...
...
Next Story

iPhone 17 : యాపిల్​ లవర్స్​కి షాక్ తప్పదా? ఐఫోన్ 17 సిరీస్ ధరలు భారీగా పెంపు!

భారత్‌లో ఐఫోన్ 17 సిరీస్ మోడళ్ల ధరలు రూ.12,000 వరకు పెరిగే అవకాశం ఉందని లీకులు వెల్లడిస్తున్నాయి. ఆగస్టు తొలివారం నుంచి కొత్త ధరలు అమలులోకి రావచ్చని, అదే సమయంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా సరఫరా కొరత కూడా వేధిస్తోందని నిపుణులు తెలిపారు.

Published on: Jul 23, 2026, 17:32:52 IST
Advertisement

భారత్‌లో తన హార్డ్‌వేర్ ఉత్పత్తులైన ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్‌లు, యాపిల్ టీవీ, హోమ్‌పాడ్‌ల ధరలను టెక్ దిగ్గజం 'యాపిల్' భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఐఫోన్లను మినహాయించినప్పటికీ, ఇప్పుడు ఐఫోన్ ప్రేమికులకు చేదు వార్త అందే సూచనలు కనిపిస్తున్నాయి! భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘ఐఫోన్ 17 సిరీస్’ మోడళ్ల ధరలను పెంచేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి.

ఐఫోన్ 17 సిరీస్ ధరలు భారీగా పెంపు! (REUTERS)
ఐఫోన్ 17 సిరీస్ ధరలు భారీగా పెంపు! (REUTERS)

ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పంచుకున్న సమాచారం ప్రకారం.. యాపిల్ ఆథరైజ్డ్ ఆఫ్‌లైన్ రిటైలర్ ‘ఐప్లానెట్’ డీలర్లకు ధరల పెంపునకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే అందించింది.

ఐఫోన్ 17 సిరీస్ కొత్త ధరలు ఎలా ఉండబోతున్నాయి?

ప్రస్తుతం బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. ప్రాథమిక ఐఫోన్ 17 మోడల్ ధర అత్యధికంగా రూ.12,000 వరకు పెరిగే అవకాశం ఉంది.

ఐఫోన్ 17 (256జీబీ బేస్ వేరియంట్): సెప్టెంబర్ 2025లో ప్రారంభ ధర రూ.82,900కు విడుదలైంది. అయితే ఆగస్టు మొదటి వారం నాటికి దీని ధర రూ.94,990కి చేరే అవకాశం ఉంది. (విడుదల సమయంలో 512జీబీ వేరియంట్ ధర రూ.1,02,900గా ఉండేది. దీని ధర ఇప్పుడు ఎంత పెరుగుతుందో చూడాలి).

ఐఫోన్ 17 ప్రో అండ్ ప్రో మ్యాక్స్: వీటి ధరలు కూడా భారీగా పెరగవచ్చని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఐఫోన్ 17 ప్రో ప్రారంభ ధర రూ.1,34,900గా ఉండగా, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర రూ.1,49,900 వద్ద ఉంది.

ఐఫోన్ ఎయిర్ : ఈ మోడల్‌పై కూడా ధరల ప్రభావం ఉంటుందా లేదా అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు.

దేశవ్యాప్తంగా ఐఫోన్ 17 స్టాక్ కొరత!

ధరల పెంపు వార్తలతో పాటు భారత మార్కెట్లో ఐఫోన్ 17 సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్లలో వివిధ మోడళ్ల లభ్యత తక్కువగా ఉంది. యాపిల్ తన సప్లై చైన్‌కు పంపిన సమాచారం ప్రకారం.. వచ్చే వారాంతం నాటికి భారత డీలర్లకు కొత్త ఐఫోన్ స్టాక్ చేరుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఐఫోన్ల ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటి?

ఈ ధరల సవరణ ఆశ్చర్యకరమైనదేమీ కాదని ఆటో, టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.

జపాన్‌లో ఇప్పటికే పెంపు: ఇటీవల యాపిల్ జపాన్‌లో ఐఫోన్ల ధరలను ఏకంగా 11.3 శాతం వరకు పెంచింది. ఉదాహరణకు, అక్కడ సాధారణ ఐఫోన్ 17 ధర 129,800 యెన్ (సుమారు రూ. 76,900) నుంచి 142,800 యెన్ (సుమారు రూ. 84,600) కు పెరిగింది.

చిప్‌సెట్ అండ్ మెమరీ ఖర్చులు పెరగడం: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగానికి గ్లోబల్ డిమాండ్ విపరీతంగా పెరగడంతో.. తయారీదారులు ఉపయోగిస్తున్న డీఆర్‌ఏఎమ్, ఎన్‌ఏఎన్‌డీ ఫ్లాష్ స్టోరేజ్ విడిభాగాల ధరలు ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగాయి.

భారత్‌లో గత నెల ధరల ప్రభావం: గతేడాది కాంపోనెంట్ల వ్యయం పెరగడం వల్ల ఆపిల్ భారత మార్కెట్లో మ్యాక్‌బుక్, ఐప్యాడ్‌ల ధరలను రూ.5,000 నుంచి రూ.1 లక్ష వరకు పెంచింది. ఆ సమయంలో ఐఫోన్లు, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్‌లను మినహాయించినప్పటికీ.. ఇప్పుడు విడిభాగాల భారం పెరగడంతో ఐఫోన్ల ధరలను కూడా పెంచక తప్పడం లేదని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

ఒకవేళ ఆగస్టు ప్రారంభంలో కొత్త ధరలు అమల్లోకి వస్తే, దాని కన్నా ముందు.. పాత ధరలోనే ఐఫోన్ 17 సొంతం చేసుకోవడానికి ప్రస్తుత సమయం మంచి అవకాశమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks