ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు - ఈ నెల 17న సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్, ప్రొవిజినల్ లిస్ట్ ఇలా చెక్ చేసుకోండి

ఏపీ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. జూలై 17వ తేదీన సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అర్హులైన విద్యార్థుల వివరాలను వెబ్ సైట్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి…

Published on: Jul 14, 2025, 11:50:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. కౌన్సెలింగ్ అనంతరం 4 ట్రిపుల్ ఐటీల్లో కలిపి 598 సీట్లు మిగిలాయి. దీంతో ఈ సీట్ల భర్తీకి జూలై 17వ తేదీన సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

ట్రిపుల్‌ఐటీ రెండో విడత కౌన్సెలింగ్‌
ట్రిపుల్‌ఐటీ రెండో విడత కౌన్సెలింగ్‌

వెబ్ సైట్ లో వివరాలు…

కౌన్సెలింగ్ కు అర్హత సాధించిన విద్యార్థుల వివరాలను వెబ్ సైట్ https://www.rgukt.in/ లో పొందుపరిచారు. అంతేకాకుండా విద్యార్థులకు కూడా సమాచారం పంపించారు. ట్రిపుల్‌ఐటీకి ఎంపికైన విద్యార్థులు నూజివీడు, ఇడుపులపాయ క్యాంపస్ కేంద్రాల్లో నిర్వహించే కౌన్సెలింగ్ కు హాజరుకావాల్సి ఉంటుంది. ఎన్‌సీసీ, క్రీడా కోటాకు సంబంధించిన ఎంపిక జాబితా ప్రకటించాల్సి ఉంది.

రాష్ట్రంలోని ఒక్కో ట్రిపుల్ ఐటీలో 1,010 సీట్లు ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ తర్వాత… నూజివీడులో 139, ఇడుపులపాయలో 132, శ్రీకాకుళంలో 144, ఒంగోలులో అత్యధికంగా 183 సీట్లు మిగిలాయి. ఈ సీట్లను భర్తీ చేసేందుకు ఈ నెల 17వ తేదీన రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కాగా ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందిన వారికి ఇవాళ్టి నుంచే (జూలై 14)తరగతులను ప్రారంభించనున్నారు.

పదో తరగతిలో మార్కుల ఆధారంగా 6 ఏళ్ల బీటెక్ కోర్సులో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈసారి ట్రిపుల్‌ ఐటీల్లో 94.78 శాతం సీట్లను(మొదటి విడత) ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు సాధించినట్లు అధికారులు వెల్లడించారు.

మొదటి రెండేళ్లు ప్రీ యూనివర్సిటీ కోర్సుగా (యూపీసీ) పరిగణిస్తారు. మిగతా నాలుగేళ్లు బీటెక్‌ చదువుతారు. ఈసారి ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు మొత్తం 50,541 దరఖాస్తులు రాగా.. వాటిల్లో నుంచి నాలుగు క్యాంపస్‌లకు కలిపి మెరిట్ జాబితాలను ఇటీవలనే విడుదల చేశారు.ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన తర్వాత… సీట్లను ఖరారు చేశారు.

ఈ లింక్ పై క్లిక్ చేసి రెండో విడత కౌన్సెలింగ్ కు ఎంపికైన వారి వివరాలను తెలుసుకోవచ్చు

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More