅవకాశంఉంటుంది.
  • జూలై 7వ తేదీ నుంచి 10 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక
  • జూలై 11వ తేదీన వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుంది.
  • జూలై 13వ తేదీన సీట్లను కేటాయిస్తారు.
  • సీట్లు పొందిన విద్యార్థులు 14 నుంచి 17లోపు ఆయా కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది.
  • జూలై 14వ తేదీ నుంచి నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

ఏపీ ఈసెట్ప్రవేశ పరీక్ష బాధ్యతలను అనంతపురం జేఎన్టీయూ చూస్తోంది. ఈ ఏడాది మొత్తం 35,187 మంది పరీక్షలకు హాజరవ్వగా…31,922 మంది ఉత్తీర్ణులయ్యారు. డిప్లమా, బీఎస్సీ(గణితం) డిగ్రీ విద్యార్థులు నేరుగా ఇంజినీరింగ్ సెకండియర్ చేరేందుకు ఈసెట్ నిర్వహిస్తారు. మే 6వ తేదీన ఈ ఎగ్జామ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీ ఈసెట్ ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు అమ్మాయి గంగా భవాని బీఎస్సీ(గణితం) విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది.

ఈసెట్ లో అర్హత సాధించిన వారికి పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్య్ అభ్యర్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. ర్యాంకులతో పాటు రిజర్వేషన్లు ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More